muthireddy yadagiri reddy
-
ఘన్‌పూర్‌లో రాజయ్యకు, జనగాంలో ముత్తిరెడ్డికి నో టికెట్స్
-
ఇద్దరు కలిసిపాయిండ్రు
-
జనగామ బీఆర్ఎస్ లో టికెట్ జగడానికి తెరపడినట్లేనా..?
-
పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హీటెక్కించిన జనగామ జగడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెక్ పెట్టారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జనగామ ప్రజాప్రతినిధులు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో మరో ఇద్దరు టికెట్ ఆశావహులు మండల శ్రీరాములు మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. మరోవైపు, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న తరుణంలో పల్లాను గెలిపించుకోవాలంటూ.. ఈ రోజు జరిగిన భేటీలో కేటీఆరే స్వయంగా చెప్పారు. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!? -
జనగామ బరిలో నేనే ఉంటా
జనగామ: తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ముత్తిరెడ్డి.. కార్యక్రమం అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, ఆ మేరకే ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్య త లు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవుళ్ల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి కృషి చేస్తానన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండీగా ఉంటూ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని, తాను కూడా సంస్థ ఉద్యోగుల్లో ఒకడిగా వ్యవహరిస్తూ సంస్థ బాగుకు యత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎండీ సజ్జనార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను, ఓ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు కీలక పదవులు లభించాయి. వీరితో పాటు ఇటీవల పారీ్టలో చేరిన ఉప్పల వెంకటేశ్ గుప్తా, నందికంటి శ్రీధర్‌కు కూడా అధికారిక పదవులు దక్కాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆరీ్టసీ) చైర్మన్‌గా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య రైతుబంధు సమితి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక ఉప్పల వెంకటేశ్ గుప్తా (కల్వకుర్తి)ను మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా, నందికంటి శ్రీధర్ (మల్కాజిగిరి)ను ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. రాజీ ఫార్ములాలో భాగంగానే..! బీఆర్ఎస్ టికెట్లు దక్కని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు రాజీ ఫార్ములాలో భాగంగా ఈ పదవులు దక్కాయి. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్ నాలుగు రోజుల క్రితమే బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో..ఆ పార్టీకి చెందిన నందికంటి శ్రీధర్‌ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించి తాజాగా ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. మరోవైపు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడిన నేపథ్యంలో అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా ఉప్పల వెంకటేశ్‌కు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి అప్పగించారు. చదవండి: సిక్కిం వరదల్లో నిజామాబాద్ ఆర్మీ జవాన్ మృతి -
వర్గాల పేర్లతో క్యాడర్ ను విభజిస్తున్నారు: ముత్తిరెడ్డి
-
మార్పు కోసం ఒప్పించక తప్పదు: పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, జనగామ: తెలంగాణ ఎన్నికలకు సన్నాహాకాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వేళ.. రాజకీయ పరిణామాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారికంగా జాబితా ప్రకటించేసింది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ప్రకటనను వీలైనంత త్వరగా ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పెండింగ్‌లో ఉన్న స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో.. పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. జనగాం అసెంబ్లీ టికెట్ పల్లా రాజేశ్వరరెడ్డికి దక్కుతుందనే ప్రచారం బలంగా సాగుతున్నవేళ.. ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దామని ట్వీట్ చేశారు. ‘‘ఎక్కడైనా మార్పు జరగాలనుకున్నప్పుడు ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను ఒప్పించి ముందుకు సాగాలన్నారు. స్టేషన్ ఘనపూర్‌లోను ఎమ్మెల్యే రాజయ్యను మార్చి కడియం శ్రీహరికి ఇచ్చారని, దీంతో తాము రాజయ్యను కలిసి మాట్లాడామన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ను కచ్చితంగా గెలిపించుకోవాలన్నారు. జనగామలోను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పదేళ్లుగా బాగా పని చేశారన్నారు. ఆయన ఉద్యమంలో కూడా ఉన్నారని గుర్తు చేశారు. అయితే కొన్ని ఇబ్బందులవల్ల జనగామలో మనం(BRS) ఓడిపోయే అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి అంటే గౌరవం ఉందన్నారు. ముత్తిరెడ్డిని పిలిపించి మాట్లాడుతారని, అందరం ఏకతాటిపై వెళ్దామన్నారు. తాను కేసీఆర్, ముత్తిరెడ్డిల ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. రేపు ఎన్నికల్లో కేసీఆర్ ఆశీర్వాదంతో పాటు మంత్రులు, ముత్తిరెడ్డి సహా అందరం కలిసికట్టుగా ముందుకు సాగి జనగామలో బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రేపో ఎల్లుండో కేసీఆర్ టిక్కెట్ ప్రకటించాక అందరం కలిసి వెళ్దామన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ముత్తిరెడ్డి గారి మద్దతు, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో జనగాంలో గులాబీ జెండా ఎగరేద్దాం. pic.twitter.com/Y1eRUr9jDC — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 పార్టీకి, కేసీఆర్ గారికి గెలుపోవటములే గీటురాయి.. ఎవరూ దగ్గర, దూరం కాదు. pic.twitter.com/bXmzDHSitA — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 కేసీఆర్ గారు అప్పగించిన ప్రతి పనిని బాధ్యతగా సక్రమంగా నిర్వహించడం జరిగింది. pic.twitter.com/DBBQ1tQiKR — Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) September 23, 2023 -
పల్లాకు డబ్బు మదం ఎక్కువైంది: ముత్తిరెడ్డి
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి డబ్బు మదం ఎక్కువైందని, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అధర్మం, సీఎం సంకల్పానికి విరుద్ధమని ముత్తిరెడ్డి ఆరోపించారు. ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఫోన్లుచేస్తూ డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వారిని ‘కుక్కలు’అనడం పల్లా అహంకారానికి నిదర్శనమన్నారు. నాకే నర్సాపూర్ టికెట్ ఇవ్వాలి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని, తనకు నర్సాపూర్ టికెట్ కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏ ఆలోచనతో నర్సాపూర్ టికెట్ ప్రకటించకుండా ఆపారో తెలియదని, పునరాలోచించి తనకే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి బీఆర్ఎస్లో చేరారని, ఇక్కడ కేబినెట్ కేడర్ హోదాలో ఉన్నారని పరోక్షంగా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు. తనకు మంత్రి హరీశ్‌రావు అండదండలు ఉన్నాయన్నారు. టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తారని విలేకరులు అడగ్గా.. టికెట్ తనకే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చదవండి: Thummala: తుమ్మల చేజారిపోకుండా.. టికెట్ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈసారి తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. ఆయన సోమవారం మహబూబాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంత బలం ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఒక వేళ ఇవ్వకపోతే ఖద్దరు బట్టలు కాకుండా.. ఎర్రటి వస్త్రాలు ధరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు. -
పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు మరింత రాజుకుంటోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని పల్లాను డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఇన్ బ్యాలెన్స్ ఉండేందుకు. అందుకే ఆహ్వానించారే తప్ప కుక్కల్ని చేయడానికి కాదని విషయాన్ని గమనించాలి. పల్లా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాలి అని ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చారు. ‘ బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు. అటువైపు ఉంటే మొరుగుతారనే బీఆర్ఎస్లో చేర్చుకొని దొడ్లో కట్టేశారు. అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకుని.. వారిని పిల్లిలాగా కేసీఆర్ మార్చేశారు. అలా కేసీఆర్ వారిని గీత దాటకుండా చేసేశారు’ అని వ్యాఖ్యానించారు పల్లా. ముత్తిరెడ్డి ఆగ్రహం.. పల్లా వ్యాఖ్యలపై ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘బలుపెక్కువై డబ్బు ఎక్కువ ఉన్నవారు అమాయక ప్రజల మీద డబ్బులు చల్లి అయోమయానికి గురి చేస్తున్నారు. అలా చేయడం సీఎం కేసీఆర్ సంకల్పానికి విరుద్ధం. అమ్ముడుపోయేవారు ఆగమై మట్లే కలిసిపోతారు. కేసీఆర్ నిర్ణయం శిరోధార్యం. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందరం కలిసే ప్రయాణం చేస్తాం. ప్రజల అభిమానాన్ని కోరికను కేసీఆర్ తీరుస్తాడు. ముఖ్యమంత్రి పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. 14ఏళ్లుగా మీ కష్టాలు మీ జ్ఞాపకాలు కేసీఆర్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి సీఎం కోరిక తీరుస్తాడు. సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. భారీ మెజార్టీతో గెలుస్తాం’’ అని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ప్రసంగానికి అంతరాయం దివ్యాంగుల ఆసరా పెంపు కార్యక్రమంలో ఇవాళ ముత్తిరెడ్డి పల్లాపై మండిపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ జమున మాట్లాడారు. ముత్తిరెడ్డి కూడా తన బాధను చెప్పుకున్నారని, ఎవరికీ టికెట్ ఇచ్చిన పని చేయాలని ప్రసంగించారు. ఆ సమయంలో కార్యకర్తలు చైర్పర్సన్ ప్రసంగానికి అడ్డుతలిగారు. ముత్తిరెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. దీంతో ముత్తిరెడ్డి జోక్యం చేసుకునితన అనుచరుల్ని శాంతింపజేశారు. మరోవైపు జనగామ అభ్యర్థిని త్వరగా ఖరారు చేసి ఉత్కంఠకు తెరదించాలని ముత్తిరెడ్డి వర్గం బీఆర్ఎస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తోంది. -
జనగామపై వీడని పీటముడి!
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పీటముడి ఇంకా వీడలేదు. ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్క స్థానంపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జనగామ నుంచి బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్‌లో స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి పేరు వినిపించగా.. జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరే వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ముత్తిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారన్న సమాచారం మేరకు ఉదయమే హైదరాబాద్‌కు వెళ్లిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలను కలసినట్లు సమాచారం. అలాగే పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల అనుచరులు సైతం హరీశ్‌రావును కలసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు కూడా వేర్వేరుగా పార్టీ పెద్దలను కలసినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఈ స్థానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. 25న ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అయి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని ప్రకటించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్‌గా తనకే ఛాన్స్ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చాకే ఈ వివాదం పరిష్కారం అవుతుందన్న మరో వాదన పార్టీ ముఖ్యనేతల నుంచి వినిపిస్తోంది. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్ 1న కేటీఆర్ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. -
జనగామకు ‘పల్లా’ వద్దే వద్దు
జనగామ: బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయం మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోక్యం ఏమిటంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు జనగామ అర్బన్‌కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ‘పల్లా గో బ్యాక్’, ‘ముత్తిరెడ్డికి మూడోసారి టికెట్ ఇవ్వండి.. లేదంటే పోచంపల్లికి ఇచ్చినా పర్వాలేదు’అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో హైదరాబాద్–వరంగల్ హైవేపై నిరసనకు దిగాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. పల్లాకు జనగామతో పనేమిటని, ఆయనకు టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఆందోళనకారులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేసేందుకు ప్రయతి్నంచినా తర్వాత విరమించుకున్నారు. మొత్తంగా ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల ఆందోళనతో జనగామలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీనివాస్, మసివుర్ రెహమాన్, విష్ణువర్ధన్‌రెడ్డి, రేఖ, శ్రీనివాస్, మల్లాగారి రాజు, స్వప్నరాజు, శ్రీశైలం, మామిడాల రాజు, రామక్రిష్ణ, ఉడుగుల కిష్టయ్య, ప్రభాకర్, తిప్పారపు విజయ్, నాగరాజు, మిద్దెపాక లెనిన్, జూకంటి కిష్టయ్య, రమేష్, వంగ ప్రణీత్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లాకు జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి సింహం లాంటి సీఎం కేసీఆర్ పక్కన ఉండి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. శనివారం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు ఆయన నా ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అది అబద్ధమని చెప్పారు. ఆయన చూపిన సంస్కారానికి నా నమస్కారం. కానీ పల్లా ఎంత ఎత్తులో ఉన్నారో అంతటి స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నా వెనుక ఉన్న నాయకులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జనగామను మరో హుజూరాబాద్ చెయ్యాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. నా కుటుంబంలో కలహాలు రేపించినది ఎవరో అందరికీ తెలుసు..’’అని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో 2002 నుంచి కేసీఆర్ వెంట సైనికుడిలా పనిచేస్తున్నానని, తనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటించాలని సీఎంకు దండం పెట్టి విన్నవిస్తున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
కేసీఆర్‌కు ఇదే నా విన్నపం: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: నియోజకవర్గపు టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అంటూ ప్రచారం జరుగుతుండడంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఓవైపు ముత్తిరెడ్డి అనుచరులు పల్లాకి టికెట్ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కి రచ్చ చేస్తున్న వేళ.. మరోవైపు ముత్తిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కంటతడి పెట్టారాయన. ‘‘బుక్కెడు బువ్వ దొరకని జనగామ నియోజక వర్గాన్ని భారత దేశానికే అన్నం పెట్టేలా తీర్చిదిద్దాను. గెలిచే నియోజకవర్గాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిస్ట్రబ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ గా గెలిపిస్తే ఏడేళ్ళ లో జనగామకు ఏం చేశావో చెప్పు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి అసలేం చేశారు?. పైగా ఇప్పుడు డబ్బులు పంచి ప్రలోభ పెడుతున్నారు. ఎన్నికల ముందు డబ్బులు పంచి హుజురాబాద్‌లా జనగామను మార్చాలనుకున్నావా?.అధినేతను, పార్టీని డిస్ట్రబ్ చేయడం పల్లా మానుకోవాలి అని ముత్తిరెడ్డి హితవు పలికారు. నా బిడ్డను బజారుకు ఎక్కించావ్ ‘‘ఇంటెలిజెన్స్ అంటు నీ కాలేజీ వాళ్ళతో సర్వే చేసి పార్టీని నాశనం చేస్తున్నావు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కొడుకు నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు. (కొమ్మూరి కొడుకు తన కూతురు భర్త ఇద్దరూ క్లాస్ మేట్స్ అని చెప్పుకొచ్చారాయన). నా కుటుంబంలో కలహాలకు పల్లానే కారణం. నా బిడ్డ ను బజారుకు ఎక్కించింది పల్లానే. పల్లా జనగామ నాయకుల్ని మిస్ గైడ్ చేసి టూరిజం ప్లాజాకు తీసుకొచ్చారు. పార్టీ కి విరుద్దంగా గ్రూప్ లను ఎందుకు ప్రోత్సాహిస్తున్నావు పల్లా?. పార్టీ కి విరుద్దంగా పని చేయడం మానుకోండి. కేసిఆర్ వెంట 22ఏళ్ళు ఉన్నా, ఉద్యమంలో పల్లా నీ పాత్ర ఏంటీ? అంటూ నిలదీశారాయన. కేసీఆర్‌కు రిక్వెస్ట్ ‘‘పల్లా చేసే అధర్మ పని మానుకోవాలి. సీఎం ప్రకటించే వరకు ఎందుకు ఆగడం లేదు. పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంస్కారానికి నమస్కారం. ఉద్యమకారులను డిస్టర్బ్ చేస్తే కేసిఆర్ సహించరు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు కేసిఆర్ ను జనగామ ప్రజలు మరువలేరు. నాటి నుంచి నేటి వరకు కేసిఆర్ కు సైనికుడిగా పని చేశాను. 2004లో సామాజిక పరంగా టిక్కెట్ లభించకపోయిన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేసిఆర్ నినాదంతో ప్రచారంతో 60 వేల ఓట్లు తీసుకువచ్చా. 2009లో పాలకుర్తికి పోయినా కేసిఆర్ అడుగుజాడల్లో పనిచేశాను. 2014, 2018 లో కేసిఆర్ ఆశీస్సులతో జనగామ నుంచి పోటీ చేసి గెలిచి ప్రజా సేవలో నిమగ్నమయ్యాను. కేసిఆర్ సైనికుడిగా ఉంటా. ఆయన ఏ పని చెప్పినా చేస్తా.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, మొదటి లిస్ట్‌లోనే జనగామ టికెట్ ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వినతి చేశారు. బోరున విలపించిన సర్పంచ్ ప్రెస్ మీట్ సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని వడ్లకొండ సర్పంచ్ బొల్లం శారద పట్టుకుని బోరున విలపించారు. ‘కేసీఆర్ సార్ మమ్మల్ని ఏడ్పించకండి. ఒక్కసారి ముత్తిరెడ్డి కి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే మేమొచ్చి మాట్లాడుతాం సార్. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి కేసీఆర్ సార్’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
జనగామలో టెన్షన్ టెన్షన్.. పల్లా గో బ్యాక్.. ముత్తిరెడ్డి వర్గీయుల నిరసన
సాక్షి, జనగామ: బీఆర్ఎస్లో జనగామ టిక్కెట్ వివాదం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు రచ్చ రచ్చ చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారనే ప్రచారంతో ముత్తిరెడ్డి అనుచరులు గో బ్యాక్ పల్లా అంటూ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. చౌరస్తాలో బైఠాయించి ముత్తిరెడ్డికి టిక్కెట్ ఇస్తే గెలిపించి గిఫ్ట్ ఇస్తామని లేకుంటే పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. అటు స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు కడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగి దిష్టిబొమ్మలు దహనం చేశారు. చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు -
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బల ప్రదర్శన
జనగామ /కుషాయిగూడ (హైదరాబాద్): నియోజకవర్గంలో అసమ్మతి నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలో స్థానిక పార్టీ శ్రేణులతో ర్యాలీలు, సమావేశాలు జరపడంతోపాటు హైదరాబాద్‌లోనూ భేటీ అయ్యారు. స్థానిక నాయకత్వం తన వెంటే ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో అసమ్మతి వర్గం సమావేశం కావడం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి వెళ్లడంతో వాగ్వాదం జరగడం తెలిసిందే. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ అసమ్మతిని రాజేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించారు కూడా. ఈ క్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు తనతోనే ఉన్నాయనేలా గురువారం బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు ఏకకాలంలో మీడియా సమావేశాలు పెట్టి స్థానిక నేతలతో తనకు మద్దతు ప్రకటించేలా చేశారు. తర్వాత వారందరితో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉన్న నోమా ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సెలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలు తమ మద్దతు ముత్తిరెడ్డికే ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీలన్నీ ముత్తిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్టుగా చేసిన తీర్మానాల పత్రాలను ముత్తిరెడ్డికి అందజేశారు. కావాలని అభాసుపాలు చేస్తున్నారు: ముత్తిరెడ్డి తనపై కుట్రలు కొత్తేమీ కాదని.. ఇంతకుముందు 2014లో, 2018లోనూ కుట్రలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. తానేమిటో తెలిసిన సీఎం కేసీఆర్ రెండుసార్లు తనకే టికెట్ ఇచ్చారని.. నియోజకవర్గ ప్రజలు గెలిపించారని చెప్పారు. మల్లాపూర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాటి కుట్రల పాచికలు పారకపోవడంతో తాజాగా కుటుంబ కలహాల బూ చితో నన్ను అభాసుపాలు చేసేందుకు, వివాదా స్పదుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు అధినేత కేసీఆర్‌పై నమ్మకముంది. ఉద్యమ నాయ కుడిగా, పార్టీ సైనికుడిగా నాకు గుర్తింపునిస్తూనే వచ్చారు. భవిష్యత్తులో కూడా నాకు ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఈ సమావేశానికి సంబంధించిన అంతర్యాన్ని, నిర్ణయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా..’’ అని తెలిపారు. -
జనగామ ఎమ్మెల్యే టికెట్‌పై పోటాపోటీ సమావేశాలు
-
BRS Party: కారులో ‘సిట్టింగ్’ లొల్లి!..తెరపైకీ రోజుకో పంచాయితీ
సీన్ –1 హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా.. జనగామ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల నేతలు భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా.. ఈసారి జనగామ బీఆర్ఎస్ టికెట్‌ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలంటూ వారు సమావేశమయ్యారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేరుగా హరిత ప్లాజాకు వెళ్లడం, అక్కడి నేతలతో వాగ్వాదం వంటివి జరిగాయి. అసమ్మతి భేటీకి వచ్చినవారిలో ముఖ్య నేతలెవరూ లేరని ముత్తిరెడ్డి ప్రకటించగా.. నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, పలువురు సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు భేటీకి వచ్చినట్టు అసమ్మతి వర్గం తెలిపింది. సీన్ –2 మంథని నియోజకవర్గంలో.. ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం పెట్టారు. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఆయన పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతరులకు ఎవరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పుట్టమధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతామనీ ప్రకటించారు. ..అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఆయా ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిగా ఉన్నవారు, టికెట్ ఆశిస్తున్న ఇతర నేతల అనుచరులు బహిరంగంగానే ఈ వ్యతిరేకతను బయటపెడుతున్నారు. ఇప్పటికే కల్వకుర్తి, దేవరకొండ, చొప్పదండి, రామగుండం, నాగార్జున సాగర్, కోదాడ.. ఇప్పుడు జనగామ, మంథని.. ఇలా చాలాచోట్ల అసమ్మతి వ్యక్తమవుతోంది. వీటిపై దృష్టిపెట్టిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు సన్నాహాలు చేస్తున్నారనే సంకేతాలు ఆ పార్టీలో ‘లొల్లి’ రేపుతున్నాయి. సిట్టింగ్ స్థానాల్లో అసమ్మతులు, ఆశావహుల ప్రయత్నాలతో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు బలంగా తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు నేరుగా కోరుతుండగా.. మరికొందరు తెర వెనుక అసమ్మతిని రాజేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని, పైగా పోలీసు కేసులు, ఇతర రూపాల్లో వేధిస్తున్నారని నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజా, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు, ఇతర గ్రామ, మండల స్థాయి క్రియాశీల నేతలు ఉంటుండటం గమనార్హం. అంతర్గత భేటీలే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ తమ అసమ్మతిని, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అసమ్మతి పెరిగితే నష్టమనే అంచనాతో.. పార్టీ టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందనే నివేదికలు అందుతున్నట్టు సమాచారం. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలు, సిట్టింగ్‌లు సహా చాలా మందిపై క్షేత్రస్థాయి నుంచి ఆరోపణలు వస్తున్నాయని.. ఏకపక్ష ధోరణి, బంధుప్రీతి, అవినీతి, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని విషయాల్లో జోక్యం, పోలీసు, రెవెన్యూ అధికారులతో సొంత పార్టీ నేతలనే ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలు నివేదికల్లో ఉన్నాయని తెలిసింది. పార్టీ కేడర్‌ను ఎన్నికల దిశగా సన్నద్ధం చేసేందుకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలను విశ్లేషించగా.. చాలాచోట్ల విభేదాలు సమసిపోలేదని గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, కేసీఆర్ విధానాల పట్ల క్షేత్రస్థాయిలో ‘ఫీల్ గుడ్’ భావన ఉన్నా.. పార్టీ నేతల మధ్య కలహాలు నష్టం చేస్తాయని కేసీఆర్ ఆలోచనకు వచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీలైనంత త్వరగా టికెట్ కేటాయింపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసమ్మతి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా చెక్‌పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితరులతో జరిపిన భేటీలో అసమ్మతుల కట్టడికి వ్యూహాన్ని ఖరారు చేసినట్టు తెలిసింది. ‘‘వీలైనంత త్వరగా అభ్యర్థులను నిర్ణయించాలని సీఎం కేసీఆర్‌ను కోరాం. సిట్టింగ్‌లకు ఇవ్వాలా, అవసరమైన చోట కొత్త వారికి ఇవ్వాలా అనేది పూర్తిగా ఆయనే చూసుకుంటారు. త్వరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పార్టీ లో ఉండేదెవరో, వీడేదెవరో అన్నదానిపై స్పష్టత వస్తుంది. తద్వారా అసమ్మతి కట్టడి, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచారం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం కలుగుతుందని కేసీఆర్‌కు వివరించాం’’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కేటీఆర్, హరీశ్ సహా కీలక నేతలకు బాధ్యతలు అసమ్మతులు, అసంతృప్తుల సమస్యను చక్కదిద్దే పనిని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ కవిత వంటి కీలక నేతలకు కేసీఆర్ అప్పగించినట్టు తెలిసింది. వేములవాడలో కేటీఆర్, హుస్నాబాద్, మెదక్, జహీరాబాద్‌లో హరీశ్‌రావు, రామగుండంలో కొప్పుల ఈశ్వర్, చొప్పదండిలో గంగుల కమలాకర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్, బోధన్, జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత, మానకొండూరులో మాజీ ఎంపీ వినోద్ ఇప్పటికే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వరుసగా.. అసంతృప్తి సెగలు! ► కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు టికెట్ కేటాయించవద్దంటూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ తదితరులు ఇటీవల సమావేశమై పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ► దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు టికెట్ ఇవ్వద్దంటూ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్, మరో 70 మంది ముఖ్య కార్యకర్తలు డిండి మండలం రుద్రాయిగూడంలో సమావేశమై తీర్మానించారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేశారు. ► చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా తప్పించాలంటూ స్థానిక నేతలు కొందరు సీఎంకు ఫిర్యాదు చేశారు. ► రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు ఏకమయ్యారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకోవాలని నచ్చచెప్పినా.. అక్కడ అసమ్మతి నేతలు, ఎమ్మెల్యే మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ► నాగార్జునసాగర్, కోదాడ, మహబూబాబాద్, మహేశ్వరం, తాండూరు, ఉప్పల్, పెద్దపల్లి, ఇల్లందు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకూడా పార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ నేతలే బహిరంగంగా వ్యతిరేకత చూపుతున్నారు. ► కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్‌పై పలు ఆరోపణలు వస్తుండటంతో ఆయనను మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్కడ మరో బీసీకి అవకాశం ఇస్తారని, జూలూరి గౌరీ శంకర్ పేరు తెరపైకి వస్తోందని ప్రచారం జరుగుతోంది. ► రాష్ట్రవ్యాప్తంగా మరో 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి వ్యక్తమవుతోంది. ‘పుట్ట మధుకు టికెట్ ఇవ్వొద్దు’ ముత్తారం (మంథని): మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క, మాజీ జెడ్పీటీసీలు నాగినేని జగన్మోహన్రావు, మైదం భారతి, దుర్గం మల్లయ్య, బండం వసంతరెడ్డి, పలువురు సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను పుట్ట మధు పట్టించుకోవడం లేదని, నియంత పోకడలతో అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత ఎజెండాను మంథనిలో అమలుపరుస్తూ.. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. మంథని టికెట్ పుట్ట మధుకు ఇవ్వవద్దని, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. పుట్ట మధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తామన్నారు. జనగామ ‘టికెట్’ రాజకీయం! హైదరాబాద్ హరిత ప్లాజాలో ‘పల్లా’ క్యాంపు అసమ్మతి నేతలు జనగామ: జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ లొల్లి హైదరాబాద్‌కు చేరింది. బుధవారం ఇక్కడి బేగంపేటలోని హరిత ప్లాజాలో అసమ్మతి నేతల సమావేశం హాట్‌టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపుమేరకు.. జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరిగిందని, పల్లాకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌తో సీఎంను కలవాలని వారు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. వారికి సీఎం అపాయింట్మెంట్ కూడా దొరికిందని, ఆయన నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తూ హరిత ప్లాజాలో వేచి ఉన్నారని తెలిసింది. అయితే.. ఈ సమావేశం విషయం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేరుగా అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా సమావేశ గది తలుపులు తీసుకునిలోనికి వెళ్లిన ఆయనను చూసి.. అసమ్మతి నేతలు కొంత ఉలికిపాటుకు గురయ్యారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని నేతలను ఎమ్మెల్యే అడగడంతో.. మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు వచ్చామని, రాజకీయమేదీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో ముత్తిరెడ్డి స్పందిస్తూ.. ప్రగతిభవన్‌కు తీసుకెళ్తానని, తనతో రావాలని వారితో చెప్పగా, తాము విడిగానే కలుస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమయంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ‘పల్లా’కు అనుకూలంగా.. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అవకాశం కల్పించాలని నియోజకవర్గంలోని కొందరు ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఇందులో భాగంగా నర్మెట పీఏసీఎస్ చైర్మన్ పెద్ది రాజరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, నాగిళ్ల తిరుపతిరెడ్డి, చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ భర్త అంకుగాని శశిధర్‌రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పగిడిపాట సుగుణాకర్‌రాజు, జనగామ పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, కొందరు సర్పంచ్‌లు, నాయకులు హరిత ప్లాజా భేటీకి వెళ్లినట్టు తెలిసింది. కాగా.. హోటల్లో గొడవ జరుగుతోందని తెలిసి వెళ్లానే తప్ప, తానే నాయకులను తీసుకువచ్చినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని జనగామ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు. ఇలా చేయడం బాధాకరం: ముత్తిరెడ్డి జనగామ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు హరిత ప్లాజాకు వచ్చారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. అక్కడ ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరని, అన్ని మండలాల అధ్యక్షులు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. అయినా అధిష్టానం ఇటువంటి చర్యలను క్షమించబోదన్నారు. గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు స్వయంగా ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించబోనని చెప్పారని.. ఇప్పుడిలా చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుతో ‘పల్లా’ వర్గం భేటీ! హరిత ప్లాజాలో భేటీ అయిన ‘పల్లా’ వర్గీయులు సాయంత్రం ప్రగతిభవన్‌లో మంత్రి హరీశ్‌రావును కలసి పరిస్థితిని వివరించారు. దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ.. జనగామ టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని, మరో మూడు రోజుల్లో తేల్చేస్తామని చెప్పినట్టు సమాచారం. ముత్తిరెడ్డితో నెల రోజులక్రితమే మాట్లాడి.. ఆయన కుమార్తెతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పామని, అయినా సరిదిద్దుకోక ఆయన సీటుకు ఎసరొచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. -
అసమ్మతి మీటింగ్‌కు ముత్తిరెడ్డి! షాకైన నేతలు
సాక్షి, హైదరాబాద్: జనగామ బీఆర్ఎస్ టికెట్ రేస్ పంచాయితీ హైదరాబాద్‌కి చేరింది. ప్రగతి భవన్‌కి కూతవేటు దూరంలో క్యాంప్ రాజకీయం ఆసక్తికరంగా సాగింది. ఎమ్మెల్సీ పల్లాను కలిసేందుకు బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌కు రాగా, వారు హైదరాబాద్ వెళ్లారనే సమాచారంతో హుటాహుటిన నగరానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి వచ్చారు. టూరిజం ప్లాజాలో ఆయన ప్రత్యక్షమవడంతో జనగామ బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు. ముత్తిరెడ్డికి తెలియకుండానే పల్లా పిలిపించాడని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలను క్షమించదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ‘‘ఇక్కడకు వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరు. జడ్పీటీసీ, ఎంపీపీ, మండలాధ్యక్షులు నా వెంటే ఉన్నారు. కొంత మంది మా నియోజకవర్గ పార్టీ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసింది. ఎవరు వచ్చారో తెలుసుకుందామని వచ్చాను. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తిని నేను. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి నాకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించనని చెప్పారు. అసమ్మతి సంగతి అధిష్టానం చూసుకుంటుంది’’ అని ముత్తిరెడ్డి అన్నారు. చదవండి: టార్గెట్ కేసీఆర్.. రేవంత్ ఆరోపణలకు అర్థాలు లేవులే! -
కూతురితో వివాదం.. ముత్తిరెడ్డికి బిగ్ రిలీఫ్
సాక్షి, జనగామ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తండ్రి మీద మీడియా ముందు విపరీతమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది తుల్జా భవానీ. అయితే ఈ తండ్రీకూతుళ్ల కోల్డ్‌వార్ కొత్త మలుపు తిరిగింది. భవానీ అడ్డగోలుగా తన మీద ఆరోపణలు చేయకుండా నిలువరించేలా.. కోర్టు ద్వారా భవానీకి నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన పరువుకి భంగం కలిగించేలా కూతురు తుల్జా భవానీరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని.. అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిశీలించింది. ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు. YouTube, ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతో సహా మౌఖిక లేదంటే వ్రాత రూపంలో నేరుగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడవద్దని తుల్జా భవానీరెడ్డికి మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది కోర్టు. తద్వారా ముత్తిరెడ్డికి భారీ ఉపశమనం లభించినట్లయ్యింది. భూవ్యవహారంతో మొదలైన ఈ తండ్రీకూతుళ్ల మాటల యుద్ధం రోజురోజుకీ ముదురిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూబ్ సహా అన్ని మీడియా ఛానెల్స్ ముందు తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారామె. అంతేకాదు.. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే.. తన తండ్రి దుర్మార్గుడని, సీటు ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిందామె. ముత్తిరెడ్డి మాత్రం తమ కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని, తన కూతురిని తప్పు దోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు . మరోవైపు తన కూతురు, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ దాఖలైన కేసులో విచారణ కొనసాగుతోంది కూడా. -
జనగామ నియోజకవర్గ గొప్ప రాజకీయ చరిత్ర.. ఈ సారి మాత్రం..
జనగామ నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చేర్యాల నియోజకవర్గం రద్దై జనగామ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. జనగామ నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై 28490ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. యాదగిరి రెడ్డిపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చినా, ఆయన భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. కాగా పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ ఐ పార్టీ చివరి వరకు టిక్కెట్ ఖరారు చేయలేదు. మద్యలో తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ ఇక్కడ నుంచి పోటీచేస్తారని భావించారు. కానీ చివరికి బిసి నేతగా పొన్నాలకే కాంగ్రెస్ ఐ టిక్కెట్ ఇచ్చింది. అయినా పలితం దక్కలేదు. ముత్తిరెడ్డికి 91036 ఓట్లు రాగా పొన్నాలకు 62546 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్దిగా పోటీచేసిన లక్ష్మణ్ భీమాకు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ ఆవిర్భావం బిల్లు ఆమోదం పొందాక తెలంగాణ కాంగ్రెస్‌ఐకి అద్యక్షుడుగా అయిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన సొంత నియోజకవర్గం జనగామలో 2014లో కూడా భారీతేడాతో ఓడిపోయారు. తెలంగాణలో అదికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆశించగా, ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమి పాలవడం ఆ పార్టీకి అప్రతిష్టగా మారింది. 2014లో పొన్నాల టిఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్.యాదగిరిరెడ్డి చేతిలో 32695 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్దిగా రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి 21113 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య సుదీర్ఘకాలం నీటి పారుదల శాఖ మంత్రిగా ఆంద్రప్రదేశ్ సమైఖ్య రాష్ట్రంలో పనిచేసిన రికార్డు పొందారు. లక్ష్మయ్య 1989లో తొలిసారి గెలిచి, నేదురుమల్లి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 1999, 2004, 2009లలో కూడా గెలుపొందారు. 2004లో గెలిచాక వై.ఎస్. క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అనంతరం రోశయ్య, కిరణ్ క్యాబినెట్లలో మంత్రిగా కొనసాగారు. 2004, 2008 ఉప ఎన్నికలోను చేర్యాలలో గెలుపొందిన టిఆర్ఎస్ నేత కె.ప్రతాపరెడ్డి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో జనగామ నుంచి పోటీచేశారు. 2009లో టిఆర్ఎస్ తరపున, 2014లో బిజెపి తరపున పోటీ చేసి ఓటమి చెందారు. జనగామలో ఏడుసార్లు రెడ్లు, ఆరుసార్లు బిసి (మున్నూరుకాపు), రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఎస్.సిలు గెలుపొందారు. జనగామలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి తొమ్మిదిసార్లు, సిపిఎం రెండు సార్లు, టిడిపి ఒకసారి, టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి పిడిఎఫ్ గెలిచింది. అయితే ఈ నియోజకవర్గం ద్విసభ్య స్థానంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌తోపాటు పిడిఎఫ్ కూడా ఒక సీటు గెలుచుకుంది. 1967లో ఇక్కడ గెలిచిన కమాలుద్దీన్ అహ్మద్ 1962లో చేర్యాలలో నెగ్గారు. ఈయన వరంగల్ నుంచి ఒకసారి, హనుమకొండ మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. పిసిసి అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. కొద్దికాలం బిజెపిలో చేరి ప్రణాళిక సంఘం సభ్యునిగా కూడా వ్యవహరించారు. గోకా రామలింగం ఇక్కడ ఒకసారి, భువనగిరిలో మరోసారి గెలుపొందారు. అయితే 1962లో రామలింగం ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించి సిపిఐకి చెందిన రాఘవులు ఎన్నికైనట్లు ప్రకటించింది. చేర్యాల (2009లో రద్దు) 1962లో ఏర్పడిన చేర్యాల శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం నాలుగుసార్లు, సిపిఐ ఒకసారి గెలుపొందాయి. టి.ఆర్.ఎస్. 2 సార్లు, గెలిచింది. తెలుగుదేశం అభ్యర్దిగా నిమ్మ రాజిరెడ్డి నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా మహమ్మద్ కమాలుద్దీన్ 1962లో చేర్యాలలోను, 1967లో జనగామలోను గెలుపొందారు. కమాలుద్దీన్ లోక్ సభకు కూడా ఎన్నికై కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బిజెపిలో చేరి ప్రణాళికా సంఘం సభ్యుడిగా కొంతకాలం పనిచేశారు. నిమ్మ రాజిరెడ్డి 1989లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2009లో ఈ నియోజకవర్గం రద్దు అయింది. ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, రెండుసార్లు ముస్లింలు గెలుపొందారు. జనగామ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
జనగామలో జగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతున్న ఎమ్మెల్సీ
జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా?... సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎమ్మెల్సీలేనా?... ఇంటిపోరుతో సతమతం అవుతున్న ముత్తిరెడ్డి సీటుకు ఎసరు పెట్టారా?...అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్రూప్ రాజకీయాలతో గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్న పుల్లల రాయుడు ఎవరు?.. జనగామ జగడానికి కారణం ఏంటీ? ఉద్యమాల ఖిల్లా జనగామలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి, మరోవైపు వ్యతిరేక వర్గం వ్యూహాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రసవత్తరంగా జనగామ రాజకీయం ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ అందుకు ఆజ్యం పోస్తున్నట్లు తాజా ఆడియో వైరల్ తో స్పష్టమౌతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి స్థానికేతరుడనేది అడొస్తే.. పట్టభద్రుల స్థానానికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురితో సంప్రదింపులు జరపడం హాట్ టాఫిక్‌గా మారింది. పోచంపల్లి'.. లేదంటే 'పల్లా'కు జై జనగామ నుంచి పోటీ కోసం ఇప్పటికే యాదగిరిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల పేర్లుండగా.. తాజాగా తెరమీదకు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చింది. ఈ మేరకు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో నర్మెట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. చదవండి: పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కలకలం 'పల్లా రాజేశ్వర్ రెడ్డి లోకల్ వాడు.. జనగామ నియోజకవర్గం నుంచి నిలబడమని మనం సపోర్ట్ చేద్దాం.. ఇంకొకటి ఏమిటంటే మొత్తం జనగామ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.. కాబట్టి 4 మండలాల వారు (చేర్యాల, మద్దూరు, దులిమిట, కొమురవెల్లి) వస్తారో రారోగాని నువ్వు, మన 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ కేసీఆర్ సార్‌కు ఇవ్వాలి. అన్ని నేను చూసుకుంటా.. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు.. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వమందాం.. మన ఆలోచన ఇది. నువ్వు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చెయ్యి, సారుతోటి మంచిగా మాట్లాడు. మీకు అంతా అనుకూలంగా ఉంటది. అందరూ ఒకే అంటారు అని చెప్పు.. నర్మెట సీను ఫోన్ చేస్తాడని చెప్పిన మన తమ్ముడే, మీరంటే పడి చస్తాడని చెప్పిన నువ్ కూడా అదే విధంగా మాట్లాడు.. మళ్లీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు' అంటూ జెడ్పీటీసీ శ్రీనివాస్‌తో మాట్లాడిన పాగాల సంపత్ రెడ్డి ఆడియో రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ముత్తిరెడ్డికి ఇంటిపోరు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీలోనూ కుంపటి రాజుకుంటోంది. ఆయనంటే ససేమిరా అనే గ్రూపు ఈసారి ఎన్నికల నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తుంది. చదవండి: కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా? ఈ క్రమంలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనను కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయనతో దిగిన ఫొటో లతోపాటు కార్యక్రమాలను విస్తృతంగా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇంత జరుగుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. 'సిట్టింగ్'గా ఉన్న టికెట్ నాకే, గెలుపు నాదే నంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. గ్రూప్ రాజకీయాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. పుల్లల రాయుడి ఫిట్టింగ్ గ్రూపు రాజకీయాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతుంది పుల్లల రాయుడిని ప్రచారం సాగుతుంది. అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉండే నాయకుడు అటు జనగామ, ఇటు స్టేషన్ ఘన్పూర్, మరోవైపు వరంగల్ పశ్చిమ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు అంతర్గత విబేదాలకు పుల్లల రాయుడు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం పేరు తెరపైకి రావడం, అటు జనగామలో ముత్తిరెడ్డికి బదులు పోచంపల్లి, పల్లా పేర్లు తెరపైకి తేవడం వెనుక పొలిటికల్ డ్రామాగా ఓరుగల్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
మా నాన్న వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ గా కూడా గెలవలేడు
-
2ఎకరాల కోసం సొంత బావమరిది భార్యను చంపించాడు
-
పొలిటికల్ ఎంట్రీపై ముత్తిరెడ్డి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
జనగామ: ‘రాజకీయాలంటే ఇష్టం లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు.. అందుకే నాన్న పంచాయితీ విషయంలో సీఎం కేసీఆర్‌ను కలవలేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి అన్నారు. తన అధికారిక కార్యక్రమాలను కూతురు, అల్లుడు రాహుల్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం తుల్జా భవానీరెడ్డి బంధువు రామకృష్ణను పోలీసులు బుధవారం పిలిపించగా, అల్లుడు, కూతురు సైతం జనగామ పీఎస్‌కు వచ్చారు. ఎమ్మెల్యే అధికారిక పర్యటనను అడ్డుకున్నారనే ఆరోపణలతో పాటు ఇతర విషయాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రామకృష్ణ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. తుల్జా భవానీరెడ్డి, రాహుల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కాగా, ముత్తిరెడ్డి అధికారిక కార్యక్రమాన్ని తాను ఎప్పుడూ అడ్డుకోలేదని తుల్జాభవానీరెడ్డి అన్నారు. ఇదే సమయంలో తాను చేర్యాల భూమిని మున్సిపాలిటీకి ఇచ్చిన తర్వాత తన తండ్రి స్వాగతిస్తున్నానని అన్నారని, ఇప్పుడేమో కేసులు పెట్టి మళ్లీ తమను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. తాను ఆ భూమిని కబ్జా చేశానని తన తండ్రి ఓపెన్‌గా ఒప్పుకున్నారని.. మరి ఆయన తన పదవిలో ఎందుకు ఉన్నారు? రాజీనామా ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. భూమి ఆయన కబ్జా చేశాడని, భూమి తాను ఇచ్చానని, కాబట్టి ఈ విషయంలో తండ్రి కూడా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నకూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: బస్సు రూట్లో కాంగ్రెస్