జనగామ నేతల ఆమరణ దీక్ష భగ్నం
-
తెల్లవారుజామున వరంగల్ ఎంజీఎంకు నేతల తరలింపు
-
ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న 12మంది
జనగామ : జనగామ జిల్లా కోసం జేఏసీ నాయకులు తలపెట్టిన ఆమరణ దీక్షను గురువారం తెల్లవారుజామున పోలీసులు భ గ్నం చేశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డితో పాటు డాక్ట ర్ లక్షీ్మనారాయణనాయక్, ఆకుల దుర్గాప్రసాద్, జక్కుల వేణుమాధవ్, పూల సుధాకర్, మంతెన మణి, అనంతుల శ్రీనివాస్, ఉడ్గుల రమేష్, పిట్టల సత్యం, నాగారపు వెంకట్, సీతారాము లు, పానుగంటి ప్రవీణ్ మంగళవారం ఆమరణ దీక్షలో కూర్చున్నారు. మొదటి రోజు దీక్షలు ప్రశాంతగా ప్రారంభం కావడంతో పోలీసులు కూడా సహకరిస్తారని అంతా భావించారు. అయితే బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో జనగామ, రూరల్, చేర్యాల సీఐలు ముసికె శ్రీనివాస్, తిరుపతి, చంద్రశేఖర్, బలగాలు శిబిరం వద్దకు చేరుకుని నిద్రలో ఉన్న జేఏసీ నాయకులను వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు.
అక్కడ ఉన్న వారు అడ్డుకున్నా పోలీసులు వారిని వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హైదరాబాద్ వెళ్తున్న సమయం లో ఎవరైనా అడ్డుకుంటారేమోననే భావనతో సీఐ శ్రీనివాస్ ఆ ధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇంకా పలు ప్రాంతాల్లో నిఘా వేయడంతో పాటు విద్యార్థి సంఘాల నేతలు తీగల సిద్ధూ, పిట్టల సురేష్, మజీద్, నాగరాజు తదితరులను అరెస్ట్ చేశారు. కాగా, హైదరాబాద్ జాతీయ రహదారి కళ్లెం క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి టైర్లకు నిప్పు పెట్టారు.
ఎంజీఎంలో కొనసాగుతున్న దీక్ష
ఎంజీఎం : జనగామను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు దిగిన జేఏసీ నేతలను పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు తమను బలవంతంగా తీసుకురావడంతో జేఏసీ నేతలు ఎంజీఎం క్యాజువాలిటీ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం వైద్యులు వారిని ఆబ్జర్వేషన్ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపా రు. కాగా, జనగామను జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ తో తలపెట్టిన ఆమరణ దీక్షను కొనసాగిస్తన్నామని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డితో పాటు డాక్టర్ లక్షీ్మనారాయణ నాయక్ తెలిపారు. దీక్షలో పాల్గొన్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కాగా, తాము ఆస్పత్రిలో గ్లూకోజ్ నిరాకరించామని, దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.