జనగాం కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే | Jangaon Collector Devasena Versus MLA Muthireddy | Sakshi
Sakshi News home page

జనగాం కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే

Published Tue, Sep 26 2017 1:01 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Jangaon Collector Devasena Versus MLA Muthireddy - Sakshi

సాక్షి, జనగాం : గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య నెలకొంటున్న వివాదాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలనాపరంగా వారికి అడ్డుతగులుతున్నారని, అవసరమైతే బదిలీ వేటు వేస్తున్నారని ఎమ్మెల్యేలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగాం జిల్లా కలెక్టర్ దేవసేనకు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య కొనసాగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలను ఇంత కాలం ఓపిక పట్టానని, ఇకపై ఏమాత్రం సహించేది లేదన్న రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. తాజాగా బతుకమ్మ కుంట వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి మీడియా సాక్షిగా ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు ఐదెకరాల కుంటను పూడ్చినట్లు ఎమ్మెల్యే వర్గంపై కలెక్టర్ దేవసేన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, అభివృద్ది పేరు చెప్పి డబ్బులు ఎలా వసూలు చేసిందీ? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మీడియాకు పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరును దేవసేన చెప్పుకొచ్చారు.

అప్పట్లో ఎమ్మెల్యే ఓ గుడిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, దాన్ని తానే రద్దు చేశానని చెప్పుకొచ్చారు. బతుకమ్మ కుంట ప్రదేశం వివాదాస్పద స్థలంగా ఉండటంతోనే అక్కడ వేడుకలు నిర్వహించట్లేదని కలెక్టర్ దేవసేన తెలిపారు. కాగా, ఈ స్థల వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కలెక్టర్ గతంలోనే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారంట. అయినా సరే! పెద్దగా చర్యలేవీ లేకపోవడంతో.. తానే స్వయంగా ఆయన అక్రమాల గురించి మీడియాకు వెల్లడించినట్లు అర్థమౌతోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. 

కాగా కొన్నిరోజుల క్రితం జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనను నిలదీయగా, ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఎంపీ బూరనర్సయ్య గౌడ్ జోక్యం చేసుకోవటంతో ఇరువురు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement