కేసీఆర్ తాతనైనా ఎదిరిస్తాం: నారాయణ | KCR grandpa ediristam: Narayana | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తాతనైనా ఎదిరిస్తాం: నారాయణ

Published Tue, Jun 3 2014 12:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కేసీఆర్ తాతనైనా ఎదిరిస్తాం: నారాయణ - Sakshi

కేసీఆర్ తాతనైనా ఎదిరిస్తాం: నారాయణ

 హైదరాబాద : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాలనలో పారదర్శకత లోపిస్తే ఆయన తాతనైనా ఎదిరిస్తామని సీపీఐ నేత కె.నారాయణ హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావ సంబురాలను సోమవారం స్థానిక మఖ్దూంభవన్‌లో ఘనంగా నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో వనరులకు, కష్టపడే ప్రజలకు కొదవలేదన్నారు. తెలంగాణ  ఏర్పడినా భూమి, భుక్తి కోసం ఇంకా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

మన ప్రభుత్వమే కదాని ప్రజలు ఉదాసీనతగా ఉంటే మరో నిజాం ఏలుబడి వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజలను చైతన్య పరిచేందుకు వామపక్ష పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందకు తెచ్చేం దుకు కృషి చేస్తామని చెప్పారు. కమ్యూనిస్టులు కలసి ఉంటే నిన్నటి ఎన్నికల్లో గులాబీ స్థానంలో ఎర్రజెండా ఎగిరేదన్నారు. టీసీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో అందరి పాత్రా ఉందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement