రగిలిన ‘జనగామ’ | fight for Janagama district | Sakshi
Sakshi News home page

రగిలిన ‘జనగామ’

Published Thu, Jun 9 2016 12:28 AM | Last Updated on Tue, Oct 30 2018 5:26 PM

రగిలిన ‘జనగామ’ - Sakshi

రగిలిన ‘జనగామ’

జనగామ జిల్లా కోసం రోడ్డెక్కిన ఉద్యమకారులు
ఎమ్మెల్యే దిష్టిబొమ్మతో యాత్ర సీఎం ఫ్లెక్సీ దగ్ధం
ఆందోళనకారుల తోపులాట, అరెస్టు     

 

జనగామ : జనగామ జిల్లా పోరు ఉగ్రరూపం దాల్చింది. కొత్త జిల్లా జాబితాలో పేరు చేర్చాల్సిందేనంటూ ఉద్యమ కారులు ఆందోళనను తీవ్రతరం చేశారు. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి పేర్లు ప్రస్థావనకు రావడం, జనగామ పేరు లేకపోవడంతో బుధవారం పట్టణంలోని ఆర్టీసీ చౌరాస్తాలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జిల్లా సాధన సమి తి, ఐకాసా ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దిష్టి బొమ్మతో నిర్వహించిన యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీ సింది. ఎమ్మెల్యే దిష్టిబొమ్మతో యాత్ర చేస్తుం డగా..ఎస్సై సంతోషం రవీందర్ తన పోలీసుల బలగాలతో అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను తగులబెట్టేం దుకు ప్రయత్నించగా, ఎస్సై  , పోలీసు సిబ్బం ది దానిని లాక్కునేందుకు తీవ్ర ప్రయత్నం చేశా రు. ఈ క్రమంలోనే కొంత మంది సీఎం కేసీఆర్ ఫ్లెక్సికి నిప్పుపెట్టి దగ్ధం చేసి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమంలో కలవాలని నినాదాలు చేశారు. ఆందోళన చేస్తు న్న జిల్లా సాధన సమితి కన్వీనర్ మం గళ్లపల్లి రాజు, మేడ శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, ఆకుల వేణుగోపాల్‌రావు, పర్శరాములు, తీగల సిద్దూగౌడ్, ధర్మపురి శ్రీనివాస్, రమేష్, మాజీ ద్, తిప్పారపు విజయ్ తదితరులను పోలీసులు బలవంతంగా వాహనం ఎక్కించారు.


మంగళ్లపల్లి రాజు తప్పించుకుని తన అనుచరులతో పోలీసు వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. డాక్టర్లు రాజమౌళి, సుగుణాకర్‌రా జు, లక్ష్మీనారాయణ నాయక్, పెద్దోజు జగదీష్, శ్రీనివాస్‌రెడ్డి, మాశెట్టి వెంకన్న, జి.కృష్ణ, కేమిడి చంద్రశేఖర్, కాసుల శ్రీనివాస్ వారి మద్దతుగా నిలిచారు. ఆర్టీసీ చౌరస్తాలో ఉద్రిక్తత పరిస్థితు లు నెలకొనడంతో మరికొంత మంది పోలీ సులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తు న్న వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 
ఎమ్మెల్యే రాజీనామా చేయాలని టవరెక్కిన యువకులు

జనగామ జిల్లా కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని కోరుతూ ఐదుగురు యువకులు సెల్‌టవర్ ఎక్కడ నిరసన తెలిపారు. పట్టణంలోని డాక్టర్ లక్ష్మీనారాయణ నర్సింగ్ హోమం పక్కన వ్యాపారి సిద్ధయ్య భవనంపై ఉన్న సెల్ టవర్ పైకి మాజీద్, గండి నాగరాజు, సౌడ మహేష్, ఇరుగు రమేష్, బొట్ల సాయిలు ఎక్కగా, నాగరాజు అనే యువకుడు పెట్రోల్ బాటిల్‌తో నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలసుకున్న ఎస్సై రవిందర్ చేరుకుని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, జి.క్రిష్ణ, రెడ్డి రత్నాకర్‌రెడ్డి, డాక్టర్లు లక్ష్మీనారాయణ, రాజమౌళి ఫోన్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తో మాట్లాడారు. అక్కడి నుంచి సరైన సమాధా నం రాకపోవడంతో యువకులు కిందకు దిగేం దుకు నిరాకరించారు. యువకుడు మాజీద్‌ను బలవంతంగా కిందకు పిలిపించి ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడించి, చర్చలు జరిపినా నలుగురు యువకులు మాత్రం ఎమ్మెల్యే రాజీ నా మా చేసి, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఐ చెన్నూరి శ్రీనివాస్ అక్కడకు చేరుకోగా, అరెస్టు చేసిన వారిని విడుదల చేసి ఇక్కడకు తీసుకురావడమే కాకుండా, ఆర్డీఓ రావాలని పట్టుబట్టారు. టీఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు బండ యాదగిరిరెడ్డి, మేకల కలింగరాజులు ఆర్డీఓ వెంకట్‌రెడ్డితో పాటు అరెస్టు చేసిన ఉద్యమకారులను సెల్‌టవర్ వద్దకు తీసుకవచ్చారు. జనగామ జిల్లా సాధన ఉద్యమం, జిల్లాకు కావాల్సిన వనరులకు సంబంధించి ప్రభుత్వానికి మరోసారి తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో యువకులు కిందకుదిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలేని జనగామను ఊహిం చుకోలేమని, అన్యాయం చేస్తే అగ్నిగుండా మారుస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉద్యమంలో కలిసి వస్తే జిల్లాకు మరింత బలం చేకూరుతుందన్నారు.

 
రాజును ఏరియా ఆస్పత్రికి తరలింపు
పోలీసుల పెనుగులాటలో గాయాలపాలైన మంగళ్లపల్లి రాజును ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు సుగుణాకర్‌రాజు పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయగా, ల క్ష్మీనారాయణనాయక్, రాజమౌళి హుటాహుటిన అక్కడకు వెళ్లారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement