'రైతుల సమాధులపై బాబు భూ సేకరణ'
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్పీ కుంటలో తలపెట్టిన సోలార్ ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరిన సీపీఎం నేత బీవీ రాఘవులను గురువారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్పై పోలీసులు దాడి చేశారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని పని చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల పేరుతో సీఎం చంద్రబాబు రైతుల సమాధులపై భూములు సేకరిస్తున్నారని రాఘవులు మండిపడ్డారు.