అన్వయలోపమే అసలు సమస్య | Marxism Should Be Implemented, Mallepally Lakshmaiah Opiniones | Sakshi
Sakshi News home page

Published Thu, May 10 2018 2:33 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

Marxism Should Be Implemented, Mallepally Lakshmaiah Opiniones - Sakshi

కారల్‌ మార్క్స్‌

గౌతమ బుద్ధుడి నుంచి అంబేడ్కర్‌ దాకా, ఆ తర్వాత కూడా భారతదేశంలో 2500 సంవత్సరాలుగా కుల ఘర్షణల పరంపర కొనసాగుతూనే ఉంది. చరిత్ర పొడవునా సాగిన సంఘర్షణలను ఇక్కడి మార్క్సిస్టులు అర్థం చేసుకోలేదు. అందువల్లనే నాటి సమాజ పురోగతికి అడ్డుగా ఉన్న శక్తులను మనం ఇంకా నిర్ధారించలేదు. గౌతమ బుద్ధుడిని విప్లవకారుడిగా, అంబేడ్కర్‌ సమకాలీన తాత్వికవేత్తగా గుర్తించడానికి మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు సిద్ధంగా లేరు. భారతదేశ చరిత్ర క్రమం అర్థం కాకుండా, భారతదేశంలో విప్లవాలు అసాధ్యం.
 
సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిపోయిందనో, తూర్పు యూరప్‌లో సోషలిజం కనుమరుగైందనో, చైనాలో పెట్టుబడిదారీ పోకడలు తలెత్తాయనో భారతదేశంలో కమ్యూని స్టులు, విప్లవకారులు నామమాత్రమయ్యారనో మార్క్సిజానికి కాలం చెల్లిందనుకోవడం పొరపాటు. కార్ల్‌మార్క్స్‌ ప్రతిపాదించిన సిద్ధాంతానికి ఇప్పుడు ఎటువంటి ప్రామాణికతా లేదని ప్రకటిస్తున్నదంతా మేకపోతు గాంభీర్యమనే భావించాలి. కార్ల్‌మార్క్స్‌ రాసిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక ’ ఆనాటికీ, ఈనాటికీ, ఏనాటికైనా పీడిత జనబాహుళ్యం చేతిలో ఏకైక శాశ్వత పరిష్కారాస్త్రం. అదొక అజేయమైన శాస్త్రీయ సిద్ధాంతం.

ఇదే ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. దోపిడీ పీడనల పునాదులపై వెలసిన పారిశ్రామిక విధానం, రెక్కలు తప్ప ఆస్తులు లేని నిత్య దారిద్య్రాన్ని అనుభవిస్తోన్న కార్మికుల స్థితి గతులు, పీడనల నుంచి విముక్తి కోసం ఎన్నో కష్టాల కోర్చి, ఎంతో శ్రమించి ఆయన పరిశోధనాత్మకంగా రాసిన ‘దాస్‌ కాపిటల్‌’ ఆనాటి వరకూ ఉన్న ఆర్థిక వేత్తల దృక్పథాన్ని పూర్తిగా తారుమారు చేసింది. అంతేకాదు అప్పటి వరకూ ఉన్న పలు తప్పుడు భావజాలాలను మూలాలతో పెకిలించి వేసింది.

మార్క్సిజం అంటే ఆ రెండు గ్రంథాలే కాదు
కానీ మార్క్సిజం అంటే కేవలం ఈ రెండు గ్రంథాలే అన్నంతగా చేస్తున్న ప్రచారం కూడా పూర్తి సత్యం కాదు. నిజానికి ధనిక–పేద, రైతు కూలీ– భూస్వా ములు, ఉద్యోగులు–యజమానులు, పెట్టుబడిదా రుడూ– కార్మికులకూ మధ్య వ్యవస్థీకృతమైన అంత రాలూ, ఆ రెండు వర్గాల మధ్యనున్న వ్యత్యాసాన్ని సమాజం ప్రతిబింబించినంత కాలం కమ్యూనిస్టు మేనిఫెస్టోకీ, దాస్‌క్యాపిటల్‌కీ మరణం లేదు. కానీ అవి రెండు మాత్రమే మార్క్సిజం కాజాలదు.

సమ సమాజ లక్ష్యంగా ప్రతిపాదించిన రాజకీయ సిద్ధాం తానికి మార్గదర్శకం వహిస్తున్న ‘కమ్యూనిస్టు ప్రణా ళిక’, అసమానతల పుట్టుక పునాదులను తవ్వి తీసే ఆర్థిక సిద్ధాంతానికి సమగ్ర రూపం ‘దాస్‌కాపిటల్‌’ లకు భూమిక మార్క్సిస్టు తత్వశాస్త్రం. మార్క్సిస్టు తత్వశాస్త్ర పునాదిపైన ఆధారపడి ఈ రెండు మహా గ్రంథాలు రూపుదిద్దుకున్నాయి. మనిషిని మనిషే పీడించే తత్వంనుంచి విముక్తి చేసే మహత్తర సిద్ధాం తమది. అజరామరంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేయగల ఏకైక సత్యమదే.

యూరప్‌ అంతటా కొనసాగుతున్న పెట్టుబడి దారుల దోపిడీని కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి అదనపు విలువ సిద్ధాంతాన్ని కనిపెట్టిన మార్క్స్, కార్మికులను చైతన్య పరచడానికి, వారిని మూఢాం ధకారంలోనుంచి వెలికితే వడానికి చాలా సులభమైన తాత్విక ఆలోచనలను ముందుకు తీసుకొచ్చాడు. మొదటగా ఆయన ప్రతిపాదించిన గతితార్కిక సిద్ధాంతం. ఏ సందర్భం, ఏ సమాజం, ఎటువంటి పరిస్థితులైనా స్థిరంగా ఉండవనీ, మార్పు చెందు తూనే ఉంటాయనీ, అది అనివార్యమనీ ఆ సిద్ధాంతం చెపుతుంది.

అదేవిధంగా దోపిడీ చేసేవాళ్ళు, దోపిడీకి గురయ్యేవాళ్ళు ఉన్నంత వరకూ వర్గాలుంటాయి. వారి మధ్య వైరుధ్యాలూ, సంఘర్షణలూ ఉంటాయి. ఆ సంఘర్షణలే పోరాటా లకూ, విప్లవాలకూ దారితీస్తాయి. అవి అంతకన్నా భిన్నమైన మరో నూతన సమాజానికి దారులు వేస్తాయి. ఇది ఆయన ప్రాథమిక సూత్రీకరణ. అయితే ఈ పరిస్థితుల్లో మార్పుకి దేవుడో, ఏ మహాత్ముడో దిగి రావాల్సిన అవసరమేం లేదు. ప్రజలే తమ పరిస్థితుల్లో మార్పులు తీసుకురాగలుగు తారు.

అందుకే వారే చరిత్ర నిర్మాతలని కూడా మార్క్స్‌ ప్రకటించారు. ఎప్పుడైతే అణచివేత దోపిడీ లాంటి దుర్మార్గాల వల్ల సమాజం సంక్షోభం లోకి పోతుందో అప్పుడు అని వార్యంగా పీడనకు గురవు  తోన్న శక్తులు ఆ పరిస్థితు లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాయనీ అదే పరి పక్వ దశ అనీ, ఒక దశ నుంచి మరో దశలోకి ప్రయా ణించే సమాజక్రమాన్ని చరిత్ర రుజువు చేస్తుందని కూడా మార్క్స్‌ ప్రకటిం చారు. అందుకే ప్రపంచ చరిత్ర అంతా వర్గపోరా టాల చరిత్రగా ఆయన అభివర్ణిస్తారు.

ప్రపంచాన్ని నిద్ర లేపిన మేటి సిద్ధాంతం
అంతే కాకుండా ప్రజల కష్టాలకు, ముఖ్యంగా పేద రికానికి వ్యక్తిగత ఆస్తి విధానం కూడా కారణమని, దానిని కాపాడుకోవడానికి రాజ్యం, బలం, బలగా లను సృష్టించిందని కూడా మార్క్స్‌ చారిత్రక ఆధా రాలతో సహా నిరూపించారు. ఈ సిద్ధాంతం అప్పటి ప్రపంచాన్ని నిద్రలేపింది. అప్పటివరకు తమ కష్టా లకు, కన్నీళ్ళకు దేవుడు, ఏవో అతీంద్రియ శక్తులు కారణమని భ్రమిస్తున్న శ్రామికులకు చైతన్యం కలి గించడం మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా కనిపించే శత్రువును మార్క్స్‌ తన సిద్ధాంతం గొలుసులతో కట్టి, వారి ముందు నిలబెట్టాడు.

పెట్టుబడిదారీ విధా నం కానీ, మరే విధమైన దోపిడీ అయినా గానీ, పోరాటాల ద్వారా రూపుమాసిపోతుందని చెబు తూనే, సోషలిజం, కమ్యూనిజం లాంటి సమ సమాజ వ్యవస్థలు ఏర్పడుతాయని వివరించారు. మార్క్స్‌ ఎంతో అన్వేషణతో ప్రపంచానికి ఒక నూతన విముక్తి మార్గాన్ని ప్రతిపాదించారు. అందులో ముఖ్యమైనది సమగ్రమైన సమాజ అధ్య యనం, నిజమైన శత్రువును ప్రజల ముందు నిల బెట్టడం, ఆ తర్వాత రూపొందబోయే ప్రత్యామ్నాయ వ్యవస్థ రూపాన్ని ఆవిష్కరించడం చేయాలి. సరిగ్గా కార్ల్‌మార్క్స్‌ అదే చేశాడు. అయితే ఇది అన్ని దేశా లకూ, ప్రాంతాలకూ, కాలాలకూ ఒకేరకంగా ఉండ దనీ, దేశ, కాల పరిస్థితులకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని మార్క్స్‌ పేర్కొన్నారు.

నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట అన్వయం
మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించు కోవడం వల్లనే మొట్టమొదట రష్యాలో, ఆ తర్వాత చైనాలో విప్లవాలు సాధ్యమయ్యాయి. మౌలికమైన మార్క్సిస్టు సూత్రాలను రష్యాలో లెనిన్‌ తన కార్యా చరణకు అన్వయించుకు న్నారు. జార్‌ చక్రవర్తి దుర్మా ర్గాలను ప్రజల్లో ఎండగట్టి, విముక్తి మార్గాన్ని ప్రజల ముందుంచారు. ఎంతో చైత న్యాన్ని అందించి, ప్రజ లను ఐక్యం చేసి జార్‌ ప్రభుత్వాన్ని కూలదోసారు. అలాగే చైనాలో భూస్వామ్య వ్యవస్థ, యుద్ధ ప్రభువులు, జపాన్‌ లాంటి దురాక్రమణ దారులు ప్రజలకు నిజమైన శత్రువులని, ఆ దేశ విప్లవ నేత మావో తేల్చి చెప్పారు. ఆ ప్రాతిపదికపై ప్రజలను ఐక్యం చేసి దీర్ఘకాలిక సాయుధపోరాటంతో విజయం సాధించారు. 

చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన కాలంలోనే భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ అవతరణ జరిగింది. అయితే కమ్యూనిస్టు పార్టీ ఈ దేశాన్ని, దేశ ప్రజలను, పీడన, దోపిడీ నుంచి విముక్తి చేయలేక పోయింది. పైగా ఎన్నో చీలికలు జరిగి బలహీన పడింది. అయితే కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీ సాగించిన పోరాటాలు ప్రజలకు తాత్కాలి కంగా, పాక్షికంగా దోపిడీ పీడనల నుంచి విముక్తి కలి గించాయి. కార్ల్‌మార్క్స్‌ సూచించిన విధంగా నిర్దిష్ట కాలమాన పరిస్థితుల్లో దోపిడీదారులెవరో ప్రత్య క్షంగా నిలబెట్టడం ద్వారా తెలంగాణ సాయుధ పోరాటం, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కులాధి పత్య భూస్వామ్య వ్యతిరేక పోరాటాలూ కొన్ని తక్షణ ఫలితాలను ప్రజలకు అందించాయి.

భారతదేశంలో వేల ఏళ్ళుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ కేవలం సాంస్కృతికపరమైన, సాంప్ర దాయాలకు సంబంధించిన అంశం కాదు. కులం ఈ దేశంలోని ప్రజలకు ఇనుప కంచె లాంటి ప్రధానమైన అవరోధం. అన్ని సంక్షోభాలకూ ఇక్కడ కులం పునా దిగా ఉంటుంది. ఇటువంటి దేశంలో ఒక ప్రత్యేక మైన అధ్యయనం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితులకు ఏ వర్గాలూ, ఏ విధానాలూ, ఏ వ్యవస్థలూ కారణ మవుతున్నాయో ఆలోచించాలి. కార్ల్‌మార్క్స్‌ ప్రతిపా దించిన చారిత్రక క్రమాన్ని మన దేశ చరిత్ర నుంచి అర్థం చేసుకోవాలి. అంతేకానీ, యూరప్‌ను ఒక నమూనాగా, చైనాను మరొక మార్గంగా చూడడం సరిౖయెంది కాదనేది వాస్తవం.

బౌద్ధం తొలి సామాజిక విప్లవం
2500 సంవత్సరాల కిందట ఏర్పడిన కుల వ్యవస్థ ఇప్పటికీ భారతదేశాన్ని అనేక రూపాల్లో పీడిస్తున్నది. అయితే పీడనకు, అణచివేతకు గురవు తున్న కులాలు, వర్గాలు నిరంతరం ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. సిద్ధార్థ గౌతమ బుద్ధుని నాయకత్వం విజయవంతమై మొట్టమొదట సామాజిక విప్లవం దేశంలో ఎన్నో మార్పులకు, నూతన ఆవిష్కర ణకు పునాది అయింది. కానీ మళ్ళీ విప్లవ ప్రతీఘాత శక్తులు కులాధిపత్యాన్ని స్థాపించ డానికి ఎంతో నరమే«థానికి పాల్పడ్డాయి.  గౌతమ బుద్ధుడి నుంచి అంబేడ్కర్‌ దాకా, ఆ తర్వాత కూడా ఆ ఘర్షణల పరంపర కొనసాగుతూనే ఉంది.

ఈ చారిత్రక క్రమాన్ని, చరిత్ర పొడవునా సాగిన సంఘర్ష ణలను ఇక్కడి మార్క్సిస్టులు అర్థం చేసుకోలేదు. కాబట్టే నాటి సమాజ పురోగతికి అడ్డుగా ఉన్న శక్తు లను మనం ఇంకా నిర్ధారించలేదు. గౌతమ బుద్ధు డిని విప్లవకారుడిగా, అంబేడ్కర్‌ సమకాలీన తాత్విక వేత్తగా గుర్తించడానికి మార్క్సిజాన్ని అనుసరిస్తున్నా మని చెప్పుకుంటున్న వాళ్ళు సిద్ధంగా లేరు. భారత దేశ చరిత్ర క్రమం అర్థం కాకుండా, దేశంలో విప్ల వాలు అసాధ్యం. అలాగే యూరప్‌ దేశాలకూ భారత సామాజిక పరిస్థితులకూ ఉన్న మౌలిక వ్యత్యాసా లను సైతం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే నేటి భార తీయ సమాజంలోని ప్రజలను విప్లవోద్యమం వైపు మళ్ళించడం సాధ్యం అవుతుంది.

చైనా విప్లవం సమయంలో మావో సేటుంగ్‌ చెప్పిన విషయం ప్రస్తావించుకోవాలి. ‘‘మనం మార్క్సిస్టు–లెనినిస్టు వైఖరిని, దృక్పథాన్ని, పద్ధ తుల్ని అధ్యయనం చేసి చైనా చరిత్రకూ, ఆ దేశ ఆర్థిక, రాజకీయ, సైనిక, సాంస్కృతిక విషయాలకూ అన్వయించాలి’’ ఇది భారత్‌కి కూడా వర్తిస్తుంది.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య
మొబైల్‌ : 97055 66213

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement