- జిల్లా ఏర్పాటు కోరుతూ కరపత్రాల పంపిణీ
జనగామ జిల్లా మా జన్మ హక్కు
Published Mon, Aug 1 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
బచ్చన్నపేట : జనగామ జిల్లా మా జన్మ హక్కు అని ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థి బాల్ లక్ష్మి, జెడ్పీటీసి వేముల స్వప్నసాగర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, జనగామ జిల్లా సాధన మా జన్మహక్కు అనే కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడు తూ అన్ని వసతులు ఉన్న జనగామను జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా ఉండడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. అన్ని రంగాల్లో జనగామ నియోజకవర్గం వెనకబడి ఉన్నదనీ, జిల్లా చేస్తే అభివృద్ధిపథంలో పయనిస్తుందన్నారు. చేర్యాల ప్రాంతంలో నీటి డ్యాములు ఉన్నందున దీనిని సిద్దిపేట జిల్లాలో కలుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసే ముందు ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను సేకరించాల్సి ఉంటుందనీ, అయినా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అందరినీ కలుపుకుని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వీరి వెంట నాయకులు రాపెల్లి వెంకటేష్, పందిపెల్లి సిద్దిరాంరెడ్డి, మల్లం లక్ష్మినారాయణ, అట్ల సందీప్, పెండెం నాగేష్, గౌస్, మంత్రి అయిలు మల్లయ్య, మహేందర్, నారాయణరెడ్డి, బొమ్మెన అంజనేయులు, ప్రకాష్, నేరెళ్ల రాజయ్య, నల్లగోని బాలకిషన్, రాగీరు సత్యనారాయణ ఉన్నారు.
Advertisement