సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం దేశంలో సమాఖ్య వ్యవ స్థను ధ్వంసం చేయడానికి కుట్రలు చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఎం తెనా ఉందన్నారు. సుందరయ్య విజ్ఞానకేం ద్రంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో రాజకీయ ముసాయిదా తీ ర్మానం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనం తరం మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కు లను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను అవమానిం చే విధంగా మోదీ పార్లమెంట్‌లో మాట్లా డడం సరైంది కాదన్నారు. ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. మతం పేరుతో ఓట్లను సాధించేందుకు ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగానే కర్ణాట కలో ప్రజలను రెచ్చ గొట్టి మత వివాదా నికి పురి గొలిపిందని ధ్వజమె త్తారు.
ప్రజల భాష, వారి వేషధారణ, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణలపై ఆంక్షలు విధిస్తూ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం మట్లాడుతూ.. బీజేపీ విధానాలపై కఠినంగా ఉండాలని భావిస్తున్నామని చె ప్పారు. సీఎం కేసీఆర్‌కూడా బీజేపీకి వ్యతి రేకంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామ న్నారు. అయితే కేసీఆర్ పోడు భూముల విషయంలో అసెంబ్లీలో స్పష్టమైన హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి తప్ప.. మార్చడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment