
సాక్షి, హైదరాబాద్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన భార్య కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. ముత్తిరెడ్డి భార్య పద్మలతతో పాటు డ్రైవర్, గన్‌మెన్, వంట మనిషికి కూడా కరోనా సోకింది. దీంతో వీరంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. (చదవండి : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్)
కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాదగిరిరెడ్డి ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం జలుబు, దగ్గు రావడంతో ముత్తిరెడ్డి వైద్యులను సంప్రదించారు. ఈనెల 11వ తేదీన ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో అదే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం రాష్ట్రంలో ఇదే తొలికేసు. మరోవైపు తాను ఆరోగ్యంగానే ఉన‍్నానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముత్తిరెడ్డి భార్య నియోజకవర్గ ప్రజలకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment