'కాంగ్రెస్ మాకు అంటరాని పార్టీ కాదు' | K.Narayana comments on supported parties with cpi in andhra and telangana states | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ మాకు అంటరాని పార్టీ కాదు'

Published Sat, Mar 15 2014 1:00 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

'కాంగ్రెస్ మాకు అంటరాని పార్టీ కాదు' - Sakshi

'కాంగ్రెస్ మాకు అంటరాని పార్టీ కాదు'

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పార్టీలతో పొత్తులు వేర్వేరుగా ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ శనివారం హైదరాబాద్లో వెల్లండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఏమీ అంటరాని పార్టీ కాదని ఆయన తెలిపారు.తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో సమన్వయంతో వెళ్తే బాగుంటుందని సీపీఐ  భావిస్తుందని చెప్పారు.

 

అయితే తమతో సీపీఎంను కూడా కలుపుకోవాలని ఉందని, అదే విషయాన్ని ఆ పార్టీ నాయకులను కలసి కోరామని తెలిపారు.అయితే సీపీఎం మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదన్నారు.ఆదివారం విజయవాడలో సీమాంధ్ర సీపీఐ ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కె.నారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement