
సాక్షి, జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే.. ఎమ్మెల్యే సతీమణి, డ్రైవర్, గన్‌మన్, వంట మనిషికి కూడా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వీరంతా హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం జలుబు, దగ్గుతో బాధ పడుతున్న ముత్తిరెడ్డి.. డాక్టర్లను సంప్రదించారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. కాగా, కరోనా అనుమానంతో ఎమ్మెల్యే సతీమణి, డ్రైవర్, గన్‌మన్, వంట మనిషిలకు సైతం పరీక్షలు నిర్వహించగా.. శనివారం సాయంత్రం పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎమ్మెల్యే సతీమణి వాయిస్ రికార్డు ద్వారా స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం రాష్ట్రంలో ఇదే తొలి కేసు.
Comments
Please login to add a commentAdd a comment