'చంద్రబాబు తీరు గడ్డపార నానబెట్టాను.. అనేలా ఉంది'
హైదరాబాద్: రైతు రుణమాఫీ హామీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధిలేదని సిపిఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు కే.నారాయణ అన్నారు.
రైతు రుణమాఫీపై చంద్రబాబు చేసిన సంతకం చేసిన తీరుపై నారాయణ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు తొలిసంతకం గడ్డపార నానబెట్టాను..చూసుకోండి అన్నట్టుగా ఉంది అని నారాయణ వ్యాఖ్యలు చేశారు.
సకాలం వర్షాలు పడకపోవడం చంద్రబాబు అదృష్టమన్నారు. వర్షాలు పడివుంటే ఈ పాటికి రైతులు ఖరీఫ్ ప్రారంభించేవారని ఆయన అన్నారు. రుణమాఫీ కోసం చంద్రబాబు ముక్కును నేలకు రాయించాలని ఆయన అన్నారు. నగరం దుర్ఘటనకు గెయిల్‌తో పాటు ఓఎన్‌జీసీ సంస్థ కూడా బాధ్యత వహించాలని నారాయణ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.