
ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. జనగామలో టీఆర్ఎస్ నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
సాక్షి, జనగామ: ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. జనగామలో టీఆర్ఎస్ నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా నిరసన ఆందోళనకు దిగి ఘర్షణపడ్డారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. తోపులాట, ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అటు హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
చదవండి: కోడిపుంజుకు టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్