![Janagama Mla Muthireddy Yadagiri Reddy Followers Protest - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/19/Janagama-Mla-Muthireddy-Yad.jpg.webp?itok=kHbcRGr4)
సాక్షి, జనగామ: బీఆర్‌ఎస్‌లో జనగామ టిక్కెట్ వివాదం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు రచ్చ రచ్చ చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారనే ప్రచారంతో ముత్తిరెడ్డి అనుచరులు గో బ్యాక్ పల్లా అంటూ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు.
చౌరస్తాలో బైఠాయించి ముత్తిరెడ్డికి టిక్కెట్ ఇస్తే గెలిపించి గిఫ్ట్ ఇస్తామని లేకుంటే పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. అటు స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు కడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగి దిష్టిబొమ్మలు దహనం చేశారు.
చదవండి: బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు
Comments
Please login to add a commentAdd a comment