జనగామ: ‘రాజకీయాలంటే ఇష్టం లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు.. అందుకే నాన్న పంచాయితీ విషయంలో సీఎం కేసీఆర్‌ను కలవలేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి అన్నారు. తన అధికారిక కార్యక్రమాలను కూతురు, అల్లుడు రాహుల్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇక, ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం తుల్జా భవానీరెడ్డి బంధువు రామకృష్ణను పోలీసులు బుధవారం పిలిపించగా, అల్లుడు, కూతురు సైతం జనగామ పీఎస్‌కు వచ్చారు. ఎమ్మెల్యే అధికారిక పర్యటనను అడ్డుకున్నారనే ఆరోపణలతో పాటు ఇతర విషయాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రామకృష్ణ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. తుల్జా భవానీరెడ్డి, రాహుల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కాగా, ముత్తిరెడ్డి అధికారిక కార్యక్రమాన్ని తాను ఎప్పుడూ అడ్డుకోలేదని తుల్జాభవానీరెడ్డి అన్నారు.
ఇదే సమయంలో తాను చేర్యాల భూమిని మున్సిపాలిటీకి ఇచ్చిన తర్వాత తన తండ్రి స్వాగతిస్తున్నానని అన్నారని, ఇప్పుడేమో కేసులు పెట్టి మళ్లీ తమను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. తాను ఆ భూమిని కబ్జా చేశానని తన తండ్రి ఓపెన్‌గా ఒప్పుకున్నారని.. మరి ఆయన తన పదవిలో ఎందుకు ఉన్నారు? రాజీనామా ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. భూమి ఆయన కబ్జా చేశాడని, భూమి తాను ఇచ్చానని, కాబట్టి ఈ విషయంలో తండ్రి కూడా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నకూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: బస్సు రూట్‌లో కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment