Tulja Bhavani
-
కూతురితో వివాదం.. ముత్తిరెడ్డికి బిగ్ రిలీఫ్
సాక్షి, జనగామ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తండ్రి మీద మీడియా ముందు విపరీతమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది తుల్జా భవానీ. అయితే ఈ తండ్రీకూతుళ్ల కోల్డ్‌వార్ కొత్త మలుపు తిరిగింది. భవానీ అడ్డగోలుగా తన మీద ఆరోపణలు చేయకుండా నిలువరించేలా.. కోర్టు ద్వారా భవానీకి నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన పరువుకి భంగం కలిగించేలా కూతురు తుల్జా భవానీరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని.. అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిశీలించింది. ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు. YouTube, ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతో సహా మౌఖిక లేదంటే వ్రాత రూపంలో నేరుగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడవద్దని తుల్జా భవానీరెడ్డికి మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది కోర్టు. తద్వారా ముత్తిరెడ్డికి భారీ ఉపశమనం లభించినట్లయ్యింది. భూవ్యవహారంతో మొదలైన ఈ తండ్రీకూతుళ్ల మాటల యుద్ధం రోజురోజుకీ ముదురిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూబ్ సహా అన్ని మీడియా ఛానెల్స్ ముందు తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారామె. అంతేకాదు.. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే.. తన తండ్రి దుర్మార్గుడని, సీటు ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిందామె. ముత్తిరెడ్డి మాత్రం తమ కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని, తన కూతురిని తప్పు దోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు . మరోవైపు తన కూతురు, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ దాఖలైన కేసులో విచారణ కొనసాగుతోంది కూడా. -
మా నాన్న వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ గా కూడా గెలవలేడు
-
2ఎకరాల కోసం సొంత బావమరిది భార్యను చంపించాడు
-
పొలిటికల్ ఎంట్రీపై ముత్తిరెడ్డి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
జనగామ: ‘రాజకీయాలంటే ఇష్టం లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు.. అందుకే నాన్న పంచాయితీ విషయంలో సీఎం కేసీఆర్‌ను కలవలేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి అన్నారు. తన అధికారిక కార్యక్రమాలను కూతురు, అల్లుడు రాహుల్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం తుల్జా భవానీరెడ్డి బంధువు రామకృష్ణను పోలీసులు బుధవారం పిలిపించగా, అల్లుడు, కూతురు సైతం జనగామ పీఎస్‌కు వచ్చారు. ఎమ్మెల్యే అధికారిక పర్యటనను అడ్డుకున్నారనే ఆరోపణలతో పాటు ఇతర విషయాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రామకృష్ణ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. తుల్జా భవానీరెడ్డి, రాహుల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కాగా, ముత్తిరెడ్డి అధికారిక కార్యక్రమాన్ని తాను ఎప్పుడూ అడ్డుకోలేదని తుల్జాభవానీరెడ్డి అన్నారు. ఇదే సమయంలో తాను చేర్యాల భూమిని మున్సిపాలిటీకి ఇచ్చిన తర్వాత తన తండ్రి స్వాగతిస్తున్నానని అన్నారని, ఇప్పుడేమో కేసులు పెట్టి మళ్లీ తమను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. తాను ఆ భూమిని కబ్జా చేశానని తన తండ్రి ఓపెన్‌గా ఒప్పుకున్నారని.. మరి ఆయన తన పదవిలో ఎందుకు ఉన్నారు? రాజీనామా ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. భూమి ఆయన కబ్జా చేశాడని, భూమి తాను ఇచ్చానని, కాబట్టి ఈ విషయంలో తండ్రి కూడా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నకూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: బస్సు రూట్లో కాంగ్రెస్ -
సొంతంగా పోటీ చేసిన సర్పంచ్‌గా కూడా గెలవలేడు: తుల్జా భవాని
-
మా నాన్న మంచోడు కాదు.. ముత్తిరెడ్డికి కూతురు షాక్
సాక్షి, హైదరాబాద్: జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు మరోసారి షాకిచ్చింది. తన తండ్రి మంచోడు కాదంటూ, ముత్తిరెడ్డిలాంటి అవినీతిపరుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి. ఎమ్మెల్యే యాదగిరి రెడ్డిని ప్రశ్నించాల్సింది, ఓడించాల్సింది ప్రజలేనని ఆమె అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిరిగి ప్రజలకే ఇచ్చేశానని తెలిపారు. కబ్జా చేశానని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినా.. ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతిపరులకు పార్టీ టికెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి గెలవడని వ్యాఖ్యానించారు. కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని మళ్లీ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. సాక్షితో ఆమె మరికొన్ని విషయాలు పంచుకున్నారు.. అవి తన మాటల్లోనే సంబంధిత వార్త: చేర్యాల ప్రజలు మా నాన్నను క్షమించండి: భవానీ రెడ్డి 1) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు అంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్సెస్ ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిగా మారింది.. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.. ఇదంతా ఎందుకు అంటే తుల్జా భవాని రెడ్డి ఒకటే చెప్తున్నారు మహిళ అంటే ఆయనకు చిన్న చూపు ఆయన గురించి ఒక మహిళ ఎదురు తిరిగి మాట్లాడితే ఆయన సహించలేరని అంటున్నారు.. చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబంలో ఆమె అమ్మానాన్న ఆమె సోదరుడు అంతా ఒక్కటి అయితే తుల్జా భవాని రెడ్డి మాత్రం ఒక్కటిగా ఉండేదని చెప్తున్నారు.. ఆమె పుట్టడమే ఆయనకు ఇష్టం లేనట్లుగా సమాధానం ఇచ్చారు. 2 )ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన కూతురికి మధ్య విభేదాలు ఏంటి? సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి నీ ఎమ్మెల్యే కబ్జా చేసి తన పేరున రాశారని పేర్కొన్నారు .2020 డిసెంబర్లో ఈ కబ్జా గురించి విషయం బయటకువచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇంట్లోనే తేల్చుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు కానీ వినకపోవడంతో బయటకు వచ్చి అక్కడ స్థానికంగా అందరి ముందు ఆమె తండ్రిని నిలదీసింది. ఇది వరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని.. చెరువు భూమి అంటే ఎమ్మెల్యేకి చాలా ఇష్టం అని అందుకే అక్కడ కబ్జా లు చెరువుల పక్కన స్థలాలను కబ్జా చేస్తుంటారని చెప్పుకొచ్చారు. జనగాం జిల్లాలో ఎవరిని అడిగినా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అవినీతి గురించి చెబుతారని ఒకసారి ఏకంగా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారంటే అర్థం చేసుకోవాలని అన్నారు.. 3) ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు? కబ్జా చేసినట్లు ఎమ్మెల్యే బహిరంగంగా ఒప్పుకున్నట్లు ఒక క్లిప్పింగ్ వచ్చిందని ఆమె అన్నారు..అన్ని ఒప్పుకున్న తర్వాత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటీ అవినీతి ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇవ్వకూడదనీ అన్నారు. ఒక కూతురు అయిన బయటకు మా నాన్న కబ్జాలు చేస్తున్నాడని చెప్పినా ఇప్పటి వరకు ఆయనపై చర్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎటువంటి ఫోన్లు రాలేదని అన్నారు 4) రాజకీయ ప్రవేశం? రాజకీయ ప్రవేశం పై అసక్తి లేదనీ అన్నారు తుల్జా భవానీ. న్యాయం వైపు పోరాడితే ప్రజల కోసం చూస్తే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆలోచన కరెక్ట్ కాదు అన్నారు. తనకు ఏ పార్టీ కూడా అండ దండ లేదని, తను ఒకతే ఫైట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏవైతే కబ్జా ఉన్నాయో ఆ స్థలాలని తీసుకొని ప్రజలకు ఇచ్చేస్తున్నట్లు తెలిపారు అంతే తప్ప రాజకీయాల్లోకి ఎవరు పిలిచినా వెళ్ళేది లేదని కరాఖండిగా చెప్పారు. 5) ఇలాంటి అవినీతిపరులను ఎందుకు ప్రజలు ఎన్నుకుంటున్నారు ? ఒక ప్రజా ప్రతినిధిని ఎన్నుకుంటున్న సమయంలో లీడర్ ఎలా ఉండాలి అని ప్రజల ఆలోచించాలని అన్నారు. ఇలాంటి అవినీతిపరులకు ఓట్లు వేస్తే ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని తెలిపారు.. ప్రజలు అవినీతిని ప్రశ్నించాలే తప్ప గెలిపించద్దనీ అన్నారు.. సీఎం కేసీఆర్‌ను చూసి ఓట్లు వేసి గెలిపించారు ప్రజలు.. ఒక్కసారి రిజైన్ చేసి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచి చూపించమని ఆయన కూతురు సవాల్ విసిరారు. త్యాగాలను చేసి తెలంగాణ తెచ్చుకుంది ఇలాంటి అవినీతిపరుల చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టేందుకు కాదని సమాధానం ఇచ్చారు. 6) ఎమ్మెల్యే కబ్జా చేసిన బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడిప్పుడే చాలా మంది బాధితులు ఫోన్ లు చేస్తున్నట్లు తెలిపారు.. వారి పేర్లను ఇప్పుడు నేను బయట పెట్టాలి అనుకోవడం లేదని అన్నారు. తన పేరుపై ఎన్నో ఫోర్జరీలు చేశారని కూడా తెలిపారు 7) అల్లుడు అంటే ఎమ్మెల్యే ముత్తీ రెడ్డి కి ఇష్టం లేదా అందుకే ఇదంతా జరుగుతుందా? తుల్జ భవానీ రెడ్డి తమది లవ్ కం అరేంజ్డ్ వివాహంగా పేర్కొన్నారు... పెళ్ళి చేసే సమయం లో సంతోషంగానే వివాహం చేశారని ఆమె అన్నారు..ఆ వివాహా నికి సీఎం కేసీఆర్ వచ్చినట్లుగా కూడా తెలిపారు.. ఇప్పుడు తను పిల్లలతో , భర్త తో ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.. తన భర్త ఏ విధంగా కూడా ఆమె తండ్రిపైకి తిరగబడేలా ట్రాప్ చేయలేదనీ చెప్పారు.. 8) ఎన్నికలకి ముందే వేల కోట్ల ఆస్థులు.. 70 ఏళ్ల వయసు... ఇంకా ఎందుకు కబ్జాలు? ఎన్నికలకు ముందే వేల కోట్లు సంపాదించారని అన్నారు.. ప్రస్తుతం అయనకి 70 ఏళ్ల వయసు. ఇప్పటికీ ఇంకా కొన్ని రెంట్స్ కూడా కోటిన్నరకు పైగా వస్తున్నాయని అన్నారు. ఇవన్నీ కాకుండా చెరువుల పక్కన ఆయనకి సాయంత్రం వేళ కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టంతో కబ్జాలు చేస్తున్నారని అన్నారు. 9) కూతురు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆస్తినీ ఎందుకు తీసుకోలేదు? రూపాయి అస్థి కూడా తీసుకోకుండా భర్తనీ పెళ్ళి చేసుకుని ఇంట్లో నుంచి బయటికీ సంతోషంగా వచ్చినట్లు ఆమె వ్యక్తం చేశారు. మామూలుగా నలుగు పెట్టే సమయం లో ఆడపిల్లలు ఏడుస్తారు కానీ తనకి ఒక కంటి చుక్క కూడా రాలేదని అన్నారు. తన భర్త కట్నం తీసుకోలేదని తనకి పెట్టిన కొన్నిటింని కూడ డబ్బుల రూపంలో తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. 10 ) ఎమ్మెల్యే కబ్జా పై ఒప్పుకున్న తర్వాత కూడా కేసులు ఎందుకు? తన పై ఎమ్మెల్యే ఐదు కేసులు పెట్టించరాని తుల్జా భవనీ అన్నారు.. బహిరంగంగా కబ్జా చేశాను అని ఒప్పుకున్న తర్వాత కూడా పోలీస్‌లు మాకు ఫోన్ లు చేసి వేధిస్తున్నారని మనస్థాపం చెందారు. -సుస్మిత, సాక్షి టీవీ చదవండి: Video: మానవత్వం చాటుకున్న కేటీఆర్..