
కేసీఆర్.. నోరు అదుపులో పెట్టుకో కాంగ్రెస్ నేత పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలివి లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకో వాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో దళితులపై దాడులు చేసిన పోలీసులపై కఠినంగా వ్యవహరిం చకుండా పోలీసులకు మద్దతుగా మాట్లాడటం మంచిదికాదని హితవు పలికారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఇలాగే వ్యవహరించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉండేవారో ఆలోచించుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని పబ్‌లకు అనుమతి ఇచ్చిందో లెక్క తేల్చాలన్నారు. వాటి యజమానులు ఎవరో, వాటికి ఎవరు అండగా ఉన్నారో ధైర్యముంటే బయట పెట్టాలని పొన్నాల ఈ సందర్భంగా సవాల్ చేశారు.