సర్కారు బడుల్లో వన్‌ క్లాస్‌–వన్‌ టీవీ | Union Minister Kishan Reddy At Opening Ceremony Of DBU | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో వన్‌ క్లాస్‌–వన్‌ టీవీ

Published Mon, Oct 17 2022 2:09 AM | Last Updated on Mon, Oct 17 2022 2:09 AM

Union Minister Kishan Reddy At Opening Ceremony Of DBU - Sakshi

జనగామ: దేశంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేంద్రం త్వరలోనే ‘వన్‌ క్లాస్‌–వన్‌ టీవీ’ కార్య క్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా డిజిటల్‌ బ్యాంకు యూని ట్‌ సేవలను ఆదివారం ప్రారంభించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డీబీయూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద గిరిరెడ్డితోపాటు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అన్ని రకాల బ్యాంకు సేవలు డిజిటల్‌లో సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టార న్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన రూ.25లక్షల కోట్ల నగదును జన్‌ధన్‌ ఖాతాల ద్వారా అందించిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ముద్ర రుణాల కింద రూ.2,750కోట్ల రుణాలను డిజిటల్‌ ద్వారా చెల్లించామని వెల్లడించారు.

నిధులు పక్కదారి పట్టకుండా ఉత్తరాది రాష్ట్రాలకు పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో చెల్లింపు ప్రక్రియ జరుగుతోందని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన ప్రధాని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డిజిటల్‌ పద్ధతిలో రూ.300కోట్ల స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement