జనగామ: రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య హత్య ఉదంతంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, దళిత వర్గానికి చెందిన రామకృష్ణయ్య బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల అరాచకా లను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావడంతోనే అంతమొందించారని అన్నారు. హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నా రు.
కబ్జాలు, భూదాహం వల్లే నియోజకవర్గంలో భూ సెటిల్మెంట్లు, అరాచకాలు పెరిగిపోతున్నాయ ని మండిపడ్డారు. హత్య కేసులో ఎమ్మెల్యేను సైతం చేర్చాలని డిమాండ్ చేశారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి : సీపీఎం
రామకృష్ణయ్య హత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యదర్శివర్గ సభ్యుడు సాంబరాజు యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఆర్థిక సాయం అందించాలన్నారు.
ఈ కేసులో గిరబోయిన అంజ య్యతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికా ర పార్టీ నాయకులపై హత్య, కుట్ర నేరం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. పరోక్షంగా హత్యకు కారకులైన బచ్చన్నపేట ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ను విధుల నుంచి డిస్మిస్ చేయాలని, ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి నైతిక బాధ్యత వహించి అంజయ్య సతీమణిని జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవి నుంచి బర్తరఫ్ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు బూడిద గోపి, జోగు ప్రకాష్, బోడ నరేందర్, బి.వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment