జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.
జనగామ(వరంగల్ జిల్లా): జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనగామ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. ఆందోళనలకు దిగిన వారిని ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. నిరసనకు దిగిన సుమారు 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రే పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంబర్తి, రఘనాథపల్లి మండలాల్లో 1000 మంది విద్యార్థులు జనగామ జిల్లా కోసం ఆందోళనకు దిగారు.