ఎమ్మెల్యే ఇంటి ముందు మహిళల ఆందోళన
Published Fri, Jul 14 2017 12:05 PM | Last Updated on Tue, Oct 30 2018 5:26 PM
హైదరాబాద్: హబ్సిగూడలోని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటిముందు మహిళలు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. గత పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అమ్ముగూడా భూ వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు. సైనిక్ పురి అమ్ముగూడ వద్ద 15 సంవత్సరాల క్రితం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లేఅవుట్ చేసి 120 ప్లాట్లను అమ్మారు. హుడా అప్రూవుడ్ లేఅవుట్ అని చెప్పడంతో చాలా మంది మాజీ సైనికులు ప్లాట్లు కొనుగోలు చేశారు.
అనంతరం ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతి తీసుకుందామని వెళితే అధికారులు ఈ లేఅవుట్ పై కేసు నడుస్తోంది అనుమతీ ఇవ్వలేము అని చెప్పారు. దీంతో గత 15 సంవత్సరాలు గా తమ సమస్యను పరిష్కరించాలని భాదితులు ముత్తిరెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ తమ సమస్యను పరిష్కరించకపోవడంతో భాదితులు గురువారం హబ్సిగూడలోని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
Advertisement
Advertisement