
అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఏటా రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈ సాయాన్ని వదులుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముందుకువచ్చారు. జిల్లాలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న రైతులు ఎందరో ఉన్నారు. ఇందులో మంత్రి బాటలో నడిచేది ఎందరో.. – సాక్షి, కామారెడ్డి
సాక్షి, కామారెడ్డి : రైతుబంధు పథకంలో భాగంగా పంటల సాగు కోసం ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అం దించేందుకు ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఈనెల 10వ తేదీనుంచి ఈ పథకం ప్రారంభం కా నుంది. వారం రోజుల పాటు గ్రామాల్లో సభలు నిర్వహించి, రైతులకు చెక్కులు అందించనున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, పెద్ద రైతు లు, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వాళ్లు పెట్టుబడి సాయా న్ని వదులుకుంటే ఆ మొత్తాన్ని రైతు సమ న్వయ సమితుల ఖాతాల్లో జమ చేస్తా మని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
సీఎం ప్రకటనతో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముందు కు వ చ్చారు. తన కుటుంబానికి 30 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి కి ఒక పంటకు రావాల్సిన పెట్టుబడి సాయం రూ. 1.20 లక్షలను వదులుకుంటానని ప్రకటించారు. రెండు పం టలకు కలిపితే రూ. 2.40 లక్షలు వదులుకోవడానికి మంత్రి సిద్ధమయ్యారు.
ఉమ్మడి జిల్లాలో రూ. 400 కోట్ల సాయం...
రైతుబంధు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 10,02,424 ఎకరాల వ్యవసాయ భూములకుగాను రూ. 400.97 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. కామారెడ్డి జిల్లాలో 2,44,920 మంది రైతులకు 4,91,303 ఎకరాల భూమి ఉంది. రైతుబంధు పథకం ద్వారా రూ.196.52 కోట్లు పంపిణీ చేయనున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో 2,39,712 మంది రైతులకు సంబంధించి 5,11,110 ఎకరాల భూములు ఉన్నాయి. వీరికి రూ.204.45 కోట్లు అందించనున్నారు.
మంత్రి తర్వాత ఎవరో..
ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. తాను పెట్టుబడి సాయాన్ని వదులుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్కరూ ముందుకురాలేదు. ఉమ్మడి జిల్లాలో మంత్రి పోచారంతో కలిపి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు.
జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ఇంకా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు వందలాది మంది ఉన్నారు. పదెకరాలకుపైగా భూములు ఉన్న వారు ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 వేల మంది రైతులున్నారు. కానీ ఏ ఒక్కరూ పెట్టుబడి సాయం వదులుకోవడానికి ముందుకు రావడంలేదు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాటలో ఎంత మంది నడుస్తారో వేచి చూడాలి.
10 నుంచి పంపిణీ..
రైతుబంధు చెక్కుల పంపిణీ కార్య క్రమం ఈనెల 10న ప్రారంభం కానుంది. 17 వ తేదీ వరకు గ్రామసభల్లో రైతులకు చెక్కులను అందిం చనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 452, కామారెడ్డి జిల్లాలో 473 రెవెన్యూ గ్రామాల్లో వారం రోజుల్లో పంపిణీని పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించా రు. ఇందుకోసం ఆయా జిల్లాల్లో ప్రత్యేక బృందాలను తయారు చేశా రు. ఏరోజు ఏ గ్రామంలో పంపిణీ కార్యక్రమం ఉంటుందన్న విషయ మై ముందుగానే షెడ్యూల్ ప్రకటించనున్నారు. రెండు రోజుల ముం దు నుంచి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు వివరిస్తారు. చెక్కులతో పాటు పాసుపుస్తకాలను కూడా పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment