
థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు
రాయపర్తి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డ్రైవర్ రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఉల్లెంగుల మధుకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓ మధుసూదన్ నేతృత్వంలో మైలారానికి చేరుకొని మధు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కరోనా లక్షణాలు కన్పించలేదని తెలిపారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. మాస్క్‌లు ధరించాలని కోరారు. జెడ్పీటీసీ రంగు కుమారస్వామి, వైద్యాధికారులు డాక్టర్ విపిన్, వెంకటేష్, సీహెచ్‌ఓ నెహ్రూచంద్, ఏఎన్‌ఎం అరుణ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment