
జనగామ: ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డుకు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తామని జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. సోమవారం జనగామ మండలంలోని పెంబర్తిలో ముత్తిరెడ్డి ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి పాలనలో నీళ్లను దోచుకుని, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లను కాలబెట్టిన బాబుతో కాంగ్రెస్ జతకట్టడం సిగ్గుచేటన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కూలగొట్టేందుకు చంద్రబాబు, ఆయన కోవర్టు రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు బాబు మాట్లాడిన కూతలు రికార్డు అయ్యాయని.. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబును చర్లపల్లి జైలుకు పంపించడం ఖాయమన్నారు. కొడంగల్‌లో రేవంత్‌కు ఓటమి ఖాయమన్నారు.