వైద్యసేవలపై శ్వేతపత్రం ప్రకటించాలి
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంది స్తున్న వైద్యసేవలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. మర్రి శశిధర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కల సి గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసు పత్రుల్లో వైద్య పరికరాల్లేక, సిబ్బంది నిర్ల క్ష్యం, ప్రభుత్వ చేతకానితనం వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వైద్యశాఖ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు న్నరేళ్లుగా ఏ పనీ చేయని మంత్రి హరీశ్ కాంగ్రెస్‌పై నిందలేయడం మానుకోవా లని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.