స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజానీకం
నిర్మాణుష్యంగా మారిన రహదారులపై పోలీసుల నిఘా
నిలిచిన వైద్య సేవలు మెడికల్ జాక్, ఆర్‌ఎంపీ,
పీఎంపీ వైద్యుల నిరసన
జనగామ : జనగామ జిల్లా ఆకాంక్షను కోరుతూ శుక్రవారం జేఏసీ తలపెట్టిన స్వచ్ఛంద బంద్ విజయవంతంగా ముగిసింది. వ్యాపార వర్గాల తో పాటు ప్రతి ఒక్కరు బంద్‌లో పాల్గొని తమ నిరసనను తెలిపారు. ‘అన్ని వనరులున్న జనగామను ముక్కలు చేయకుండా జిల్లా చేయాలి’ అంటూ ప్రతి దుకాణం ఎదుట వ్యాపారులు స్వ చ్ఛందంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఉద్యమ కారులను వి డుదల చేసి, 144 సెక్షన్ ఎత్తివేయాలని కోరు తూ బంద్‌కు పిలుపునిచ్చారు. డీఎస్పీ పద్మనాభ రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు చెన్నూరి శ్రీనివాస్, తిరుపతి పర్యవేక్షణలో సబ్ డివిజన్‌తో పాటు వరంగల్, మహబూబాబాద్. నర్సంపేట డివిజ న్‌లోని పోలీసులు, పారా మిలటరీ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్-హైరాబాద్ జాతీయ రహదారిపై నలుదిక్కు లా పోలీసులు టెంట్లు వేసుకుని నిఘా ఏర్పాటు చేశారు. వారం రోజులుగా 144 సెక్షన్ అమలు లో ఉండడంతో ధర్నాలు, రాస్తారోకోలు లేకపోవడంతో ప్రధాన చౌరస్తా మూగబోయింది. మెడికల్ జాక్ ఆధ్వర్యంలో మూడు మెడికల్ షా పులు మినహా పూర్తి స్థాయిలో వైద్య సేవలను నిలిపి వేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు నిరసన తెలిపారు.
శాంతియుతంగా నిరసనలు
జనగామ జిల్లా చేయాలని సకల జనులు శాంతి యుతంగా తమ ఆకాంక్షను తెలియజేస్తున్నారు. పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ప్రభుత్వానికి నిరసన సెగలు కల్పిస్తున్నారు. రహదారులపై ఇద్దరు కంటే ఎక్కువగా కనిపిస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీ సులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు నిశ్శబ్ధ విప్లవాన్ని సృష్టిస్తున్నారు. గతంలో ఎన్న డూ లేని విధంగా స్వచ్ఛందంగా బంద్ పాటిం చేందుకు ప్రజలు ముందుకు రావడంతో జనగామ 24 గంటల పాటు నిర్మాణుష్యంగా మారి పోయింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభు త్వ కార్యాలయాల ఎదుట ఎస్‌ఐ స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన హరితహా రం కార్యక్రమంలో విద్యార్థుల ర్యాలీలు, వారి భాగస్వామ్యం లేకుండా పోయింది.
ప్రజల ఆకాంక్షను గుర్తించాలి : మాజీ ఎమ్మెల్యే
జిల్లా ఆకాంక్షను తెలుపుతూ దేశ చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా జనగామ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారని మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో 144 సెక్షన్‌ను కొనసాగించడం ప్రజల హక్కులను హరించడమేనని, వెంటనే దానిని ఎత్తివేయాలని కోరారు.