సాక్షి, హైదరాబాద్: జనగాం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు మరోసారి షాకిచ్చింది. తన తండ్రి మంచోడు కాదంటూ, ముత్తిరెడ్డిలాంటి అవినీతిపరుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి.
ఎమ్మెల్యే యాదగిరి రెడ్డిని ప్రశ్నించాల్సింది, ఓడించాల్సింది ప్రజలేనని ఆమె అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిరిగి ప్రజలకే ఇచ్చేశానని తెలిపారు. కబ్జా చేశానని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినా.. ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతిపరులకు పార్టీ టికెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి గెలవడని వ్యాఖ్యానించారు. కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని మళ్లీ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. సాక్షితో ఆమె మరికొన్ని విషయాలు పంచుకున్నారు.. అవి తన మాటల్లోనే
సంబంధిత వార్త: చేర్యాల ప్రజలు మా నాన్నను క్షమించండి: భవానీ రెడ్డి
1) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు అంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి ఇంతేనా?
ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్సెస్ ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిగా మారింది.. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.. ఇదంతా ఎందుకు అంటే తుల్జా భవాని రెడ్డి ఒకటే చెప్తున్నారు మహిళ అంటే ఆయనకు చిన్న చూపు ఆయన గురించి ఒక మహిళ ఎదురు తిరిగి మాట్లాడితే ఆయన సహించలేరని అంటున్నారు.. చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబంలో ఆమె అమ్మానాన్న ఆమె సోదరుడు అంతా ఒక్కటి అయితే తుల్జా భవాని రెడ్డి మాత్రం ఒక్కటిగా ఉండేదని చెప్తున్నారు.. ఆమె పుట్టడమే ఆయనకు ఇష్టం లేనట్లుగా సమాధానం ఇచ్చారు.
2 )ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన కూతురికి మధ్య విభేదాలు ఏంటి?
సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి నీ ఎమ్మెల్యే కబ్జా చేసి తన పేరున రాశారని పేర్కొన్నారు .2020 డిసెంబర్‌లో ఈ కబ్జా గురించి విషయం బయటకువచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇంట్లోనే తేల్చుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు కానీ వినకపోవడంతో బయటకు వచ్చి అక్కడ స్థానికంగా అందరి ముందు ఆమె తండ్రిని నిలదీసింది.
ఇది వరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని.. చెరువు భూమి అంటే ఎమ్మెల్యేకి చాలా ఇష్టం అని అందుకే అక్కడ కబ్జా లు చెరువుల పక్కన స్థలాలను కబ్జా చేస్తుంటారని చెప్పుకొచ్చారు. జనగాం జిల్లాలో ఎవరిని అడిగినా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అవినీతి గురించి చెబుతారని ఒకసారి ఏకంగా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారంటే అర్థం చేసుకోవాలని అన్నారు..
3) ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు?
కబ్జా చేసినట్లు ఎమ్మెల్యే బహిరంగంగా ఒప్పుకున్నట్లు ఒక క్లిప్పింగ్ వచ్చిందని ఆమె అన్నారు..అన్ని ఒప్పుకున్న తర్వాత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటీ అవినీతి ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇవ్వకూడదనీ అన్నారు. ఒక కూతురు అయిన బయటకు మా నాన్న కబ్జాలు చేస్తున్నాడని చెప్పినా ఇప్పటి వరకు ఆయనపై చర్యలు లేవని బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కూడా ఎటువంటి ఫోన్‌లు రాలేదని అన్నారు
4) రాజకీయ ప్రవేశం?
రాజకీయ ప్రవేశం పై అసక్తి లేదనీ అన్నారు తుల్జా భవానీ. న్యాయం వైపు పోరాడితే ప్రజల కోసం చూస్తే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆలోచన కరెక్ట్ కాదు అన్నారు. తనకు ఏ పార్టీ కూడా అండ దండ లేదని, తను ఒకతే ఫైట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏవైతే కబ్జా ఉన్నాయో ఆ స్థలాలని తీసుకొని ప్రజలకు ఇచ్చేస్తున్నట్లు తెలిపారు అంతే తప్ప రాజకీయాల్లోకి ఎవరు పిలిచినా వెళ్ళేది లేదని కరాఖండిగా చెప్పారు.
5) ఇలాంటి అవినీతిపరులను ఎందుకు ప్రజలు ఎన్నుకుంటున్నారు ?
ఒక ప్రజా ప్రతినిధిని ఎన్నుకుంటున్న సమయంలో లీడర్ ఎలా ఉండాలి అని ప్రజల ఆలోచించాలని అన్నారు. ఇలాంటి అవినీతిపరులకు ఓట్లు వేస్తే ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని తెలిపారు.. ప్రజలు అవినీతిని ప్రశ్నించాలే తప్ప గెలిపించద్దనీ అన్నారు.. సీఎం కేసీఆర్‌ను చూసి ఓట్లు వేసి గెలిపించారు ప్రజలు.. ఒక్కసారి రిజైన్ చేసి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచి చూపించమని ఆయన కూతురు సవాల్ విసిరారు. త్యాగాలను చేసి తెలంగాణ తెచ్చుకుంది ఇలాంటి అవినీతిపరుల చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టేందుకు కాదని సమాధానం ఇచ్చారు.
6) ఎమ్మెల్యే కబ్జా చేసిన బాధితులు ఇంకెవరైనా ఉన్నారా?
ఇప్పుడిప్పుడే చాలా మంది బాధితులు ఫోన్ లు చేస్తున్నట్లు తెలిపారు.. వారి పేర్లను ఇప్పుడు నేను బయట పెట్టాలి అనుకోవడం లేదని అన్నారు. తన పేరుపై ఎన్నో ఫోర్జరీలు చేశారని కూడా తెలిపారు
7) అల్లుడు అంటే ఎమ్మెల్యే ముత్తీ రెడ్డి కి ఇష్టం లేదా అందుకే ఇదంతా జరుగుతుందా?
తుల్జ భవానీ రెడ్డి తమది లవ్ కం అరేంజ్డ్ వివాహంగా పేర్కొన్నారు... పెళ్ళి చేసే సమయం లో సంతోషంగానే వివాహం చేశారని ఆమె అన్నారు..ఆ వివాహా నికి సీఎం కేసీఆర్ వచ్చినట్లుగా కూడా తెలిపారు.. ఇప్పుడు తను పిల్లలతో , భర్త తో ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.. తన భర్త ఏ విధంగా కూడా ఆమె తండ్రిపైకి తిరగబడేలా ట్రాప్ చేయలేదనీ చెప్పారు..
8) ఎన్నికలకి ముందే వేల కోట్ల ఆస్థులు.. 70 ఏళ్ల వయసు... ఇంకా ఎందుకు కబ్జాలు?
ఎన్నికలకు ముందే వేల కోట్లు సంపాదించారని అన్నారు.. ప్రస్తుతం అయనకి 70 ఏళ్ల వయసు. ఇప్పటికీ ఇంకా కొన్ని రెంట్స్ కూడా కోటిన్నరకు పైగా వస్తున్నాయని అన్నారు. ఇవన్నీ కాకుండా చెరువుల పక్కన ఆయనకి సాయంత్రం వేళ కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టంతో కబ్జాలు చేస్తున్నారని అన్నారు.
9) కూతురు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆస్తినీ ఎందుకు తీసుకోలేదు?
రూపాయి అస్థి కూడా తీసుకోకుండా భర్తనీ పెళ్ళి చేసుకుని ఇంట్లో నుంచి బయటికీ సంతోషంగా వచ్చినట్లు ఆమె వ్యక్తం చేశారు. మామూలుగా నలుగు పెట్టే సమయం లో ఆడపిల్లలు ఏడుస్తారు కానీ తనకి ఒక కంటి చుక్క కూడా రాలేదని అన్నారు. తన భర్త కట్నం తీసుకోలేదని తనకి పెట్టిన కొన్నిటింని కూడ డబ్బుల రూపంలో తిరిగి ఇచ్చినట్లు తెలిపారు.
10 ) ఎమ్మెల్యే కబ్జా పై ఒప్పుకున్న తర్వాత కూడా కేసులు ఎందుకు?
తన పై ఎమ్మెల్యే ఐదు కేసులు పెట్టించరాని తుల్జా భవనీ అన్నారు.. బహిరంగంగా కబ్జా చేశాను అని ఒప్పుకున్న తర్వాత కూడా పోలీస్‌లు మాకు ఫోన్ లు చేసి వేధిస్తున్నారని మనస్థాపం చెందారు.
-సుస్మిత, సాక్షి టీవీ
Comments
Please login to add a commentAdd a comment