సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్‌కు చోటు దక్కలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో పొన్నం ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, పొన్నం ప్రభాకర్‌కు మద్ధతుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలు ఈ రోజు ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. రేవంత్‌కు వార్నింగ్!
మరో వైపు, హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది. రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశంలోలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment