'ఫిల్మ్సిటీపై కేసీఆర్ మాటమారుస్తున్నారు' | ponnala lakshmiah slams telangana cm kcr over ramoji film city | Sakshi
Sakshi News home page

'ఫిల్మ్సిటీపై కేసీఆర్ మాటమారుస్తున్నారు'

Published Mon, Jan 12 2015 1:06 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'ఫిల్మ్సిటీపై కేసీఆర్ మాటమారుస్తున్నారు' - Sakshi

'ఫిల్మ్సిటీపై కేసీఆర్ మాటమారుస్తున్నారు'

హైదరాబాద్ : రామోజీ ఫిల్మ్సిటీ భూముల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటమారుస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గతంలో  చెప్పినదానికి విరుద్ధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కేసీఆర్ మాట మారుస్తారని టీఆర్ఎస్ నేతలే... కొంతమంది అంగీకరిస్తున్నారని పొన్నాల వ్యాఖ్యానించారు. మాట తప్పుతూనే తాను మాట మార్చే మనిషిని కాను అని చెప్పడం కేసీఆర్కే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు.

రామోజీ ఫిల్మ్సిటీ భూముల వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని పొన్నాల అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, పెన్షన్లు రాని వృద్ధులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కేసీఆర్ భరోసా ఇవ్వడం లేదన్నారు. వరంగల్లో 4వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్...గతంలో గజ్వేల్లో 5వేల ఇళ్లు కట్టిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement