వైద్యశాఖపై దృష్టిపెట‍్టండి: పొన్నాల
Published Thu, Feb 9 2017 2:26 PM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
హైదరాబాద్: టీఆర్‌ఎస్ పాలనలో అన్నిశాఖలు కుంటుపడ్డాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అనునిత్యం ఏదో ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్న వార్తలు ఎన్నో వింటున్నాం.. అయినా వైద్యశాఖ అధికారులు చలించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందనన్నారు.
ఇటీవలి కాలంలో సరోజిని హాస్పిటల్, నీలోఫర్, గాంధీ ఆస్పత్రులలో సరైన సదుపాయాలు లేక, వైద్య పరికరాలు లేక అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వైద్యశాఖ పై దృష్టిపెట్టాల్సిన అవసరముందున్నారు. హైదరాబాద్ నగరంలో అయినా, లేదంటే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని వసతులను పరిశీలించడానికి కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
Advertisement