కట్టడి అంటే కర్రపట్టుకుని కాపలా కాయాలా?
కట్టడి అంటే కర్రపట్టుకుని కాపలా కాయాలా?
Published Fri, Oct 31 2014 3:25 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ. కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీ. శ్రీనివాస్ లు మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ప్రతిపక్షమే లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని పొన్నాల విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. ఫిరాయింపుల అంశాన్ని కౌన్సిల్ చైర్మన్, శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.
పార్టీ మారాలనుకుంటున్న నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని, పార్టీ వీడుతున్న నేతలు చెబితే మా లోపాలను సరిచేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అన్నారు. స్వార్ధం కోసం పార్టీ వీడుతున్న నేతలను కట్టడి చేయడమంటే.. కర్రపట్టుకుని కాపలా కాయాలా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పొన్నాల సమాధానమిచ్చారు.
Advertisement