
రైతులకు పాదాభివందనం చేస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి
తరిగొప్పుల : అన్నం పెట్టే రైతు దేవుడితో సమానమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రైతులకు రైతు బంధు చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన రైతులు గుర్జకుంట ఎల్లయ్య, లకావత్ రాములు, కొండ సాయిలు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రైతులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు, సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్ దేశంలో గొప్పవారని అన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు కృషిచేస్తారని తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు ఎర్రోజు భిక్షపతి, నాంబాలయ్య, ముడికె సంపత్, వైస్ ఎంపీపీ నూకల కృష్ణమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ పెద్దిరాజిరెడ్డి, సమితి మండల కోఆర్డినేటర్లు జుంలాల్ నాయక్, చింతకింది సురేష్, ఉపసర్పంచ్ ముక్కెర బుచ్చిరాజు, చిలువేరు లింగం, అర్జుల సుధాకర్‌రెడ్డి, బీరెడ్డి జార్జిరెడ్డి, పోగుల మల్లేషం, ఎం.భిక్షపతి, ప్రమోద్‌రెడ్డి, తాళ్లపల్లి పోషయ్య, కొండం మధుసూదన్‌రెడ్డి, జయ్‌పాల్‌రెడ్డి, అంకం వెంకటేష్, వంగ రామరాజు, గొలుసుల రామరాజు, రవీందర్‌చారి, బొగం శ్రీనివాస్, తహసీల్దార్ మహ్మద్ సలీం, ఏడీఏ కల్పన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment