బి.వి. రాఘవులు
విజయవాడ: మార్పు మార్పు అంటూ కేవలం వాఖ్యలు చేయడమే కాకుండా మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి కారల్ మార్క్స్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఏళ్లు గడిచే కొద్ది మార్క్స్ సిద్ధాంతాలపై ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ..ఇటీవల మార్క్సిజంపై యువత ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించడానికి మార్క్స్ కృషి చేశారన్నారు. అందుకే మార్క్స్‌ని ప్రపంచం గుర్తుపెట్టుకుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరగడంతో యువతలో ఆగ్రహం పెరిగిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేందుకు మార్క్సిజంలో దారులు వెతుకుతున్నారని అభిప్రాయపడ్డారు. మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థలో వైవిధ్యం వచ్చిందని, ఇదే కొనసాగితే సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సోషలిజం వల్లే రాజ్యం అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. భారతదేశం సూపర్ పవర్ కావాలంటే కుల వ్యవస్థ పోవాలని రాఘవులు పేర్కొన్నారు.
వామపక్షాలకు మంచి రోజులొస్తాయి: మధు
మన రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాల పరిస్థితి ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని అందరూ అంటున్నారు. రానున్న రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను యువత వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లు లేవన్న చోటే వామపక్షాల ఉద్యమాలు బలపడుతున్నాయని మధు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment