Karl marx
-
శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు
ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడే ఆయన జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను కలుసు కున్నారు. ఫ్రాన్స్ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్ (లండన్) వెళ్లి మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. మార్క్స్ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్ ఏంగిల్స్‌తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్‌తో కలిసి రాశారు. 1867లో ‘దాస్ క్యాపి టల్’ మొదటి వాల్యూమ్‌ను ప్రచురించారు.మానవ సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్ మార్క్స్ ‘ఫ్రెడరిక్ ఏంగిల్స్‌లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్–ఏంగెల్స్‌లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్‌లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్ క్యాపిటల్’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్. అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్ శాస్త్రీయంగా వివరించారు. మార్క్స్ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేశారు.– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు(నేడు కారల్ మార్క్స్ జయంతి) -
మార్క్స్ అవగాహన రుజువవుతోందా?
పార్లమెంటులో, శాసన సభల్లో వందలాది మంది ఎలా కోట్ల ఆస్తులకు పడగలెత్తారని ‘ఏడీఆర్’ నివేదికలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను ‘ఐదేళ్ల కాంట్రాక్టు’గానే పార్టీలు చూస్తున్నాయి. ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ధనికవర్గ సమాజాలు నేరస్థుల్ని, వారి వెంటనే నేర చట్టాల్ని, వాటిని సమర్థించే శక్తుల్ని ఎలా సృష్టించుకుంటూ పోతాయో కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. అలాంటి సమాజంలో ఒక తత్వవేత్త అందుకు తగిన భావాల్ని అందజేస్తాడు. ఒక కవి తన కవితల్ని అల్లుకుంటూ పోతాడు. ఒక మతాధికారి తన వంతుగా ప్రవచనాల్ని అందిస్తాడు. వర్గ రహిత సోషలిస్టు వ్యవస్థ ఏర్పడేవరకూ ఈ పరిస్థితిలో మార్పు ఉండదు! ‘‘మన దేశంలో ప్రజల కోసం కాకుండా పవర్ (అధికారం) కోసమే పథకాలు పుట్టు కొస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను ‘ఐదేళ్ల కాంట్రాక్టు’గానే పార్టీలు చూస్తున్నాయి. కార్పొరేట్ విధాన రాజకీయాలనే అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇంతకూ మన దేశంలో భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యా లను చదివిన నాయకులెందరు?’’ – తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి వి. నాగిరెడ్డి (28.10.2023) ‘‘దేశంలో చట్టాలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ వల్ల ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతోంది. దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల అధీనంలో ఉండ వలసిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రయివేట్ రంగ సన్నిహితులకు కట్టబెట్టడానికి మారుపేరు ‘ఆశ్రిత పెట్టుబడి’!’’ – సీనియర్ పాత్రికేయులు పరాంజయ గుహ ఠాకుర్తా (29.10.2023) ‘పాలన సాగించే సివిల్ సర్వెంట్లను ప్రచార సాధనాలుగా ఉపయోగించుకునేలా– దేశంలోని 765 జిల్లాలకు జాయింట్ సెక్రటరీ, లేదా అంతకన్నా తక్కువ స్థాయి అధికారులను ‘రథ్ ప్రభారీ’లుగా నామినేట్ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై కేంద్ర మంత్రి మండలి మాజీ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్ తీవ్ర నిరసన తెలిపారు.’ (30.10. 2023) పాలనా యంత్రాంగంలో అవినీతి భాగోతం అంతటితోనే ఆగలేదు. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో డబ్బు ఎక్కడినుంచి వస్తోందీ, ఎటు పంపిణీ అవుతోందన్న వివరాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ‘లేదు పొమ్మని’ మోదీ ప్రభుత్వ అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టు ముఖం మీదనే చెప్పారు. తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదు పొమ్మంటున్న కేంద్ర పాలకుల ఎత్తుగడను సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నిస్తోంది. భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్కరణలు స్థిరపడి నిలదొక్కు కునేటట్లు చేసేందుకు ఏర్పడిన సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్’... కొంతకాలంగా పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల్లో ప్రవేశి స్తున్న వివిధ పార్టీల, రాజకీయ నాయకుల, ప్రతినిధుల ఆదాయ వ్యయాల వివరాలను వెల్లడిస్తూ దేశ ప్రజల్ని హెచ్చరిస్తోంది. ‘అందరూ శాకాహారులే అయిన చోట రొయ్యల బుట్ట ఎలా ఖాళీ అవుతోంద’ని ప్రశ్నిస్తోంది. పార్లమెంటులో 250 మంది సభ్యులకు పైగా, రాష్ట్రాల శాసన సభల సభ్యులలో వందలాది మంది ఎలా వందల కోట్ల ఆస్తులకు పడగలెత్తుతూ వచ్చారని ‘ఏడీఆర్’ సాధికార నివేదికలు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు. సగానికి పైగా పార్లమెంట్ సభ్యులలో, రాష్ట్రాల శాసన సభ్యులలో, పాలకులలో పేరుకు పోతున్న అవినీతికి, క్రిమినల్ కేసులకు అంతులేని పరిస్థితిని ఏడీఆర్ సాధికార నివేదికలు బయట పెడుతున్నాయి. క్రమంగా ఇలాంటి పరిస్థితులు ధనికవర్గ సమాజాలు నేరస్థుల్ని, వారి వెంటనే నేర చట్టాల్ని, వాటిని సమర్థించే శక్తుల్ని ఎలా సృష్టించుకుంటూ పోతాయో చరిత్రలో మొదటిసారిగా విశ్లేషించినవాడు శాస్త్రీయ సోష లిజం సిద్ధాంత ప్రవక్త కార్ల్ మార్క్స్. అలాంటి దోపిడీ వ్యవస్థ ఉనికిని కాపాడటానికి వివిధ శక్తులు ఏ స్థాయిల్లో ఎలా చేదోడు వాదోడు అవుతాయో మార్క్స్ ఇలా విశ్లేషించి చూపాడు: అలాంటి సమాజంలో ఒక తత్వవేత్త అందుకు తగిన భావాల్ని అందజేస్తాడు. ఒక కవి తన కవితల్ని అల్లుకుంటూ పోతాడు. ఒక మతాధికారి లేదా పూజారి తన వంతుగా ప్రవచనాల్ని అందిస్తాడు. ఓ ప్రొఫెసర్ గారు ఇందుకు తగిన గ్రంథ రాజాల సారాంశాన్ని అందజేస్తుంటాడు. ఓ నేరగాడు యథేచ్ఛగా అలా నేరాలు చేస్తూనే పోతాడు. నేరానికి పాల్పడటం కూడా ధనిక, దోపిడీ వర్గ సమాజ వస్తూత్పత్తి క్రమంలో భాగంగానే సాగిపోతుంది. అటు సరుకుల ఉత్పత్తి క్రమానికి, ఇటు సమాజానికి మధ్య నెలకొనే అవినాభావ సంబంధాన్ని పరిశీలించినట్లయితే–అనేక భ్రమలు, దురభిమానాలు పటాపంచలై పోతాయి. ఎందుకంటే, మన ‘లా ప్రొఫెసర్’ గారు ఆ భ్రమలపై ఆధారపడి ఓ గ్రంథ రాజాన్ని తయారు చేసుకొని మార్కెట్ లోకి ఓ అమ్మకపు సరుకుగా వదులు తాడు. ఆ పుస్తకాన్ని తమ వంతు ‘జాతీయ సంపద’గా భావించి ధనిక వర్గం పంచుకోవడానికి దోహద పడుతుంది. మరో వైపున దాన్ని తయారు చేసిన ‘లా ప్రొఫెసర్’ గారిలో ఇది వ్యక్తిగత మైన ఆనందాన్నీ, తృప్తినీ పెంచేస్తుంది. ఇలా మన ప్రొఫెసర్ ధనికవర్గ ప్రయోజనాలకు ఉపయోగపడే ఓ క్రిమినల్ చట్టం రూపొందడానికి చేయూత నివ్వడమేగాక, ఆ చట్టానికి గొడుగు పట్టే ‘పీనల్ కోడ్స్’ (శిక్షా స్మృతి)ను, దానితోపాటే ధనికవర్గ ప్రయోజనాలు ఈడేర్చిపెట్టే శాసన కర్తలు, కళాకారులు రూపొందేలా, ఆ చట్టానికి వత్తాసు పలికే సాహిత్యానికి, నవలలకు, చివరికి సమాజంలో అనంతమైన విషాదకర సన్నివేశాలకు కారణమవుతాడు. కనుకనే, అలాంటి సమాజాల్లో పరస్పర వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఒక వైపు నుంచి ధనికవర్గమూ, మరో వైపు నుంచి శ్రామికులు ఆచరణలో ప్రయివేట్ ఆస్తి ఉనికిని కాపాడు తున్నట్టు అవుతోందని కూడా మార్క్స్ ప్రభృతులు అరమరికలు లేకుండా చెప్పారు. వర్గ రహిత సోషలిస్టు వ్యవస్థ ఏర్పడేవరకూ ఈ పరిస్థితిలో మార్పు ఉండదు! అందుకే అన్నాడా, శ్రమ విలువ తెలిసిన వేమన? ‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానౌను’’! కాగా, అసలు జీవితమంటే ఏదో ‘సినారె’ను అడిగితే చెబుతాడు: ‘‘ఉప్పెనలో తలవొగ్గక నిలువున ఉబికొచ్చే జీవితం ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం చచ్చేదాకా బతికి వుండటం జాతకాల్లో ఉన్నదే – ఒరిగిపోయినా తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం ప్రలోభాలు పైబడినా నీతికి పడి చచ్చేదే జీవితం’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!
భారతదేశ సామాజిక నేపథ్యం నుంచి కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తులనాత్మకంగా పరిశీలించారు. బుద్ధుడినీ, మార్క్స్‌నూ ఒకేస్థాయిలో పోల్చారు. ప్రపంచ ఆవిర్భావంలో దేవుడి ప్రమేయాన్ని బౌద్ధం, మార్క్సిజం... రెండూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఈ ప్రపంచంలో ఏవీ శాశ్వతం కాదనీ, ఇవి నిత్యం మారుతుంటాయనీ బుద్ధుడు, మార్క్స్ ఇరువురూ చెప్పారు. దాన్ని మార్క్స్ గతి తర్కం అంటే, బుద్ధుడు అనిత్త (అనిత్య) అని పేర్కొన్నారు. ఇక సమాజంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం బౌద్ధం అన్వేషిస్తే, పేదరికం... దానికి కారణమైన దోపిడీ, దాన్ని నిర్మూలించే మార్గాన్ని మార్క్సిజం చూపెట్టింది. మార్క్స్‌తో అన్ని విషయాల్లో ఏకీభవిస్తూనే, కార్మిక వర్గ నియంతృత్వాన్ని మాత్రం తీవ్రంగా ఆక్షేపించారు అంబేడ్కర్. ‘ఆధునిక సోషలిజం, కమ్యూనిజంలకు కారల్ మార్క్స్ తండ్రి లాంటి వాడు. ఊహా జనిత సోషలిజాన్ని ఎండగట్టి ఆయన శాస్త్రీయ సోషలిజానికి పునా దులు వేశారు. పెట్టుబడిదారులతో పాటు, ఊహాజనిత సోషలిస్టులకు వ్యతిరేకంగా సిద్ధాంత పోరాటాలు చేశారు. ఈ రెండూ సమాజ ప్రమాదకారులేనని కారల్ మార్క్స్ తేల్చి చెప్పారు. అందుకే కారల్ మార్క్స్ సోషలిస్టు వ్యవస్థను శాస్త్రీయంగా నిర్వచించడంలో ఆద్యుడిగా నిలిచారు’’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ‘బుద్ధ లేదా కారల్ మార్క్స్’ రచనలో పేర్కొన్నారు. 1956 నవంబర్ 20వ తేదీన నేపాల్ లోని ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొని ఇదే విషయమై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అంటే అంబేడ్కర్ మహాపరినిర్వాణం పొందడానికి సరిగ్గా పదిహేను రోజుల ముందు ఈ సమావేశం జరిగింది. భారత దేశ చారిత్రక పరిస్థితులు, సామాజిక నేపథ్యం నుంచి ప్రపంచ శ్రామిక వర్గ మహానేత, కమ్యూనిస్టు వ్యవస్థ నిర్మాత కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసిన రచనగానీ, ప్రసంగం గానీ మరొకటి లేదని భావిస్తున్నాను. ‘కారల్ మార్క్స్, గౌతమ బుద్ధుని పోల్చి చూపడం చాలామందికి హాస్యాస్పదంగానే అనిపించవచ్చు. దీనికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మార్క్స్‌కీ బుద్ధునికీ మధ్య 2,381 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. బుద్ధుడు జన్మించింది క్రీ.పూ.563 కాగా, మార్క్స్ పుట్టింది క్రీ.శ.1818 సంవత్సరం. బుద్ధుడినీ, మార్క్స్‌నూ ఒకే స్థాయిలో పోలు స్తుంటే, మార్క్సిస్టులకు అపహాస్యంగా అనిపిస్తుంటుంది. ఈ పోలిక చాలా తొందరపాటుగా భావిస్తుండవచ్చు. అయితే మార్క్సిస్టులు తమ అపోహలను పక్కన పెట్టి, కారల్‌మార్క్స్‌తో పాటు బుద్ధుని బోధనలనూ, బౌద్ధం ప్రాధాన్యతనూ అధ్యయనం చేస్తే వాళ్ళ ఆలో చనల్లో తప్పనిసరిగా మార్పు వస్తుంది’’ అంటూ బాబాసాహెబ్ తన రచనను మొదలు పెట్టారు. బౌద్ధాన్నీ, మార్క్సిజాన్నీ విడివిడిగా వివరించి, మళ్ళీ పోలికలను, వ్యత్యాసాలను విడదీసి చూపెట్టారు. వీటిని మూడు భాగాలుగా చూడవచ్చు. మొదటిది, తాత్విక విష యాలు, రెండవది, ఆర్థిక–సామాజిక అంశాలు. మూడవది, రాజ కీయ వ్యవస్థల నిర్మాణం. మొదటి అంశమైన తాత్వికతను చూస్తే, కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో ఈ ప్రపంచ ఆవిర్భావం గురించి చెబుతూ, అందులో దేవుడి ప్రమేయాన్ని ఈ రెండు సిద్ధాంతాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. మార్క్స్ మానవ పరిణామ క్రమాన్ని డార్విన్, ఇతర శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఉదహరిస్తే, అంతకన్నా 2,300 ఏళ్ళ క్రితమే, ఈ విశ్వం తనంతట తానే ఉద్భవించిందనీ, ఇందులో ఎటు వంటి అతీంద్రియ శక్తుల ప్రమేయం లేదనీ తన ‘అగ్గన్న సుత్త’ ప్రసంగంలో గౌతమ బుద్ధుడు పేర్కొన్నారు. ఈ ప్రపంచం ఆవిర్భ వించడం గురించి తెలిపిన విషయం డార్విన్ సిద్ధాంతానికి పునాదిగా కనిపిస్తుంది. ఇక రెండో సామ్యం, ఈ ప్రపంచంలోని వస్తువులు ఏవీ కూడా శాశ్వతం కాదు అనేది. ఇవి నిత్యం మారుతుంటాయి. దీనిని మార్క్స్ గతి తర్కం అంటే, గౌతమ బుద్ధుడు అనిత్త(అనిత్య) అని పేర్కొన్నారు. అంటే అశాశ్వతం అని అర్థం. వస్తువుకు పుట్టుక, నాశనం ఉండదనీ, అది పాత రూపం మార్చుకొని, కొత్తదానిలోకి మారుతుందనీ మార్క్స్ భావం అభావం చెందడంగా భావిస్తే... బుద్ధుడు దానిని పునబ్బవ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఇద్దరూ ప్రతి సంఘటనకు కార్యకారణ సంబంధముంటుందని తేల్చారు. బౌద్ధంలో దానిని ‘ప్రతీత్య సముత్పాద’ అంటారు. ఒక సంఘటన జరగడం ఏదో యాదృచ్ఛికం కాదనీ, దానికి కారణాలు ఉంటాయనీ భావం. అంటే సమాజాన్ని గతి తార్కిక దృష్టితో చూడటం అనేది రెండు సిద్ధాంతాలలోనూ ఉంది. సమాజంలోని కష్టాలకూ, సమస్యలకూ రెండు తాత్విక మార్గాలూ పరిష్కారాన్ని కనిపెట్టాయి. సమాజంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం బౌద్ధం అన్వేషిస్తే, పేదరికం... దానికి కారణమైన దోపిడీ, దాన్ని నిర్మూలించే మార్గాన్ని మార్క్సిజం చూపెట్టింది. ఈ రెండింటిలోనూ సొంత ఆస్తి అనేది ప్రధాన కారణంగా పనిచేసింది. అందుకే బౌద్ధ భిక్కులు ఎవ్వరూ కూడా ఆస్తులనే కాదు, అనవసర వస్తువులను కూడా కలిగి ఉండకూడదనే నిబంధనలు పెట్టారు. సొంత ఆస్తి వ్యవస్థ దోపిడీకీ, పేదరికానికీ కారణమనీ... అందువల్ల సొంత ఆస్తిని నిర్మూలించే కమ్యూన్లను ఏర్పాటు చేయాలనీ మార్క్స్ భావించారు. దానినే గౌతమ బుద్ధుడు బౌద్ధ సంఘాల ద్వారా ఒక నూతన వ్యవస్థను నిర్మించాలని ప్రతిపాదించారు. కమ్యూనిస్టు దేశాల్లో కమ్యూన్లు, సహకార వ్యవస్థలు ప్రజల సామాజిక అభి వృద్ధికి నేతృత్వం వహించాయి. ఆర్థిక, సామాజిక, నైతిక మద్దతును రైతులకూ, కార్మికులకూ అందించాయి. బౌద్ధ సంఘాలు, బౌద్ధారా మాలు కూడా ఆర్థిక సహాకార సంస్థలను నడిపాయి. దానికి సంబం ధించిన ఆధారాలు మనకు బౌద్ధ సాహిత్యంలో దర్శనమిస్తాయి. అయితే సమాజ మార్పునకు వర్గపోరాటాలే మార్గమని మార్క్సిజం భావిస్తే, బౌద్ధం మాత్రం అనివార్యమైతే తప్ప యుద్ధాలు వద్దని తేల్చిచెప్పింది. చాలా మంది బౌద్ధం అనగానే అహింసను ప్రబోధించే మానవ సిద్ధాంతంగా భావిస్తారు. కానీ బౌద్ధం న్యాయం కోసం, ప్రజల రక్షణ కోసం యుద్ధం చేయాల్సి వస్తే వెనుకాడకూడదని తేల్చి చెప్పింది. ఒకదేశ సేనాధిపతి సింహసేనాపతితో బుద్ధుడు జరిపిన సంభాషణలో ఈ విషయం తేల్చి చెప్పారు. ఇది అంగుత్తర నికాయలోని ‘సింహసేనాపతి సుత్తలో ఉంది. మార్క్సిజం లాగానే బౌద్ధం ఆనాటి వైరుధ్యాన్ని కనిపెట్టి మహా విప్లవాన్ని నడిపింది. యజ్ఞయాగాలలో సమాజాన్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తూ, ఆనాటి సామాజిక ప్రగతికి అడ్డుగోడలుగా నిలిచిన పురోహిత, వైదిక వ్యవస్థను ఎదుర్కొని సామాజిక విప్లవాన్ని సాధించింది. అందుకే బౌద్ధం భారత దేశ తొలి సామాజిక విప్లవం. అదే విధంగా మార్క్సిజం ఆధునిక ప్రపంచ విప్లవ సిద్ధాంతం. అయితే అంబేడ్కర్ మార్క్సిజంతో తీవ్రంగా విభేదించిన అంశం ‘కార్మిక వర్గ నియంతృత్వ’ వ్యవస్థ. దీన్ని ప్రాథమికంగా మార్క్స్ నిర్వచిస్తే, దానిని రష్యా విప్లవనేత లెనిన్ ఆచరణలో చూపెట్టారు. మార్క్స్‌ని అన్ని విషయాల్లో ఏకీభవిస్తూనే, కార్మిక వర్గ నియంతృ త్వాన్ని మాత్రం చాలా తీవ్రంగా ఆక్షేపించారు అంబేడ్కర్. బౌద్ధం లోనే తన అభిప్రాయానికి పునాది ఉందని అంబేడ్కర్ పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడు ఆనాటి మహాజనపదాల ప్రజాస్వామ్య విలువలను విశ్వసించాడనీ, వాటిని తన విధానంగా ప్రతిపాదించాడనీ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆనాటి కన్నా ఈనాడు సమాజం ఎంతో ముందుకు పోయిందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నియంతృత్వమైనా సరియైనది కాదనీ, అది ప్రజలను స్వేచ్ఛకు దూరం చేస్తుందనీ అంబే డ్కర్ భావించారు. మార్క్స్ సిద్ధాంతం ద్వారా ఆర్థిక సమానత్వం వస్తుందనీ, కానీ భారతదేశంలో అంతరాలకి ముఖ్యమైన కులవ్యవస్థ సృష్టించిన కుల వ్యత్యాసాలు సోదరత్వాన్ని అడ్డుకుంటున్నాయనీ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఆ ఒక్క విషయం మినహా భారతదేశ విప్లవ సిద్ధాంతమైన బౌద్ధానికీ, మార్క్సిజానికీ చాలా సామ్యాలున్నాయని అంబేడ్కర్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రజలు సామాజిక, రాజకీయ ఆర్థిక సమానతల కోసం జరుపుతున్న పోరా టంలో బౌద్ధం, మార్క్సిజం సిద్ధాంతాల అవసరముందనే విషయాన్ని మనం గమనించాలి. మార్క్సిజం ప్రకారమే, ప్రతి దేశంలో ఉన్న చారిత్రక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా వాటికి అనుగుణంగానే చారి త్రక భౌతిక వాదాన్ని రూపొందించుకోవాలని ప్రముఖ మార్క్సిస్టు తత్వవేత్త మార్తా హర్నేకర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 (నేడు కారల్ మార్క్స్ జయంతి) -
కమ్యూనిస్టు ప్రణాళిక ఘనత
విశ్వమానవ విముక్తి కోరే శక్తులంతా ఒక్కటై విప్లవోద్యమానికి పునరంకితమయ్యే దిశగా జరుగుతున్న ప్రయత్నం ప్రపంచ అరుణ గ్రం«థోత్సవం. ప్రపంచ గతిని మార్చిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలిసారి పుస్తకరూపంలో విడుదలైన రోజు 1848 ఫిబ్రవరి 21. విశ్వవిపణిలో శ్రమ అమ్ముకోవటం తప్ప మరో జీవనాధారం లేని కోట్లాదిమందికి గొంతుకనిచ్చిన రచన మార్క్స్, ఏంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ ప్రణాళిక విడుదల దినోత్సవాన్ని ప్రపంచ అరుణ గ్రంథ దినోత్సవంగా ఇక నుంచి ప్రతి ఏటా ప్రపంచ ప్రజాతంత్ర విప్లవ శక్తులు జరుపుకోనున్నాయి. దాదాపు 170 ఏళ్లు దాటిన తర్వాత కూడా కమ్యూనిస్టు ప్రణాళికను ప్రపంచం ఎందుకు గుర్తు పెట్టుకుంది? ఇంతవరకు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన కోటానుకోట్ల గ్రంథాల్లో వేల సంవత్సరాల ప్రజల చరిత్రను ప్రజల భాషలో వివరించిన ఏకైక గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. ప్రపంచంలో ఏ రోజైనా ఏ ఖండంలోనైనా పరీక్షకు నిలవగల సామాజిక చలన సూత్రాలను ప్రపంచానికి 34 పేజీల నిడివిలో అందించిన గ్రంథం ఇది. చారిత్రక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదం, రాజకీయ అర్థశాస్త్రం. ఈ మూడింటి సమాహారమే మార్క్సిజం. ఈ మూడు సూత్రాలు విశ్వవిజ్ఞానానికి తలుపులు తెరిచే తాళం చేతులు. ఈ తాళం చేతులు ఏ దేశ ప్రజలు ఒడిసి పట్టుకుంటారో వారే ఆ సమాజంలో జరుగుతున్న మాయలు, మర్మాలు, కుట్రలు, కుతంత్రాలు, మతం పేర ప్రాంతం పేర జరిగే అణచివేతలు, సంపద కేంద్రీకరణ వంటి అనేక దైనందిన సమస్యలకు మూలాలను గుర్తించగలుగుతారు. పిడికెడుమందికి ప్రపంచ సంపద కట్టబెట్టటానికి కోటానుకోట్లమందిని అదుపులో ఉంచాలన్న ప్రయత్నంలో వచ్చిందే రాజ్యం. పొత్తిళ్లలో ఉన్న దశ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ తన ప్రయోజనాలు కాపాడుకోవటానికి అడ్డువచ్చిన అన్నింటినీ దునుమాడుకుంటూ వెళ్లింది. సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ, స్వేచ్ఛావాణిజ్యం ఈ పెట్టుబడి ప్రయోజనాలు కాపాడేం దుకు పుట్టుకొచ్చిన వ్యవస్థలు. ఆయుధాలు. వీటి మాటున పెట్టుబడి సాగిస్తున్న దాడిని గుర్తించిన రోజున ప్రజలు తమ చరిత్రను తామే రాసుకుంటారు. ప్రతి సమాజంలోనూ విప్లవానికి అనుకూలమైన పరిస్థితులు ఆ సమాజపు గర్భంలోనే దాగి ఉంటాయి. వాటిని వెలికితీసి ప్రజల ముందుంచటమే విప్లవోద్యమాల కర్తవ్యం. పెట్టుబడిదారీ దోపిడీ మర్మాన్ని, ఈ దోపిడీ నుండి విముక్తి పొందే మార్గాన్ని విప్పి చెప్పే కమ్యూనిస్టు ప్రణాళికను లక్షన్నర కాపీలు ముద్రించి ప్రజలకు అందించటం ద్వారా ప్రపంచ అరుణ గ్రంథోత్సవాన్ని జరుపుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని విముక్తి శక్తులు. తెలుగు సాహితీ చరిత్రలో ఓ పుస్తకం ఒకేసారి లక్షన్నర ప్రతులు అచ్చు కావటం ఇదే తొలిసారి. అటువంటి చరిత్రాత్మక గ్రం«థాన్ని ప్రజలకు తేలికపాటి భాషలో అందుబాటులో తెచ్చేందుకు జరుగుతున్న చారిత్రక ఉద్యమాన్ని ఆదరిస్తున్న తెలుగు పాఠకలోకానికి నమస్సుమాంజలులు. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ‘ 98717 94037 కొండూరి వీరయ్య -
ఆ పుస్తకంలో.. ఒక్క పేజీ మూడున్నర కోట్లు
వివక్ష, అణచివేత, అసమానతల మూలాలను ఆర్థికరంగంతో ముడిపెట్టి.. దోపిడీ గుట్టువిప్పినవాడు కార్ల్‌మార్క్స్. అన్ని చర్యలకూ మూలాలు ఆర్థిక అంశాలే కారణమన్న ఆయన సిద్ధాంతాలు ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. అలాంటి కార్ల్‌మార్క్స్ స్వయంగా రాసిన ‘దాస్ కాపిటల్’ రాతప్రతిలోని ఒక పేజీ ఏకంగా 5,23,000 డాలర్లు (సుమారు మూడున్నర కోట్ల రూపాయలు) పలికింది. మార్క్స్ ద్విశతాబ్ది జయంత్యుత్సవాల సందర్భంగా ఈనెల 3న చైనాలోని బీజింగ్‌లో ఈ రాతప్రతిని వేలం వేశారు. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య లండన్‌లో దాస్ కాపిటల్ కోసం మార్క్స్ తయారుచేసుకున్న 1,250 పేజీల రాత ప్రతిలోనిదే ఆ పేజీ అని చెబుతున్నారు. చైనాకు చెందిన ఫెంగ్‌లుంగ్ అనే వ్యాపారవేత్త ఈ వేలం వేశారు. ఇందులో కార్ల్‌మార్క్స్ సహచరుడు, కమ్యూనిస్టు మేనిఫెస్టో పుస్తక సహ రచయిత ఫ్రెడరిక్ ఏంగెల్స్కు సంబంధించిన రాత ప్రతిని కూడా వేలం వేయగా.. అది రూ.1.67 కోట్లు పలికింది. -
ఒక్క పేజీకి మూడున్నర కోట్లు
వివక్ష, అణచివేత, అసమానతల మూలాలను ఆర్థికరంగంతో ముడిపెట్టి దోపిడీ గుట్టువిప్పిన కారల్ మార్క్స్ ద్విశతాబ్ది జయంతుత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆయన రాసిన దాస్ కాపిటల్ రాతప్రతి ఒకే ఒక్క పేజీ 5,23, 000 డాలర్లకు వేలంలో అమ్ముడంతో వార్తల్లోకెక్కింది. ఈ నెల 3న బీజింగ్‌లో మార్క్స్ రాసిన దాస్ కాపిటల్‌లోని ఒక పేజీ రాతప్రతిని వేలం వేయగా మూడున్నర కోట్లకు పైగా ధర పలికింది. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య కాలంలో లండన్‌లో దాస్ కాపిటల్ రాయడం కోసం ఆయన తయారుచేసుకున్న 1,250 పేజీల నోట్సులోనిదే ఈ పేజీ అని భావిస్తున్నారు. చైనాకి చెందిన ఫెంగ్ లుంగ్ అనే వ్యాపారవేత్త బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ వేలం కార్యక్రమంలో 5,23,000 డాలర్లకు ఈ పేజీ అమ్ముడయ్యింది. 3 లక్షల యువాన్లతో ప్రారంభమైన ఈ వేలం ముగిసేసరికి 3.34 మిలియన్ యువాన్లు అంటే 5,23000 డాలర్లు పలికింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మానిఫెస్టో పుస్తక సహ రచయిత, మార్క్స్ సహచరుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాత ప్రతిని సైతం వేలం వేసారు. 1862 నవంబర్‌లో ఓ పత్రిక కోసం ఎంగెల్స్ దాన్ని రాసినట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. అయితే ఎంగెల్స్ రాత ప్రతి 1.67 మిలియన్ యువాన్లకు అమ్ముడపోయింది. -సాక్షి నాల్డెజ్ సెంటర్ -
మార్క్సిజంపై ఈ వక్రీకరణలు ఎందుకు?
కారల్ మార్క్సు 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీలో అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మన తెలుగు బిడ్డ సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. అత్యధిక సర్క్యులేషను కల మూడు తెలుగు పత్రికల్లో రెండు పత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రచురించాయి. దానిని బట్టి ఆ పత్రికలు ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యాసంలో ప్రతి వాక్యమూ ఒక ఆణిముత్యమని నేను కూడా గ్రహించాను. అయితే అన్ని ముత్యాలమీదా మాట్లాడతానంటే సంపాదకులు నాకంత చోటివ్వలేరు అనే ఇంగితం తెలిసినవాడిని కనుక కొన్ని ముత్యాలకే నేనిక్కడ పరిమితమవుతాను. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంటే సుమారు రెండున్నర దశాబ్దాలుగానే వక్రీకరణలు చోటు చేసుకొన్నాయా? అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకు గురి కాలేదా? పైగా వక్రీకరించినవాళ్లు కేవలం సామ్రాజ్యవాదులేనా? సంగతేమంటే మార్క్సిజం పుట్టిన క్షణం నుంచీ వక్రీకరణలకీ గురైంది. దాడులకూ గురైంది. మరో నిజమేమిటంటే దానిని శత్రువులు ఎంతగా వక్రీరించారో అంతకుమించి కమ్యూనిస్టులం అని పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించారు. కొందరు తెలిసీ మరికొందరు తెలియకా ఆ పని చేశారు.‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని (సోవియట్ యూనియన్ కూలిపోయాక) సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం ఆచరణలో రుజువయింది అని చెప్పడానికి సోవియట్ యూనియన్ బతికున్నంత కాలం దానినే కమ్యూనిస్టు నాయకులు ఉదాహరణగా చూపారు. మరి అది కూలిపోయినప్పుడు మార్క్సిజం కూడా విఫలమైందని సామాన్యులు అర్థం చేసుకోవడంలో తప్పేముంది? ఆ పరిస్థితినే శత్రువులు వాడుకొంటున్నారు. సుధాకర్జీ, మీకు రెండే మార్గాలు. ఒకటి, సోవియట్ యూనియన్‌లో ఉండింది మార్క్స్ ప్రతిపాదించిన సోషలిజమే అని మీరు డబాయిస్తే, మార్క్సిజం విఫలమైందని ఒప్పుకోక తప్పదు. లేదంటే సోవియట్ ‘‘సోషలిజం’’ మార్క్స్ ఊహించిన సోషలిజం కాదని గ్రహించాలి. సోవియట్ సోషలిజమూ శభాష్, మార్క్సూ శభాష్ అంటే కుదరదు. ఇదే చైనాకూ వర్తిస్తుంది. మిగతా ‘‘సోషలిస్టు’’ దేశాలకూ ఇదే వర్తిస్తుంది. ‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా అన్నది ప్రశ్న. ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు అగ్ర నాయకులకు ఉండనే ఉండదా? ఎవరికీ జవాబు చెప్పకపోయినా మీ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? ఆ పని చెయ్యాలంటే మార్క్సునీ ఆశ్రయించాలి. చరిత్రనీ ఆశ్రయించాలి. ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి. ‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగజియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్జీ. అంటే ఆ 80 కోట్ల మంది మావో నాయకత్వంలో మూడు దశాబ్దాలపాటు దరిద్రంలో మగ్గారనేనా? సుధాకర్జీ అంతమాట అనలేరు. ఈ వ్యాసంలోనే మావో లాంగ్ మార్చ్‌కూ మార్క్సే ప్రేరణ అన్నారు రచయిత. ఇక్కడేమో డెంగ్కీ మార్క్సిజమే ప్రేరణ అంటున్నారు. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని అధికారికంగా ప్రారంభించిన ముగ్గురు మొనగాళ్లలో డెంగ్ జియావో పింగ్ ఒకడు. సంస్కరణ అనే ముద్దు పేరుతోనే వారు దాన్ని ప్రవేశపెట్టారు. మిగతా ఇద్దరిలో ఒకరు మార్గరెట్ థాచర్. రెండోవాడు రొనాల్డ్ రీగన్. దానినే అదే ముద్దు పేరుతో ఇక్కడ ఇండియాలో పివి నరశింహారావు, మన్మోహన్ సింగ్ జంట సుమారు పుష్కరకాలం తర్వాత ప్రవేశపెట్టింది. సుధాకర రెడ్డిగారి పార్టీ ఇక్కడ ఆ సదరు జంటనూ వ్యతిరేకించింది. అంతర్జాతీయంగా థాచర్నీ రీగన్నీ సంస్కరణల పేరెత్తినవారందరినీ వ్యతిరేకించింది. చైనాలో ఆ ‘సంస్కరణ’లను తెచ్చిపెట్టిన డెంగ్ జియావో పింగ్‌ని మాత్రం సుధాకర్జీ పొగుడుతున్నారు. బహుశా ‘కమ్యూనిస్టు’ అనే పేరుతో ఏ పని చేసినా సమర్ధించాలన్న ‘‘జ్ఞానమే’’ అందులో ఉన్న తర్కం కావచ్చు. ఇక్కడ ఒక్కమాట. ఈ సంస్కరణల వల్ల చైనాలో సంపద అపారంగా పెరిగింది, నిజమే. మిలియనీర్లు, బిలియనీర్లూ తామరతంపరగా పెరిగారు. అదీ నిజమే. అయితే అదే స్థాయిలో అసమానతలూ పెరిగాయి. పని గంటలు అపారంగా పెరిగాయి. ఇంతకుముందు లేని నిరుద్యోగ సమస్య మళ్లీ వచ్చి పడింది. అడుగున పేదరికం కూడా అంతులేకుండా పెరిగింది. సామాజిక భద్రత అన్నది క్రమంగా తగ్గిపోతూ ఉంది. ‘‘సోవియట్ ప్రభుత్వం భూమిలేని పేదలకు భూములను పంచింది. బాంకులను పరిశ్రమలని జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ సుధాకర్జీ చెప్పారు. ఇంతకీ సోవియట్ ప్రభుత్వం భూముల్ని పంచిందా, లేదా రైతులతో సమష్టి క్షేత్రాలూ ప్రభుత్వ క్షేత్రాలూ నిర్మించిందా? గుర్తు తెచ్చుకోండి. రష్యాలో చైనాలో పరిశ్రమలూ వగైరాలను జాతీయం చేయడానికీ మార్క్సే ప్రేరణ, చైనాలో డెంగ్ జియావో పింగ్ ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చడానికీ మార్క్సే ప్రేరణ అంటే ఎలా సుధాకర్జీ. ఇంత నిలకడ లేని మనిషా మార్క్స్? అందుకేనేమో మార్క్సిజం పిడివాదం కాదనీ అది పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటుందనీ మార్క్స్ చెప్పాడనీ సుధాకరరెడ్డి గారు శలవిచ్చారు. అంటే దానిలో మారని మౌలిక అంశాలంటూ ఏమీ లేవా సార్. అవేమిటో ఏమైనా గుర్తున్నాయా? ఒక విద్య ఉంది. ఏమీ చెప్పకుండానే కొన్ని పదాలతో కొన్ని శబ్దాలతో ఘనమైనదేదో చెప్పినట్టు భ్రమ కల్పించే విద్య. అది కమ్యూనిస్టు నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. చూడండి. ‘‘తాను రాసిన కార్మికవర్గ సిద్ధాంతాలను అమలుపరచడానికి ఇంగ్గండులో పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో కార్మిక వర్గ పరిస్థితులను అధ్యయనం చేసి వారి సంఘాలు పెట్టడం ప్రారంభించాడు.... ప్రపంచ కార్మికవర్గానికి వర్గపోరాటాలను సునిశితం చేయాలని దిశా నిర్దేశం చేశాడు, దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారు.’’ ఈ వాక్యంలో మార్క్స్ ఏంచేశాడో కనుక్కోండి చూద్దాం. ‘‘దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ... ఒత్తిడులకు లొంగకుండా తన స్వంత బాంకును నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. అయితే తర్వాత ఏం జరిగిందో రచయితకు తెలుసా? 1998 లో వెనిజులా నాయకుడు చావెజ్ మొదటిసారి బాంకు ప్రతిపాదన చేశాడు. పైన చెప్పిన రెండు సంస్థలూ రుణాలు మంజూరు చేయడానికి అనేక షరతులు పెడుతున్నాయి. రుణం తీసుకొనే దేశం ‘సంస్కరణలు’ అమలుచేయాలి. అంటే ప్రభుత్వ సంస్థలను వరసగా సొంత ఆస్తులుగా మార్చాలి. ఇది ఒక ప్రధానమైన షరతు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి దక్షిణ అమెరికా బ్యాంకు ఒకటి పెట్టాలన్నది ఆలోచన. 2009నాటికి అర్జంటీనా బ్రెజిల్ దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకొన్నాయి. చిన్న దేశాల్లో బొలీవియా పెరాగ్వే ఉరుగ్వే కూడా ముందుకొచ్చాయి. ఆ తర్వాత ఇంకొన్ని దేశాలు ఉత్సాహం చూపాయి. కాని విచారకరమైన విషయం ఏమంటే సమావేశాలు చాలా జరిగాయి కాని ఇంతవరకూ బాంక్‌కి డిపాజిట్లు కట్టాల్సిన దేశాలు కట్టనే లేదు. ఇంతవరకూ ఆ బాంకు చేయాల్సిన అసలు పని మొదలే కాలేదు. మూలిగే నక్క మీద తాటి పండు అన్నట్టుగా పోయిన ఏడాది వెనిజులా మీద ఉరుగ్వే అనేక ఆరోపను చేసింది. పైగా బయటికి పోతానని బెదిరించింది. ఇంకో ఆణిముత్యం చూడండి: ‘ఈ నేపధ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరపు దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా? ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది? ఇంకో మాట చూడండి: ‘‘అమెరికా గ్రంధాలయాల్లో మార్క్సిస్టు గ్రంధాలను ఎంతగా నిషేధించినప్పటికీ’’ ... అంటారు సుధాకర్జీ. అమెరికాలో కమ్యూనిజాన్ని ఒక బూచిగా చూపించే మాట నిజమే కాని పుస్తకాలు నిషేధించింది ఎక్కడ? ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన జెఫ్ బేజోస్ నడిపే ఎమెజాన్ లోనే మీరు పెట్టుబడి గ్రంథాన్ని కొనుక్కోవచ్చు. సామ్రాజ్యవాదం చేసిన చేస్తున్న నేరాలనూ ఘోరాలనూ ఎండగట్టడానికి అబద్ధాలు అవసరమా? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం దొరికేటటువంటి ఒక నూతన సోషలిస్టు సమాజం ఏర్పడింది’ అన్నారు రచయిత. ఆ వ్యాసంలోనే మరో చోట... ‘సమానమైన పనికి సమానమైన వేతనం కోసం పోరాటం’ గురించి రాశారాయన. సోషలిజం అంటే ఇదేనా? సుధాకర రెడ్డి గారు మార్క్సిజం ఓనమాలు మర్చిపోయినట్టున్నారు. ఇల్లలకగానే పండగ కానట్టే సొంత ఆస్తులను జాతీయం చేయడమే సోషలిజం కాదని మార్క్స్ స్పష్టం చేశాడని సుధాకర్జీ కి తెలుసా? కార్మికవర్గ పోరాటం అంతిమ లక్ష్యం న్యాయమైన పనికి న్యాయమైన వేతనం కాదని వారు తేల్చి చెప్పాడనీ వేతన వ్యవస్థని రద్దు చేయడమే లక్ష్యం అన్నారనీ తెలుసా? అంటే ఏమిటి? ఆ వ్యవస్థలో కూలి ఇచ్చే యజమానీ ఉండడు. దాన్ని దేబిరించాల్సిన కూలీ ఉండడు. అక్కడ పని చేేసవాడే యజమాని. అధికారం పనిచేసేవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అటువంటి వ్యవస్థ సోవియట్ యూనియన్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడలేదు. దాదాపు అన్ని చోట్లా ప్రజల చేతుల్లోకి చేరాల్సిన అధికారాన్ని బ్యూరోక్రాట్లు తన్నుకుపోయారు. అలా ఎందుకు జరిగిందో, సోషలిజం పేరుతో అన్నేళ్లపాటు నడిచిన దేశాల్లో మార్క్సిస్టు మౌలిక సూత్రాలు ఎందుకు అమలుకాలేదో శోధించి తమని తాము సరిదిద్దుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకొన్నది, మార్క్స్నా, గానుగెద్దునా అన్నది ప్రశ్న. ఆర్థిక సంక్షభాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెట్టుబడిదారీ బృందాల్లో దూరం చూడగలిగిన వారంతా మార్క్సుని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ ఆయన సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టు బృందాలు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం. (మే 5న సాక్షి దినపత్రిక సంపాదకపేజీలో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి “గమ్యం గమనం మార్క్సిజమే” వ్యాసంపై స్పందన) ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ మొబైల్ : 91605 20830 మార్క్సిజంపై ఏబీకే ప్రసాద్ గారు రాసిన వ్యాపం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మార్క్స్ ఎందుకు అజేయుడు?! -
అన్వయలోపమే అసలు సమస్య
గౌతమ బుద్ధుడి నుంచి అంబేడ్కర్ దాకా, ఆ తర్వాత కూడా భారతదేశంలో 2500 సంవత్సరాలుగా కుల ఘర్షణల పరంపర కొనసాగుతూనే ఉంది. చరిత్ర పొడవునా సాగిన సంఘర్షణలను ఇక్కడి మార్క్సిస్టులు అర్థం చేసుకోలేదు. అందువల్లనే నాటి సమాజ పురోగతికి అడ్డుగా ఉన్న శక్తులను మనం ఇంకా నిర్ధారించలేదు. గౌతమ బుద్ధుడిని విప్లవకారుడిగా, అంబేడ్కర్ సమకాలీన తాత్వికవేత్తగా గుర్తించడానికి మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు సిద్ధంగా లేరు. భారతదేశ చరిత్ర క్రమం అర్థం కాకుండా, భారతదేశంలో విప్లవాలు అసాధ్యం. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిందనో, తూర్పు యూరప్‌లో సోషలిజం కనుమరుగైందనో, చైనాలో పెట్టుబడిదారీ పోకడలు తలెత్తాయనో భారతదేశంలో కమ్యూని స్టులు, విప్లవకారులు నామమాత్రమయ్యారనో మార్క్సిజానికి కాలం చెల్లిందనుకోవడం పొరపాటు. కార్ల్‌మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి ఇప్పుడు ఎటువంటి ప్రామాణికతా లేదని ప్రకటిస్తున్నదంతా మేకపోతు గాంభీర్యమనే భావించాలి. కార్ల్‌మార్క్స్ రాసిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక ’ ఆనాటికీ, ఈనాటికీ, ఏనాటికైనా పీడిత జనబాహుళ్యం చేతిలో ఏకైక శాశ్వత పరిష్కారాస్త్రం. అదొక అజేయమైన శాస్త్రీయ సిద్ధాంతం. ఇదే ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. దోపిడీ పీడనల పునాదులపై వెలసిన పారిశ్రామిక విధానం, రెక్కలు తప్ప ఆస్తులు లేని నిత్య దారిద్య్రాన్ని అనుభవిస్తోన్న కార్మికుల స్థితి గతులు, పీడనల నుంచి విముక్తి కోసం ఎన్నో కష్టాల కోర్చి, ఎంతో శ్రమించి ఆయన పరిశోధనాత్మకంగా రాసిన ‘దాస్ కాపిటల్’ ఆనాటి వరకూ ఉన్న ఆర్థిక వేత్తల దృక్పథాన్ని పూర్తిగా తారుమారు చేసింది. అంతేకాదు అప్పటి వరకూ ఉన్న పలు తప్పుడు భావజాలాలను మూలాలతో పెకిలించి వేసింది. మార్క్సిజం అంటే ఆ రెండు గ్రంథాలే కాదు కానీ మార్క్సిజం అంటే కేవలం ఈ రెండు గ్రంథాలే అన్నంతగా చేస్తున్న ప్రచారం కూడా పూర్తి సత్యం కాదు. నిజానికి ధనిక–పేద, రైతు కూలీ– భూస్వా ములు, ఉద్యోగులు–యజమానులు, పెట్టుబడిదా రుడూ– కార్మికులకూ మధ్య వ్యవస్థీకృతమైన అంత రాలూ, ఆ రెండు వర్గాల మధ్యనున్న వ్యత్యాసాన్ని సమాజం ప్రతిబింబించినంత కాలం కమ్యూనిస్టు మేనిఫెస్టోకీ, దాస్క్యాపిటల్కీ మరణం లేదు. కానీ అవి రెండు మాత్రమే మార్క్సిజం కాజాలదు. సమ సమాజ లక్ష్యంగా ప్రతిపాదించిన రాజకీయ సిద్ధాం తానికి మార్గదర్శకం వహిస్తున్న ‘కమ్యూనిస్టు ప్రణా ళిక’, అసమానతల పుట్టుక పునాదులను తవ్వి తీసే ఆర్థిక సిద్ధాంతానికి సమగ్ర రూపం ‘దాస్‌కాపిటల్’ లకు భూమిక మార్క్సిస్టు తత్వశాస్త్రం. మార్క్సిస్టు తత్వశాస్త్ర పునాదిపైన ఆధారపడి ఈ రెండు మహా గ్రంథాలు రూపుదిద్దుకున్నాయి. మనిషిని మనిషే పీడించే తత్వంనుంచి విముక్తి చేసే మహత్తర సిద్ధాం తమది. అజరామరంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేయగల ఏకైక సత్యమదే. యూరప్ అంతటా కొనసాగుతున్న పెట్టుబడి దారుల దోపిడీని కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి అదనపు విలువ సిద్ధాంతాన్ని కనిపెట్టిన మార్క్స్, కార్మికులను చైతన్య పరచడానికి, వారిని మూఢాం ధకారంలోనుంచి వెలికితే వడానికి చాలా సులభమైన తాత్విక ఆలోచనలను ముందుకు తీసుకొచ్చాడు. మొదటగా ఆయన ప్రతిపాదించిన గతితార్కిక సిద్ధాంతం. ఏ సందర్భం, ఏ సమాజం, ఎటువంటి పరిస్థితులైనా స్థిరంగా ఉండవనీ, మార్పు చెందు తూనే ఉంటాయనీ, అది అనివార్యమనీ ఆ సిద్ధాంతం చెపుతుంది. అదేవిధంగా దోపిడీ చేసేవాళ్ళు, దోపిడీకి గురయ్యేవాళ్ళు ఉన్నంత వరకూ వర్గాలుంటాయి. వారి మధ్య వైరుధ్యాలూ, సంఘర్షణలూ ఉంటాయి. ఆ సంఘర్షణలే పోరాటా లకూ, విప్లవాలకూ దారితీస్తాయి. అవి అంతకన్నా భిన్నమైన మరో నూతన సమాజానికి దారులు వేస్తాయి. ఇది ఆయన ప్రాథమిక సూత్రీకరణ. అయితే ఈ పరిస్థితుల్లో మార్పుకి దేవుడో, ఏ మహాత్ముడో దిగి రావాల్సిన అవసరమేం లేదు. ప్రజలే తమ పరిస్థితుల్లో మార్పులు తీసుకురాగలుగు తారు. అందుకే వారే చరిత్ర నిర్మాతలని కూడా మార్క్స్ ప్రకటించారు. ఎప్పుడైతే అణచివేత దోపిడీ లాంటి దుర్మార్గాల వల్ల సమాజం సంక్షోభం లోకి పోతుందో అప్పుడు అని వార్యంగా పీడనకు గురవు తోన్న శక్తులు ఆ పరిస్థితు లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాయనీ అదే పరి పక్వ దశ అనీ, ఒక దశ నుంచి మరో దశలోకి ప్రయా ణించే సమాజక్రమాన్ని చరిత్ర రుజువు చేస్తుందని కూడా మార్క్స్ ప్రకటిం చారు. అందుకే ప్రపంచ చరిత్ర అంతా వర్గపోరా టాల చరిత్రగా ఆయన అభివర్ణిస్తారు. ప్రపంచాన్ని నిద్ర లేపిన మేటి సిద్ధాంతం అంతే కాకుండా ప్రజల కష్టాలకు, ముఖ్యంగా పేద రికానికి వ్యక్తిగత ఆస్తి విధానం కూడా కారణమని, దానిని కాపాడుకోవడానికి రాజ్యం, బలం, బలగా లను సృష్టించిందని కూడా మార్క్స్ చారిత్రక ఆధా రాలతో సహా నిరూపించారు. ఈ సిద్ధాంతం అప్పటి ప్రపంచాన్ని నిద్రలేపింది. అప్పటివరకు తమ కష్టా లకు, కన్నీళ్ళకు దేవుడు, ఏవో అతీంద్రియ శక్తులు కారణమని భ్రమిస్తున్న శ్రామికులకు చైతన్యం కలి గించడం మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా కనిపించే శత్రువును మార్క్స్ తన సిద్ధాంతం గొలుసులతో కట్టి, వారి ముందు నిలబెట్టాడు. పెట్టుబడిదారీ విధా నం కానీ, మరే విధమైన దోపిడీ అయినా గానీ, పోరాటాల ద్వారా రూపుమాసిపోతుందని చెబు తూనే, సోషలిజం, కమ్యూనిజం లాంటి సమ సమాజ వ్యవస్థలు ఏర్పడుతాయని వివరించారు. మార్క్స్ ఎంతో అన్వేషణతో ప్రపంచానికి ఒక నూతన విముక్తి మార్గాన్ని ప్రతిపాదించారు. అందులో ముఖ్యమైనది సమగ్రమైన సమాజ అధ్య యనం, నిజమైన శత్రువును ప్రజల ముందు నిల బెట్టడం, ఆ తర్వాత రూపొందబోయే ప్రత్యామ్నాయ వ్యవస్థ రూపాన్ని ఆవిష్కరించడం చేయాలి. సరిగ్గా కార్ల్‌మార్క్స్ అదే చేశాడు. అయితే ఇది అన్ని దేశా లకూ, ప్రాంతాలకూ, కాలాలకూ ఒకేరకంగా ఉండ దనీ, దేశ, కాల పరిస్థితులకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని మార్క్స్ పేర్కొన్నారు. నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట అన్వయం మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించు కోవడం వల్లనే మొట్టమొదట రష్యాలో, ఆ తర్వాత చైనాలో విప్లవాలు సాధ్యమయ్యాయి. మౌలికమైన మార్క్సిస్టు సూత్రాలను రష్యాలో లెనిన్ తన కార్యా చరణకు అన్వయించుకు న్నారు. జార్ చక్రవర్తి దుర్మా ర్గాలను ప్రజల్లో ఎండగట్టి, విముక్తి మార్గాన్ని ప్రజల ముందుంచారు. ఎంతో చైత న్యాన్ని అందించి, ప్రజ లను ఐక్యం చేసి జార్ ప్రభుత్వాన్ని కూలదోసారు. అలాగే చైనాలో భూస్వామ్య వ్యవస్థ, యుద్ధ ప్రభువులు, జపాన్ లాంటి దురాక్రమణ దారులు ప్రజలకు నిజమైన శత్రువులని, ఆ దేశ విప్లవ నేత మావో తేల్చి చెప్పారు. ఆ ప్రాతిపదికపై ప్రజలను ఐక్యం చేసి దీర్ఘకాలిక సాయుధపోరాటంతో విజయం సాధించారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన కాలంలోనే భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ అవతరణ జరిగింది. అయితే కమ్యూనిస్టు పార్టీ ఈ దేశాన్ని, దేశ ప్రజలను, పీడన, దోపిడీ నుంచి విముక్తి చేయలేక పోయింది. పైగా ఎన్నో చీలికలు జరిగి బలహీన పడింది. అయితే కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీ సాగించిన పోరాటాలు ప్రజలకు తాత్కాలి కంగా, పాక్షికంగా దోపిడీ పీడనల నుంచి విముక్తి కలి గించాయి. కార్ల్‌మార్క్స్ సూచించిన విధంగా నిర్దిష్ట కాలమాన పరిస్థితుల్లో దోపిడీదారులెవరో ప్రత్య క్షంగా నిలబెట్టడం ద్వారా తెలంగాణ సాయుధ పోరాటం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కులాధి పత్య భూస్వామ్య వ్యతిరేక పోరాటాలూ కొన్ని తక్షణ ఫలితాలను ప్రజలకు అందించాయి. భారతదేశంలో వేల ఏళ్ళుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ కేవలం సాంస్కృతికపరమైన, సాంప్ర దాయాలకు సంబంధించిన అంశం కాదు. కులం ఈ దేశంలోని ప్రజలకు ఇనుప కంచె లాంటి ప్రధానమైన అవరోధం. అన్ని సంక్షోభాలకూ ఇక్కడ కులం పునా దిగా ఉంటుంది. ఇటువంటి దేశంలో ఒక ప్రత్యేక మైన అధ్యయనం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితులకు ఏ వర్గాలూ, ఏ విధానాలూ, ఏ వ్యవస్థలూ కారణ మవుతున్నాయో ఆలోచించాలి. కార్ల్‌మార్క్స్ ప్రతిపా దించిన చారిత్రక క్రమాన్ని మన దేశ చరిత్ర నుంచి అర్థం చేసుకోవాలి. అంతేకానీ, యూరప్‌ను ఒక నమూనాగా, చైనాను మరొక మార్గంగా చూడడం సరిౖయెంది కాదనేది వాస్తవం. బౌద్ధం తొలి సామాజిక విప్లవం 2500 సంవత్సరాల కిందట ఏర్పడిన కుల వ్యవస్థ ఇప్పటికీ భారతదేశాన్ని అనేక రూపాల్లో పీడిస్తున్నది. అయితే పీడనకు, అణచివేతకు గురవు తున్న కులాలు, వర్గాలు నిరంతరం ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. సిద్ధార్థ గౌతమ బుద్ధుని నాయకత్వం విజయవంతమై మొట్టమొదట సామాజిక విప్లవం దేశంలో ఎన్నో మార్పులకు, నూతన ఆవిష్కర ణకు పునాది అయింది. కానీ మళ్ళీ విప్లవ ప్రతీఘాత శక్తులు కులాధిపత్యాన్ని స్థాపించ డానికి ఎంతో నరమే«థానికి పాల్పడ్డాయి. గౌతమ బుద్ధుడి నుంచి అంబేడ్కర్ దాకా, ఆ తర్వాత కూడా ఆ ఘర్షణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ చారిత్రక క్రమాన్ని, చరిత్ర పొడవునా సాగిన సంఘర్ష ణలను ఇక్కడి మార్క్సిస్టులు అర్థం చేసుకోలేదు. కాబట్టే నాటి సమాజ పురోగతికి అడ్డుగా ఉన్న శక్తు లను మనం ఇంకా నిర్ధారించలేదు. గౌతమ బుద్ధు డిని విప్లవకారుడిగా, అంబేడ్కర్ సమకాలీన తాత్విక వేత్తగా గుర్తించడానికి మార్క్సిజాన్ని అనుసరిస్తున్నా మని చెప్పుకుంటున్న వాళ్ళు సిద్ధంగా లేరు. భారత దేశ చరిత్ర క్రమం అర్థం కాకుండా, దేశంలో విప్ల వాలు అసాధ్యం. అలాగే యూరప్ దేశాలకూ భారత సామాజిక పరిస్థితులకూ ఉన్న మౌలిక వ్యత్యాసా లను సైతం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే నేటి భార తీయ సమాజంలోని ప్రజలను విప్లవోద్యమం వైపు మళ్ళించడం సాధ్యం అవుతుంది. చైనా విప్లవం సమయంలో మావో సేటుంగ్ చెప్పిన విషయం ప్రస్తావించుకోవాలి. ‘‘మనం మార్క్సిస్టు–లెనినిస్టు వైఖరిని, దృక్పథాన్ని, పద్ధ తుల్ని అధ్యయనం చేసి చైనా చరిత్రకూ, ఆ దేశ ఆర్థిక, రాజకీయ, సైనిక, సాంస్కృతిక విషయాలకూ అన్వయించాలి’’ ఇది భారత్‌కి కూడా వర్తిస్తుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 97055 66213 -
మార్క్స్ ఎందుకు అజేయుడు?!
1960లలో ప్రపంచ రాజకీయ రంగంలో పేరెన్నికగన్న ఆదర్శమూర్తులలో మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, క్యాస్ట్రో, హెర్బర్ట్ మార్క్యూజ్, అంజెలా డేవిస్, మాల్కోమ్– ఎక్స్, ఆల్బర్ట్ కామూల జీవితాలను, వారి విధానాలను ప్రభావితం చేసిన వ్యక్తి మార్క్స్. కనుకనే విశ్వ విఖ్యాతి పొందిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ‘బీబీసీ’ ప్రపంచ ప్రముఖులలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారో తెల్పమని 20 మంది ప్రపంచ ప్రసిద్ధుల జాబితాను పరీక్షకు విడుదల చేసింది. అయిదారుసార్లకు పైగానే జరిగిన ఆ పోటీలో అన్నిసార్లూ కార్ల్‌మార్క్స్‌నే ప్రపంచ ప్రేక్షకులు ఎంచుకోవటం ఒక విశేషం. ‘‘తత్వవేత్తలు ఇంత వరకూ పలురకాలుగా ఈ ప్రపంచానికి భాష్యం చెబుతూ వచ్చారు. కానీ ఇకనుంచి జరగవలసిన అసలు కార్యం– ప్రపంచాన్ని మార్చడం. ఈ పెను మార్పుకు వ్యక్తి సంసిద్ధత, చిత్తశుద్ధి అవసరం. అప్పుడే సామాజిక పరిస్థితుల్ని అవి గతం నుంచి సంక్ర మించినా, వర్తమాన సమస్యలయినా వాటిని మార్చ డానికి ఈ మానసిక సంసిద్ధత, చైతన్యం అవసరం’’. – శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలు కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ Sఏంగెల్స్ ‘‘బూర్జువా (ధనిక) వర్గాన్ని, మేధావి వర్గాన్ని కాదని మొద్దులు, మొరటులూ అయిన శ్రామికవర్గాన్ని ప్రేమించే సిద్ధాంతాన్ని నేనెలా అనుసరిస్తాను? రొయ్యికి బదులు రొంపి (బురద)ను ఎంచుకునే ఆ సిద్ధాంతాన్ని నేనెలా ఆదరిస్తాను? బూర్జువా వర్గం లేదా వారిని అనుసరించే మేధావులలో లోటు పాట్లున్నా వారే ప్రామాణిక జీవనానికి ప్రతినిధులు, వారే మానవాళి సాధించిన విజయ బీజాలను ముందుకు తీసుకువెళ్లగలవారూ’’. – హీల్బ్రోనర్తో ప్రసిద్ధ ఆర్థికవేత్త మేయార్డ్ కీన్స్ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్త, ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త, తన ‘పెట్టుబడి’ (కాపిటల్) గ్రంథం ద్వారా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు గత 150 సంవత్సరాలుగా నిద్రాహారాలు లేకుండా చేస్తూ వచ్చిన కార్ల్‌మార్క్స్ జనించి 200 ఏళ్లు పూర్తయింది. ఆ సందర్భంగా ప్రపంచ వ్యాపితంగానే ఈ ఏడాది పొడవునా ద్విశతజయంతి ఉత్సవాలు జరుగుతు న్నాయి. ఈ సందర్భంగా మార్క్స్ మానవాళికి సంబంధించిన సర్వశాఖలను– సాహిత్య, సాంస్కృ తిక, తాత్విక, ఆర్థిక, పర్యావరణ, దాంపత్య, శాస్త్ర, కళాదిరంగాలను పరామర్శించిన తీరుతెన్నులు, ఆ పరిశీలనలో ఆయన మానవజాతి పురోగతి కోసం ప్రతిపాదించిన పెక్కు ప్రయోజనకర సూత్రీకరణ లను, అవి ఎలా ప్రపంచ ప్రజల భావధారను ప్రభా వితం చేస్తూ వచ్చాయో తల స్పర్శగా పరిశీలించా ల్సిన సమయం ఇది. శాస్త్రీయ సోషలిజానికి శత్రు వర్గాల నుంచి వచ్చిన ప్రతిఘటనను, దానిని తిప్పి కొట్టి, ప్రపంచంలో పలుచోట్ల కార్మికవర్గ ప్రభు త్వాలు లేదా సోషలిస్టు ప్రభుత్వాలు తొలి సోషలిస్టు రాజ్యం నుంచి నేటి ఆసియా, లాటిన్ అమెరికా ఖండాలలోని దేశాలకు పరివ్యాప్తమై వచ్చిందో స్థూలంగా ప్రస్తావించుకోక తప్పదు. ఈ ప్రయా ణంలో కొన్ని సోషలిస్టు ప్రభుత్వాలు ప్రపంచ సామ్రాజ్యవాద కుట్రలకు బలికాగా (తొలి సోవి యట్ సోషలిస్టు రిపబ్లిక్ సహా) మరికొన్ని ఆ కుట్ర లను ఎదుర్కొంటూనే బలంగా నిలదొక్కుకున్న దేశాలూ ఉన్నాయి. క్యూబా సోషలిస్టు రాజ్యనేత స్వర్గీయ ఫిడెల్ క్యాస్ట్రో తన చివరి రోజుల్లో చెప్పిన అంశం– నేటి, రేపటి ప్రగతిశీల రాజకీయ శక్తులకు, శ్రామికవర్గ పార్టీలకు, నాయకులకూ ఒక గుణపాఠం కావాలి: ‘‘సోషలిజం అంటే ప్రజలందరినీ సంపన్నులను, లక్షాధికారులను, కోటీశ్వరులుగా మార్చడం కాదు. ముందు అలాంటి ఆలోచనా ధోరణినీ, ఆశనూ కార్య కర్తలు, నాయకులు పటాపంచలు చేయాలి. సోష లిజం అంటే ప్రజలకు కనీస అవసరాలను, సౌక ర్యాలను, సామాజిక భద్రతను, సమతా న్యాయాన్ని, చట్టంముందు అందరూ సమానులేనన్న భావనను, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రజలమధ్య సఖ్యతా సంబంధాల్ని, శాంతిని కాపాడటమేనని అందరూ గుర్తించాలని’’ అన్నాడు. శాస్త్రీయ సోషలిజానికి తొలి విజయం 1818లో పుట్టిన మార్క్స్ తొలి 49 ఏళ్ల నాటికి ఆయన పెట్టుబడి (కాపిటల్) గ్రంథం తొలి సంపుటం (1867) వెలువడింది. ఆ తర్వాత 50 ఏళ్లకు మార్క్స్ సిద్ధాంతం ప్రభావ ఫలితంగా అక్టోబర్ 25లో రష్యన్ విప్లవం (అదే నవంబర్ విప్లవం) విరుచుకుపడింది. అంటే మార్క్స్ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతానికి 50 ఏళ్లకుగానీ తొలి విజయం ఆవిష్కరించుకోలేదు. అది మొదలు శాస్త్రీయ సోషలిజం అనేక అడ్డంకుల మధ్యనే, అప్పటికి విస్తరించి ఉన్న ప్రపంచ సామ్రా జ్యవాద శక్తులు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొల్పిన సంరక్షణ అగడ్తలను క్రమంగా అధిగ మిస్తూ ముందుకు సాగింది. సామ్రాజ్యవాద–పెట్టు బడి వ్యవస్థలు సోషలిజం క్రియాశీల ప్రజా ప్రయో జనాలపై సాగించిన అబద్ధపు ప్రచారాలు, సోవి యట్, చైనా, వియత్నాం సోషలిస్టు వ్యవస్థలన్నింటి వినాశానికి కారణం. మార్క్స్‌కు ముందు పెట్టుబడిదారీ తరహా ‘అభి వృద్ధి’ నమూనా వ్యవస్థ తొలుత ఇంగ్లండ్‌లో తలెత్తిన పీడనా పద్ధతులకు పునాది పడింది. కాగా మార్క్స్ ‘కాపిటల్’ గ్రంథం వెలువడిన నాలుగేళ్లకే (1871) పారిస్ (ఫ్రెంచి) కార్మికవర్గం ప్రపంచంలో తొలి శ్రామికవర్గ విప్లవానికి విత్తనాలు నాటారని మర చిపోరాదు. అయితే ఆ తొలి శ్రామికవర్గ విప్లవాన్ని, పారిస్ కమ్యూన్నూ దారుణంగా పాలకవర్గాలు అణ చివేశాయి. అయితే ఇందువల్ల వచ్చిన భావి పరి ణామం విప్లవ రాజకీయ ధర్మాలు, శ్రామిక– కార్మిక వర్గాలలో నిక్షిప్తమైయున్న శక్తియుక్తులు ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఒకవైపున యూరప్‌లోని ఒక భాగం (ఇంగ్లండ్)లో తొలి శ్రామికవర్గ తిరుగుబాట్లను తొలి పెట్టుబడి వర్గాలు అణచివేస్తున్న సమయంలోనే మరోవైపున ఒక అర్ధ శతాబ్దంలోనే– మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వంలో రష్యన్ నగర పారిశ్రామిక కార్మిక వర్గం ప్రభుత్వాధికారాన్ని స్వాధీనం చేసుకుని తొలి అక్టోబర్ మహా విప్లవాన్ని జయప్రదం చేశారు. ఈ పరిణామం సంభవించిన కాలాన్ని, సమ యాన్ని అధ్యయనం చేసిన మార్క్స్ జీవితకాల సహ చరుడు ఏంగెల్స్ వ్యాఖ్యానిస్తూ ‘‘అనేకచోట్ల దోపి డీకి గురవుతున్న సమకాలీన శ్రామికవర్గాలున్న పెట్టు బడి సమాజాల్లో శ్రామికవర్గంలో విప్లవ చైతన్యం కొడిగట్టుకుపోతున్న దశలో ఇతర చోట్ల దాదాపు అవే దోపిడీ వ్యవస్థలున్నచోట శ్రామిక విప్లవాలు ఎలా జయప్రదమవుతున్నాయని ప్రశ్నించాడు, కారణాలు ఆలోచించమని కోరాడు. ఆ ప్రశ్నకు ఆయనే కరా ఖండీగా తిరుగులేని సమాధానమిచ్చాడు: ‘‘ప్రపంచ వ్యాపితంగా వలస దేశాలను ఇంగ్లండ్ దోచుకుతిం టున్నందున, ఆ సామ్రాజ్య దోపిడీపై ఆధారపడిన ఇంగ్లండ్ కార్మికవర్గం కూడా నానాట సంపన్న వర్గంగా మారుతోంది’’ అన్నాడు ఏంగెల్స్. వలస దేశాలపై దోపిడీయే సామ్రాజ్యవాదం సమానత్వం, సహోదరత్వం, పరస్పరం దోపిడీ అవ కాశంలేని వ్యవస్థా నిర్మాణం ద్వారానే సమాజాల శాంతి సౌమనస్యాలకు శాశ్వత భద్రత ఉంటుందని మార్క్స్ ప్రవచించాడని మరచిపోరాదు. కనుకనే అనంతర కాలంలో సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ నిర్మాత లెనిన్ 1917 రష్యన్ మహా విప్లవం నాటికే వలస దేశాల సంపదను కొల్లగొట్టడం ద్వారా సామ్రా జ్యవాద దేశాలు అపారమైన రాక్షస లాభాలకు పడగ లెత్తిన వైనాన్ని అక్షర సత్యంగా నిరూపించాడు. ప్రపంచ సామ్రాజ్యవాద ప్రభుత్వాల దురాక్ర మణ విధానాలు, యుద్ధ విధానాల ఫలితంగా అమె రికా సైనిక–పారిశ్రామిక యుద్ధతంత్ర వ్యవస్థపై ఆధారపడిన అమెరికా–బ్రిటన్ల ఆర్థిక వ్యవస్థలు ఎన్ని సంక్షోభ దశల్ని గత 190 సంవత్సరాలలో ఆవిష్కరించాయో చూడండి: ప్రపంచ ఆర్థిక వేత్తలలో అగ్రగణ్యుడైన సమీర్ అమీన్ అంచనా ప్రకారం అగ్ర దేశాల సామ్రాజ్య విస్తరణ సాగిన గత 200 ఏళ్లలో నాలుగు దశలలో జరిగిన సంక్షోభాలను ఇలా చూపారు: నాలుగు దశలలో ఒక్కొక్క దశకూ మధ్య ఎన్నేసి సంవత్సరాల వ్యవధి ఉందో చూడండి: 1815–1840 (25 సం‘‘లు), 1850–1870 (20 సం‘‘లు), 1890–1914 (24 సం‘‘లు), 1948– 1967 (19 సం‘‘లు). ఈ దశలు సగటున 19–20 సంవత్సరాల దాకా విస్తరించాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు ఎలా కారణ మవుతుందో ఈ సంక్షోభ దశలు నిరూపించాయి: మార్క్స్ అంటే ఎందుకింత క్రేజ్! 1960లలో ప్రపంచ రాజకీయ రంగంలో పేరె న్నికగన్న ఆదర్శమూర్తులలో మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, క్యాస్ట్రో, హెర్బర్ట్ మార్క్యూజ్, అంజెలా డేవిస్, మాల్కోమ్–ఎక్స్, ఆల్బర్ట్ కామూల జీవితా లను, వారి విధానాలను ప్రభావితం చేసిన వ్యక్తి మార్క్స్. కనుకనే విశ్వ విఖ్యాతి పొందిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ‘బీబీసీ’ ప్రపంచ ప్రము ఖులలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారో తెల్పమని 20 మంది ప్రపంచ ప్రసిద్ధుల జాబితాను పరీక్షకు విడుదల చేసింది. అయిదారుసార్లకు పైగానే జరిగిన ఆ పోటీలో అన్నిసార్లూ కార్ల్‌మార్క్స్‌నే ప్రపంచ ప్రేక్షకులు ఎంచుకోవటం ఒక విశేషం. మార్క్స్ అంటే ఎందుకింత ‘క్రేజ్’ అంటే, అమెరికా లోని ‘న్యూలైఫ్’ ఉద్యమ ప్రసిద్ధుల్లో ఒకరైన ఎలీ జారెట్వీ్క చెప్పిన మాటల్ని విందాం: ‘‘ప్రపంచంలో వామపక్షవాదుల చరిత్రకు కార్ల్ మార్క్స్ ఎంతో దోహదం చేశారు, అది చెరపరానిది. ప్రపంచ చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్ర అని చాటినవాడు మార్క్స్. అంటే దానర్థం– దోపిడీ వ్యవ స్థలనుంచి విమోచన అనేది నిరంతరం సాగే పోరా టమన్న భావదీప్తిని ఆయన మనకు కలిగించాడు. ఈ భావనకు లోతైన సుదీర్ఘ చరిత్ర ఉంది, భవిష్యత్తును దర్శించే జ్ఞానదీప్తి ఉన్న భావన. పెట్టుబడిదారీ వ్యవ స్థను విస్పష్టంగా దర్శించగల దుర్భిణిని చేతికందిం చిన ఏకైక సిద్ధాంతకర్త మార్క్స్. ఈ పెట్టుబడి వ్యవస్థ పెట్టుబడికి–శ్రమశక్తికి మధ్య గండి కొట్టి కులుకు తున్న వ్యవస్థ, మానవుల మధ్య అంతరాలను పెంచే సిన సాంఘిక వ్యవస్థ. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ మానవాళి మహా ప్రస్థానంలో ఆఖరి మజిలీ అను కోరాదు. నిరంతర సంక్షోభాలకు నిలయం పెట్టుబడి దారీ వ్యవస్థ’’ అన్నాడు మార్క్స్. నిరంతర సామా జిక విప్లవంతోనే దాని కథకు ముగింపు అన్నాడు మార్క్స్ (2012). నేడు భారత ప్రజలు చేరుకున్న, అనుభవిస్తున్న దశ సరిగ్గా ఇదే సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి ఆయన!
విజయవాడ: మార్పు మార్పు అంటూ కేవలం వాఖ్యలు చేయడమే కాకుండా మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి కారల్ మార్క్స్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఏళ్లు గడిచే కొద్ది మార్క్స్ సిద్ధాంతాలపై ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ..ఇటీవల మార్క్సిజంపై యువత ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించడానికి మార్క్స్ కృషి చేశారన్నారు. అందుకే మార్క్స్‌ని ప్రపంచం గుర్తుపెట్టుకుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరగడంతో యువతలో ఆగ్రహం పెరిగిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేందుకు మార్క్సిజంలో దారులు వెతుకుతున్నారని అభిప్రాయపడ్డారు. మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థలో వైవిధ్యం వచ్చిందని, ఇదే కొనసాగితే సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సోషలిజం వల్లే రాజ్యం అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. భారతదేశం సూపర్ పవర్ కావాలంటే కుల వ్యవస్థ పోవాలని రాఘవులు పేర్కొన్నారు. వామపక్షాలకు మంచి రోజులొస్తాయి: మధు మన రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాల పరిస్థితి ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని అందరూ అంటున్నారు. రానున్న రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను యువత వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లు లేవన్న చోటే వామపక్షాల ఉద్యమాలు బలపడుతున్నాయని మధు పేర్కొన్నారు. -
బహుజన హితం కోసమే బుద్ధిజం, మార్క్సిజం, అంబేడ్కరిజం
సాక్షి, హైదరాబాద్: సమాజహితం కోసమే బుద్ధిజం, మార్క్సిజం, అంబేడ్కరిజం పుట్టుకొచ్చాయని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి ప్రొఫెసర్ గేబ్రియల్ డిట్రిచ్ అన్నారు. 3 సిద్ధాంతాల సారాంశం బహుజన హితమేనని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కారల్‌మార్క్స్ 200వ జయంతి కార్యక్రమంలో ‘సమకాలీన భారతీయ సమాజంలో కారల్‌మార్క్స్ ప్రాధాన్యత’ అంశంపై డిట్రిచ్ కీలకోపన్యాసం చేశారు. పారిశ్రామిక విప్లవం అనంతరం జర్మనీలో కార్మిక ఉద్యమాలకు నాందిగా దాస్ క్యాపిటల్, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో సిద్ధాంతాలను మార్క్స్ ప్రతిపాదించారని అన్నారు. భారత పరిస్థితులకు అన్వయించడానికి అంబేడ్కర్ సిద్ధాంతాన్ని గ్రహించాలని, కుల సంఘర్షణను ప్రధానంగా తీసుకొని, మతపరమైన వివక్షను బుద్ధిజం ద్వారా పోగొట్టాలని అంబేడ్కర్ భావించారని అన్నారు. ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ మార్క్స్, ఎంగిల్స్ కమ్యూనిజానికి బీజాలు వేసిన ప్రాన్స్, జర్మనీ, బ్రిటన్, బ్రెజిల్ కార్మికులతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారితో కలిసి జీవించి, సన్నిహితంగా మెలిగి తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారన్నారు. నేటికీ నూరుశాతం మార్క్సిజాన్ని అర్థం చేసుకొన్నవారు లేరన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధిజం, మార్క్సిజం, అంబేడ్కరిజంలు గతిశీలమైనవన్నారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, నవ తెలంగాణ పత్రిక సంపాదకుడు వీరయ్య, దళిత్ స్టడీస్ డైరెక్టర్ సత్యనారాయణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు పాల్గొన్నారు. -
నాడూ నేడూ రేపూ మార్క్సిజం అజేయమే
అమెరికాలో పొడసూపుతున్న తాజా ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల్లోని ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్ ఆర్థికవ్యవస్థను పునరావిష్కరించేలా పురిగొల్పింది. పైగా, మార్క్సిజం నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కింద నేపాల్ నూతన రిపబ్లిక్‌గా పరిణమించింది. మార్క్సిజం మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్ఫూర్తిదాయకంగా అన్యాయాలు, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు మార్క్సిజం నేటికీ ప్రాసంగికమే అనే అంశాన్ని తిరుగులేనివిధంగా రుజువు చేస్తున్నాయి. కార్ల్‌మార్క్స్ జన్మించిన 200 సంవత్సరాల తర్వాత కూడా మార్క్సిజం ప్రాసంగికత గురించి మనం నేటికీ చర్చిస్తున్నామంటేనే ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సిద్ధాంతంగా మార్క్సిజం ప్రాసంగికత తిరుగులేని విధంగా రుజువవుతోందని మనం చెప్పవచ్చు. మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రాతిపదికన ఏర్పడిన తొలి సోషలిస్టు దేశం సోవియట్ యూనియన్ ప్రపంచ పటం నుంచి మాయం కావడం, పోలెండ్, తూర్పుజర్మనీ వంటి తూర్పు యూరప్‌కి చెందిన సోషలిస్టు దేశాలు విచ్ఛిన్నమైపోవడం వంటి పరిణామాలతో కమ్యూనిజం వ్యతిరేకులు మార్క్సిజాన్ని కించపర్చడమే కాదు.. దాని ప్రాసంగికతనే తోసిపుచ్చేంతవరకు వెళ్లారు. వియత్నాం, క్యూబా వంటి దేశాలు ఇంకా సోషలిస్టు దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ మార్క్సిజంపై దుష్ప్రచారం కొనసాగించారు. ఈ దేశాలు కూడా వ్యక్తిగత ఆస్తి విషయంలో కాస్త సడలింపు నిచ్చి, సొంత ఆస్తిని అట్టిపెట్టుకోవడాన్ని కొంతమేరకు అనుమతించడమే కాకుండా అక్కడ చేపట్టిన కొన్ని సంస్కరణలు కూడా అవి ఇక ఏమాత్రం స్వచ్చమైన సోషలిస్టు దేశాలు కావనే అభిప్రాయం కలిగించి మార్క్సిజాన్ని, దాని ప్రాసంగితను తృణీకరించడానికి కారణమయ్యాయి. ప్రపంచంలోని పలు దేశాల కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు అంగీకరించకపోయినప్పటికీ, ప్రస్తుత చైనాను కూడా సోషలిస్టు దేశంగానే చాలామంది భావిస్తున్నారు. అదేసమయంలో సోషలిస్ట్ శిబిరమే ఉనికిలో లేదని, మార్క్సిజం ఒక సిద్ధాంతంగా కాలం చెల్లిపోయిందని చెబుతుండటం సరైంది కాదు. మరోవైపున మార్క్సిజం, సోషలిజంలకు ప్రాసంగికతే లేదని, అవి గతించిన చరిత్రలో భాగమైపోయాయని మార్క్సిజం విమర్శకులు ప్రచారం సాగిస్తున్నారు. దీనికి భిన్నంగా మార్క్సిస్ట్ గతితార్కిక పంథాలో చారిత్రక భౌతిక అభివృద్ధి క్రమం సరైందేనని సోషలిస్టు దేశాలు ఆవిర్భవించినప్పటినుంచి రుజువు చేస్తూ వచ్చాయి. పైగా నెలలు నిండకముందే బిడ్డ పుట్టినట్లుగా సోషలిజానికి కావలసిన ముందస్తు షరతులు ఉనికిలోకి రాకముందే ఏర్పడిన సోషలిస్టు దేశాల అభివృద్ధి మొత్తంమీద ఉత్తమంగానే కొనసాగిందని అంచనా వేయవచ్చు. కమ్యూనిస్టు విప్లవాన్ని సమాజం సంపూర్ణ అభివృద్ధి సాధించిన అనంతరం ఉనికిలోకి వచ్చే అంశంగా మార్క్స్ ప్రతిపాదించారు. కానీ తమ దేశాల్లో భూస్వామ్య సమాజాన్ని ఇంకా కూలదోయక ముందే సోషలిస్టు దేశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ పరిమితుల్లో కూడా ఈ దేశాలు మానవులకు ఉత్తమమైన భౌతిక జీవన సంస్కృతిని ప్రపంచం ముందు ప్రదర్శించి చూపాయి. ప్రత్యేకించి సోషలిస్టు దేశాల కూటమి వల్లే ప్రపంచం ఫాసిజం, నాజీయిజం బారి నుంచి తప్పించుకుంది. అమెరికాలో పొడసూపుతున్న తాజా ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల్లోని ఆర్థికవేత్తలు మార్క్సిస్ట్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ కనుగొనేలా పురిగొల్పింది. పైగా, మార్క్సిజం నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కింద నేపాల్ నూతన రిపబ్లిక్‌గా పరిణమించింది. మార్క్సిజం మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్ఫూర్తిదాయకంగా అన్యాయాలు, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఘటనలు మార్క్సిజం నేటికీ ప్రాసంగికమే అనే అంశాన్ని తిరుగులేనివిధంగా రుజువు చేస్తున్నాయి. మన దేశం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి పలు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో వెనకపట్టు పట్టినా, త్రిపురలో తాజాగా కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతర్జాతీయ కమ్యూనిస్టు నేతలైన లెనిన్ వంటి వారి విగ్రహాలను కూలదోసి పైశాచికానందం పొందినా దేశాభివృద్ధి దిశగా జరుగుతున్న ఏ ప్రగతిశీల కార్యాచరణ లేక చర్చలోనైనా సరే మార్క్సిజం తనదైన ప్రభావం కలిగిస్తూనే ఉంది. మార్క్సిజం ఇప్పటికీ అవసరమేనన్నది నిజం.దేశంలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులకు చెందిన భౌతిక వాస్తవికతను లోతుగా అధ్యయనం చేయడంలో మార్క్సిజం నేటికీ ప్రాధాన్యతను సంతరించుకోవడం విశేషం. మార్క్సిజం ఇప్పటికీ భారత్‌లో మూలాల్లో బలపడకపోవడానికి దేశ వస్తుగత, భౌతిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితిని అంచనా వేయలేక పోవడమే కారణమని చెప్పవచ్చు. ఈ శతాబ్ది తొలి రెండు దశాబ్దాల్లో మార్క్సిస్ట్ నాయకుల పరిమితులను మనం అర్థం చేసుకోవచ్చు కానీ అదే సమయంలో మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చెందించడంలో వారి అమూల్యమైన దోహదాన్ని తప్పక పరిగణించాల్సి ఉంటుంది. దేశరాజకీయాల్లో మొదటినుంచి బలమైన ప్రభావం వేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ వంటి నేతలు సైతం యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజంచే ప్రభావితులయ్యారు. హింసతో పని లేకుండా శాంతి యుతంగా కమ్యూనిజాన్ని సాధించగలిగితే దాన్ని రెండు చేతులతోనూ ఆహ్వానిస్తానని గాంధీ సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.మార్క్సిజాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలకమైన అంశం కార్మికవర్గ ఐక్యత. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ మార్క్స్ ఇచ్చిన నినాదం కూడా కార్మిక వర్గం బలానికి ఆధారం ఐక్యతే అని తేల్చి చెబుతోంది. ఈ ఐక్యత సాధించనిదే కమ్యూనిస్టు విప్లవాన్ని గెలుచుకోలేం. చివరగా కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ చేసిన వ్యాఖ్యను మనం తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అభివృద్ధి చెందిన పశ్చిమ యూరప్‌ను దృష్టిలో పెట్టుకుని మార్క్స్, ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించారు. నిర్దిష్ట సమాజ భౌతిక వాస్తవికతను బట్టి కమ్యూనిస్టులు తమ ఆచరణలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశ సామాజిక నిర్మాణం ఇప్పటికీ కుల వ్యవస్థ రూపంలో ఘనీభవించిన సామాజిక సంబంధాలతో కూడి ఉంది. భాష, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి, సాంప్రదాయాలు, సంస్కృతుల వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న జాతుల కలయికే భారతదేశం. భారత కమ్యూనిస్టు గ్రూపులతో కలిసి పోరాడుతున్న ప్రజానీకంలోని అనైక్యత కారణంగా సహజంగానే మార్క్సిజం ప్రాసంగికమైనది కాదని ఎవరికైనా అనిపించవచ్చు. అందుకే ఐక్య కమ్యూనిస్టు ఉద్యమం భారత విప్లవాన్ని ఐక్యపర్చడమే కాకుండా, భారత జాతీయ లక్షణాలకు చెందిన వాస్తవికతను కూడా పరిగణిస్తుందని ఆశిస్తున్నాను. మన దేశంలో మార్క్సిజానికి ప్రాసంగికత ఉంటుందని రుజువు చేయడంలో భారతీయ కమ్యూనిస్టులు విజయం పొందుతారని భావిస్తున్నాను. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇదే సరైన సమాధానంగా ఉంటుంది. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
‘రఘురామ కృష్ణంరాజు నాలుక చీరేస్తాం’
సాక్షి, విజయవాడ: కారల్ మార్క్స్ 200వ జయంతి సందర్భంగా వామపక్ష నేతలు విజయవాడలో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కారల్ మార్క్స్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం కార్యదర్శి మధు మండిపడ్డారు. ప్రతి రోజు రాష్ట్రంలో మహిళలపై ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా పరిస్థితులు మారడం లేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంత మంది శిక్షల నుంచి తప్పించుకుంటున్నారని మధు టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. వామపక్ష పార్టీలతో కలసి అత్యాచారాలకు వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. లాలూచీ రాయకీయాలు చేస్తే సహించం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 8న అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. నరేంద్రమోదీ ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరగడంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో టీడీపీకి అంతే ఉందని రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామకృష్ణంరాజు లాలూచీ రాయకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులతో చంద్రబాబు నాయుడిని పోల్చినందుకు రఘురామకృష్ణంరాజు నాలుక చీరేస్తామని హెచ్చరించారు. స్వాతంత్ర్య సమరయోధుల కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోరనీ.. ఇలా అవాకులు చెవాకులు పేలుతూ స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తే ఊరుకునేది లేదని రామకృష్ణ అన్నారు. -
గమ్యం గమనం మార్క్సిజమే..!
సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో మార్క్సిజానికి కాలం చెల్లిందని పెట్టుబడిదారీ సమర్థకులు బృందగానాలు చేశారు. కేపిటలిజం ఆవిర్భవించి శతాబ్దాలవుతున్నా నిరుద్యోగ సమస్య, ఆకలి, దారిద్య్రం, ఆర్థిక సంక్షోభాల వంటి సమస్యలను నేటికీ పరిష్కరించలేకపోతోంది. కార్మికులను, సకల శ్రామికులను దోపిడీ చేయడం ద్వారానే పెట్టుబడిదారీ వర్గం బతుకుతోందని కార్ల్ మార్క్స్ చేసిన సూత్రీకరణ నేటికీ రుజువవుతూనే ఉంది. ఈ కోణంలో మార్క్సిజం అధ్యయనం, ఆచరణ మానవ సమాజానికి నేటికి ఆవశ్యకమే.ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, జర్నలిస్టు రాజకీయ సిద్ధాంతకర్త, విప్లవకర సోషలిస్టు, మహామేధావి, బహుభాషా కోవిదుడు, కార్ల్‌మార్క్స్ ద్విశతాబ్ది జయంతి వార్షికోత్సవాలు ప్రపంచ వ్యాపితంగా ఈనెల 5న జరుగనున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం జరిగిన తదనంతరం మార్క్సిజానికి కాలదోషం పట్టిందని, ఆధునిక ప్రపంచానికి అది వర్తించదని అనేక మంది ‘కుహనా మేధావులు’ సైతం పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాస్తూ బూర్జువా వ్యవస్థను యథాతథంగా కొనసాగించడానికి నానా తంటాలు పడుతున్నారు. సోవియట్ యూనియన్‌లో మార్క్స్ ప్రతిపాదించిన సోషలిస్టు వ్యవస్థ వైఫల్యం చెందిందనే విస్తృతమైన ప్రచారం అన్ని రకాల మీడియాలలో చక్కర్లు కొడుతున్నది. దీనికి క్యూబా విప్లవకారుడు ఫిడెల్ క్యాస్ట్రో దీటుగానే జవాబు చెప్పారు. ‘సోషలిజం వైఫల్యం చెందిందని కాకి గోల పెడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ విజయవంతమైనదెక్కడా?’ అని సూటిగానే ప్రశ్నిం చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికిలోకి వచ్చి శతాబ్దాలు గడుస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు, ఆర్థిక నేరాలు కుంభకోణాలు భారీ స్థాయిలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రపంచాన్ని మార్చడమే అసలైన ఆచరణ ఈ ప్రపంచాన్ని పలు తత్వవేత్తలు పలు రకాలుగా అభివర్ణించారు. అయితే కావల్సిందల్లా ఈ ప్రపంచాన్ని మార్చడమే అని మార్క్స్ సూత్రీకరించారు. ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో కార్మిక వర్గ పరిస్థితులను అధ్యయనం చేసి వారి సంఘాలు పెట్టడం ప్రారంభించాడు. ప్రపంచానికి ఆయన అందించిన చిన్న పుస్తకం ‘‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’’ రెండవది ‘‘పెట్టుబడి’’. ఈ గ్రంథాలలో అదనపు విలువ సిద్ధాంతాన్ని సూత్రీకరించారు. పెట్టుబడిదారీ విధానం తన గోతిని తానే ఎలా తవ్వుకుంటుందో, దానిలో అంతర్లీనమై ఉన్న వైరుధ్యాల ఫలితంగా ఎలా అంతరించి దాని స్థానంలో ఒక నూతన వ్యవస్థ ఎలా పుట్టుకొస్తుందనేది చక్కగా విశదీకరించారు. ‘‘సకల దేశ కార్మికులారా ఏకం కండి.. మీకు పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప’’ అంటూ ప్రపంచ కార్మిక వర్గానికి వర్గపోరాటాలను సాగించడంపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారు. ప్రజలే చరిత్ర చోదక శక్తులంటూ సమాజ చరిత్ర అంటే వర్గ పోరాటాల చరిత్రే అన్నారు. ‘కమ్యూనిస్టు ప్రణాళిక’, ‘పెట్టుబడి’ గ్రంథాల స్ఫూర్తితో మొట్టమొదటి సారిగా రష్యాలో బోల్షివిక్కులు జారిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఒక జాతిని వేరొక జాతి, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయనటువంటి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, చేయడానికి గౌర వప్రదమైన ఉద్యోగం దొరికేటువంటి ఒక నూతన సోషలిస్టు సమాజం ఆవిర్భవించింది. సోవియట్ సోషలిస్టు సమాజం భూమిలేని పేదలకు భూమిని పంచడం, బ్యాంకులను, పరిశ్రమలను జాతీయం చేసి అనేక విజయాలు సాధించింది. అంతరిక్ష రంగంలో యూరిగగారిన్, వలంతెనా తెరిస్కోవాలు మొదటి అంతరిక్ష యాత్రికులుగా ప్రపంచ ఖ్యాతి పొందారు. భారీ పరిశ్రమల రంగంలో, వైద్య రంగంలో అనేక విజయాలు సాధించి అనేక బడుగు దేశాలకు ఆర్థిక, పాదార్థిక రంగాలలో సహకారమందించారు. అధికార కమ్యూనిస్టు పార్టీ యువతీ యువకులను క్రీడారంగంలో ప్రోత్సహించడం వల్ల సోవియట్ యూనియన్‌తో సహా ఇతర తూర్పు యూరప్ దేశాలు, చైనాలు కలిపి ఒలింపిక్స్‌లో మెజారిటీ 80% పైగానే స్వర్ణపతకాలను సాధిం చాయి. మార్క్సిజం స్ఫూర్తితో చైనాలో లాంగ్ మార్చ్ విజయవంతమై ప్రపంచంలోనే అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. చిన్న దేశాల్లోనూ సోషలిజం విజయం క్యూబాలో చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రోల నాయకత్వంలో బాటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చివేసి, సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే వైద్య రంగంలో ముందడుగు వేసింది. ప్రపంచంలో ఏ మూలన ప్రకృతి వైపరీత్యం జరిగినా అందరి కంటే ముందు వైద్య బృందాన్ని పంపగలిగిన దేశం సోషలిస్టు క్యూబా. అమెరికాతో సహా 14 దేశాలు వియత్నాంపై దాడి చేసినా తాను నిలదొక్కుకొని ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం వియత్నాం. లావోస్ తనదైన శైలిలో సోషలిజాన్ని నిర్మించుకొంటున్నది. దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా, బొలీవియా, నికరాగువా తదితర దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఒత్తిడులకు లొంగకుండా నిలదొక్కుకొని తమదైన స్వంత బ్యాంకును నిర్మించుకున్నాయి. అయితే మార్క్స్ స్వయాన ‘‘మార్క్సిజం పిడివాదం కాదని, అది నిరంతరం పరిస్థితుల కనుగుణంగా మారుతూనే ఉంటుందని’’ విశదీకరించారు. కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భావం అనివార్యమంటూ నిరూపించాడు. ‘పెట్టుబడి’ గ్రంథంలో వర్గపోరాటాలను విశ్లేషించి అవి చివరికి ఈ వ్యవస్థను కూల్చివేసి నూతన వ్యవస్థను సృష్టిస్తుందని ఘంటాపదంగా మార్క్స్ వక్కాణించాడు. ఈ ఆధునిక ప్రపంచంలో కార్ల్‌మార్క్స్ చెప్పినట్లుగా అక్షర సత్యంగా మన కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలను కళ్ళారా చూస్తున్నాము. కార్మిక వర్గం ఆ రోజుల్లో 14 నుంచి 16 గంటలు పని చేయాల్సి వచ్చేది. మేడే స్ఫూర్తిగా పని గంటలు తగ్గించాలని కార్మిక వర్గం రక్తాన్ని చిందించింది. కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినంలో కేవలం ఒకటి, రెండు గంటలు మాత్రమే తమ కుటుంబం కోసం వెచ్చిస్తే మిగతా గంటలు యాజమాన్యాలకు లాభాలు తెచ్చి పెట్టడానికే పని చేయాల్సి వస్తోందని మార్క్స్ ప్రబోధించారు. అయితే లాభాల వేటలో పెట్టుబడిదారులు కార్మికులతో ఓవర్ టైం (అదనపు గంటలు) పని చేయించి లాభాలు పొందేవారు. రానురాను యంత్రాల వేగాన్ని పెంచడం, ఆధునీకరించడం ద్వారా పెట్టుబడిదారీ విధానం తమ గోతిని తామే తవ్వుకొంటున్నదని మార్క్స్ నిరూపించాడు. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాద వ్యవస్థ అంతర్జాలాన్ని అభివృద్ధి చేసి తన గోతిని తానే తవ్వుకొంటోంది. అమెరికా గ్రంథాలయాల్లో మార్క్సిస్టు గ్రంథా లను ఎంత నిషేధించినప్పటికీ అంతర్జాలంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’, ‘పెట్టుబడి’తోపాటు ఇతర కమ్యూనిస్టు సాహిత్యమంతా లభిస్తూనే ఉంది. లాభాల వేటలో సాంప్రదాయ ఉత్పత్తులను మానేసి కంప్యూటర్ వృత్తినే అభివృద్ధి చేయటం వల్ల ప్రపంచానికంతా మార్క్సిజాన్ని అందచేసినట్లయింది. అయితే అందులో సైతం తమ కమ్యూనిస్టు వ్యతిరేక విషాన్ని విరజిమ్మడం కొనసాగుతూనే ఉంది. ‘ఇంటి నుంచి పని’ నయా దోపిడీలో భాగమే! సామ్రాజ్యవాద దేశాల్లో వలస కార్మికులను నియమించుకొని దోపిడీ రేటును నిరంతరం పెంచడం కొనసాగిస్తూనే ఉన్నారు. పరిశ్రమలలో సబ్సిడీతో కూడిన రాత్రి భోజనం ఏర్పాటు చేసి ఓవర్ టైం వేతనాలు చెల్లించి, కార్మికులతో అధిక గంటలు పనిచేయించి దోపిడీ రేటును పెంచడం జరుగుతోంది. అలాగే ‘‘వర్క్ ఫ్రం హోం’’ (ఇంటి నుంచి పని) అనే సౌకర్యాన్ని కల్పించి కార్మికులను దోపిడీ చేసే రేటును పెంచడం జరుగుతోంది. పెట్టుబడిదారీ విధానం తనగోతిని తానే తవ్వుకుంటుం దని ‘‘పెట్టుబడి’’ గ్రంథం నిరూపించింది. ‘‘కమ్యూనిస్టు ప్రణాళిక’’ కార్మిక వర్గం ఏ విధంగా అధికారాన్ని చేపడుతుందనేది నిరూపిస్తే ‘‘పెట్టుబడి’’ గ్రంథం పెట్టుబడిదారులు లాభాల వేటలో కార్మికులతో ఎలా పని గంటల కాలం పెంచుతారో, ఆ సమయంలో దోపిడీ రేటును ఎలా పెంచుతారో వివరించింది. ఈ పనిగంటలు పెంచడానికి పెట్టుబడిదారులు ఎంతటి నీచపు పనులకైనా ఎగబడతారని మార్క్స్ వివరించారు. మార్క్స్ దాదాపు 30 ఏళ్లపాటు వివిధ దేశాల కార్మిక వర్గ పని పరిస్థితులను అధ్యయనం చేశారు. దీని కోసం ఆయన అనేక భాషలు సైతం నేర్చుకున్నారు. మార్క్స్ ఊహించినట్లుగానే పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలతో పాటు అమెరికాలో సైతం కార్మిక వర్గం తమకు బేరసారాల హక్కు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే హక్కు ఉండాలని, కనీస వేతనాలు నిర్ధారించి చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వీధుల్లోకి రావటమే కాకుండా సమ్మెలు సైతం చేస్తున్నారు.మార్క్సిజంలో మూడు అంతర్భాగాలైన తత్వశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం, శాస్త్రీయ సోషలిజం అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి విరామ మెరుగకుండా మార్క్స్ శ్రమించాల్సి వచ్చింది. అనేక నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఇంటి అద్దెను.. కిరాయి యజమానికి చెల్లించలేని కడు పేదరికంలో మగ్గింది మార్క్స్ కుటుంబం. మార్క్స్ భార్య జెన్నీ తన సంతానానికి పాలు ఇస్తుంటే శరీరంలో పాలు లేక రక్తం స్రవించే హృదయ విదారక ఘట్టాలు ఎవరూ మరిచిపోలేని విషయాలు. అంతటి కడు పేదరి కంలో మార్క్స్ జీవించినప్పటికి తన పయనాన్ని ఆపకుండా దోపిడీ రహస్యాన్ని ఛేదించి ప్రపంచ కార్మిక వర్గానికి మార్క్సిజాన్ని అందించాడు. ఆ మార్క్సిజం అజేయమని ప్రపంచ పరిణామాలు నిరూపిస్తూనే ఉన్నాయి.కార్ల్‌మార్క్స్ యవ్వనంలోనే ఒక మాటంటాడు. ‘‘నిర్జీవపు, నిస్సారపు కాకి బ్రతుకు వద్దు ‘మనకు’ ఒక లక్ష్యంతో, గమ్యంతో ముందుకు సాగాలంటాడు. మార్క్స్ చెప్పినట్లుగా ఆశావాదంతో మరింత ముందుకు సాగుదాం. బానిస సంకెళ్ళను తెంపుకుంటూ సకల దేశ కార్మికులను ఏకం చేద్దాం. అమెరికా సామ్రాజ్యవాద నయావలసవాద విధానాలను బహిర్గతం చేస్తూ వాటిని ప్రతిఘటిస్తూ ఈ భూగోళంపై యుద్ధాలకు తావులేని ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పుదాం. - సురవరం సుధాకరరెడ్డి వ్యాసకర్త సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి (నేడు కార్ల్‌మార్క్స్ 200వ జయంతి సందర్భంగా) -
200 నాట్ అవుట్
నేడు మార్క్స్‌ను తలుచుకోవలసిన సందర్భం. సరిగ్గా రెండు వందల ఏళ్ల క్రితం 1818 మే 5న మార్క్స్ జన్మించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అనే మాట వినే ఉంటారు. అది మార్క్స్‌దే! ‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అనే మాట కూడా! నిజానికి ఈ మాట శ్రీశ్రీదే కానీ.. 1848లో మార్క్స్ రాసిన ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’లో తొలి వాక్యంలోని భావన ఇదే. ‘ఇప్పటి వరకు నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్రే’ అన్నారు అందులో మార్క్స్. డబ్బుల్లేని తండ్రికి కొడుకు కార్ల్ మార్క్స్‌ది జర్మనీ. తండ్రి న్యాయవాది. కేసులైతే వచ్చేవి కానీ, డబ్బులు వచ్చేవి కాదు. అలా పేదరికంలో పెరిగిన మార్క్స్ తన భార్యా పిల్లలకూ పేదరికాన్నే వారసత్వంగా ఇవ్వగలిగారు. మార్క్స్ చదివింది కూడా న్యాయశాస్త్రమే. కానీ హెగెల్, ఫ్యూయర్‌బాక్‌ల సిద్ధాంతాలు ఆయన్ని ‘సోషల్ ఫిలాసఫీ’వైపు దారి మళ్లించాయి. 1841లో మార్క్స్ జెనా విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత 1843లో కొంతకాలం కోలోన్లోని ఒక వార్తాపత్రి కకు సంపాదకత్వం వహించారు. అనంతరం భార్య జెన్నీతో కలసి విప్లవభావాలకు నెలవై వున్న పారిస్‌ను చేరుకున్నారు. అక్కడే మార్క్స్ అతివాద కమ్యూనిస్టుగా మారారు. ఆ క్రమంలోనే ఏంగెల్స్‌తో ఆయనకు పరిచయం అయింది. మార్క్స్ భావజాలాన్ని ప్రమాదకరమైన ధోరణిగా భావించిన ఫ్రాన్సు అతడిని దేశం నుంచి బహిష్కరించింది. అక్కడి నుంచి మార్క్స్ బ్రస్సెల్స్ చేరుకున్నారు. తర్వాత 1849లో లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. దిగులుతో కుంగిపోయిన భర్త చివరి దశలో మార్క్స్ అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఏంగెల్సే మార్క్స్‌ని ఆదుకున్నాడు. 1881లో భార్య మరణించాక మార్క్స్ బాగా కుంగిపోయారు. తర్వాత మళ్లీ కోలుకోలేదు. లండన్‌లో ఆయనకు అంత్యక్రియలు జరిపిస్తున్న సమయంలో ఏంగెల్స్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘ఈ మధ్యాహ్నం వేళ ఒక గొప్ప ఆలోచనాశీలి ఆలోచించడం మానేశాడు. మేము ఆయన చెంతన లేని రెండు నిమిషాల్లోనే మా నుంచి సెలవు తీసుకున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషి, కూర్చున్నట్లుగానే ఈ లోకాన్ని వీడిపోయారు’’ అని ఏంగెల్స్ గద్గద స్వరంతో అన్నారు. శక్తిమంతుడైన స్నేహితుడు మార్క్స్, ఏంగెల్స్ ఇద్దరూ మంచి మిత్రులు, ఆలోచనాశీలురు. మార్క్స్ ప్రభావం ఏంగెల్స్‌పై ఎంతగా ఉండేదంటే ఏంగెల్స్ జీవితాంతం మార్క్స్ అనుచరుడిగానే ఉండిపోడానికి ఇష్టపడ్డాడు. అందుకే చూడండి. మార్క్సిజం ఉంది కానీ, ఏంగెలిజం లేదు. వాస్తవానికి కూడా ఏ ఇజాన్నైనా, ఏంగెలిజాన్నయినా తనలో కలుపుకునే శక్తి మార్క్సిజంలో ఉంది. అందుకే మార్క్స్ సైద్ధాంతికంగా బలవంతుడయ్యాడు. భౌతికంగా కూడా అతడు బలిష్టుడే. దృఢకాయంతో, పెద్దగా ఛాయలేని శరీరంతో మొరటు మనిషిలా ఉండేవారట మార్క్స్! -
నడుస్తున్నది మార్క్స్ యుగం
‘చరిత్ర చరమాంకం’ భావనను దాటుకుని మానవజాతి మరో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతోంది. పాశ్చాత్య దేశాధినేతలు, వారి మేధావులు, సామాన్య జనం కూడా నేడు ‘పెట్టుబడి’ గ్రం«థాన్ని చదువుతున్నారు. ఈ కోణంలో మార్క్సిజం చిరంజీవి. కమ్యూనిజం సిద్ధాంతకారుడు కార్ల్‌మార్క్స్ జన్మిం చిన రోజు 1818, మే 5. ఈ శనివారానికి ఆయన జన్మించి 200 సంవత్సరాలు. మార్క్స్ జీవించిన 64 సంవత్సరాల కాలం యావత్తూ కార్మికవర్గ విముక్తి సిద్ధాంత సృజనకు అంకితం అయింది. 1867లో ఆయన రచించిన ‘పెట్టుబడి’ గ్రంథం మొదటి భాగం ప్రచురితమైంది. తన సహచరుడు, ఆజన్మమిత్రుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్‌తో కలిసి 1847 చివరలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను రచించారు. సమకాలీన కమ్యూనిస్టు పార్టీలు, దేశాల చరిత్రను కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, మార్క్స్ జీవిత సహచరి జెన్నీల పోరాటం, జీవితాల నుంచి వేరు చేసి చూడలేం. నాడు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకుంటూ, రూపుదిద్దుకుం టున్న కాలంలోనే దాని గమ్యాన్నీ, గమనాన్నీ వివరిస్తూనే దాని పతనాన్నీ, ఆ పతనంలో శ్రామికవర్గ పాత్రను శాస్త్రీయంగా వివరించినవాడు కార్ల్‌మార్క్స్. ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త హెగెల్ సూత్రీకరణల్లోని భావవాదాన్ని దాటి చలన సూత్రాలను పదార్థం, ప్రకృతి, సమాజానికి అన్వయించడం ద్వారా తత్వశాస్త్రాన్ని కార్ల్ మార్క్స్ భూమార్గం పట్టించాడు. తద్వారా, ’తత్వవేత్తలు నేటివరకూ ప్రపంచాన్ని నిర్వచించారు. కానీ వాస్తవానికి చేయవలసింది దానినిమార్చడం’ అని మార్క్స్ ప్రకటించాడు. మార్క్స్ సృజించిన గతితార్కిక భౌతికవాదం పదార్థం, ప్రకృతిలో జరిగే మార్పులకు కారణం వాటిలోనే అంతర్గతంగా ఉందని సూత్రీకరించింది. దాన్ని మానవ సమాజానికి వర్తించి ఆవిష్కరించింది చారిత్రక భౌతికవాదం. ఆవిధంగా వేలాది సంవత్సరాల మానవ పరిణామ చరిత్రకు కార్ల్ మార్క్స్ ఒక అర్థాన్ని సమకూర్చాడు. చరిత్ర తాలూకు గతం, వర్తమానం, భవితలను ఒడిసిపట్టిన ఆయన మానవజాతికి దాని గమ్యం, గమనాల తాలూకు పరమార్థాన్ని వివరించాడు. మానవ చరిత్రను, దాని దశలను యావత్తూ నిర్దేశించింది ఆయా సమాజాల్లో నిక్షిప్తమై ఉన్న వర్గపోరాటం అనే అంతర్గత చలన సూత్రం అని మార్క్స్ చెప్పాడు. అంటే సమాజంలో మార్పుకు, పరిణామానికి దైవాంశ సంభూతులైన చారిత్రక వ్యక్తులో లేక యాధృచ్ఛికతో కాదనీ, అసలు కారణం ఆయా చారిత్రక దశల్లోని సమాజాల తాలూకు అంతర్గత చోదక శక్తి అయిన వర్గపోరాటాలే అని తేల్చి చెప్పాడు. కాని వర్గపోరాటమనేది మార్క్స్ లేదా కమ్యూనిస్టుల సృష్టి అని పెట్టుబడిదారులూ, దాని మేధావులూ కొట్టిపారేశారు. అయితే కాలం ఎల్లవేళలా ఒకేలా లేదు. ఉండదు కూడా. 1917లో లెనిన్ నాయకత్వాన అక్టోబర్ మహా విప్లవం జరిగింది. పెట్టుబడిదారీ దేశాలను తలదన్నే రీతిలో సోవియట్ యూనియన్‌లో సోషలిజం నిర్మాణం జరిగింది. కాగా, పలు అంతర్జాతీయ సామ్రాజ్యవాద వత్తిడులూ, అంతర్గత తప్పిదాల వలన 1990లలో సోవియట్ సోషలిస్ట్ రాజ్యం పతనం అయ్యింది. దానితో చెలరేగిపోయిన పెట్టుబడిదారీ మేధావి వర్గం, నేతలూ.. సోషలిజం పూర్వపక్షం అయిపోయింది, మార్క్స్‌కు ఏనాడో కాలం చెల్లిందంటూ పాటను అందుకున్నారు. కానీ, 2000 సం‘‘రం నాటికి ఈ కథలో తేడా రాసాగింది. సోవియట్ పతనం అనంతరం ఫ్రాన్సిస్ ఫుకుయామా వంటి మేధావులు ప్రకటించిన నయా ఉదారవాద ‘‘చరిత్ర చరమాంకం’’ కథ తలక్రిందులై మానవజాతి మరో ప్రత్యామ్నాయం కోసం వెతుకులాడటం మొదలెట్టింది. లాటిన్ అమెరికా దానికి తనదంటూ ఒక దారిని ఏర్పరుచుకోసాగింది.2008లో మొదలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం కొట్టిన చావుదెబ్బకు యూరప్ ఆర్థిక మం త్రులు, ఫ్రెంచ్ ప్రధాని సార్కోజీ వంటి నేతలతోపాటు, లక్షలాది సామాన్య జనం, కార్ల్ మార్క్స్ రచించిన ‘‘పెట్టుబడి’’ గ్రంధాన్ని చదువుకోవడం మొదలు పెట్టారు. మార్క్స్ మళ్ళీ వచ్చాడు. వర్గపోరాటం నిజమేనంటూ ప్రపంచ పెట్టుబడిదారీ మీడియా, పత్రికలూ కూడా డాక్యుమెంటరీలూ, వ్యాసాలు రాసుకోసాగాయి. చివరకు నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, పోప్ ఫ్రాన్సిస్‌లు కూడా సోషలిస్టులూ, కమ్యూనిస్టులుగా కనపడే మానసిక దుస్థితి దాపురించింది. కాగా, ప్రపంచ ధనవంతులు బిల్‌గేట్స్, వారన్ బఫెట్‌తో పాటుగా అమెరికన్ బిలియనీయర్లలో 3 వంతులమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కనీ వినీ ఎరుగని సంక్షోభం రాబోతోందంటూ హెచ్చరికలు నేడు జారీ చేస్తున్నారు. ప్రపంచ పెట్టుబడిదారీ చిల్లి పడవ తడబడుతోంది. అందుకే, నిన్నటి తన ప్రపంచీకరణ సిద్ధాంతాలనూ, స్వేచ్ఛా వాణిజ్యాన్ని తనే స్వయంగా తిరస్కరిస్తూ నేడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఉన్మాదంలోకి జారిపోతోంది. బ్రెగ్జిట్ పేరిట యూరప్ నుంచి తాను విడిపోతానంటూ బ్రిటన్ తనలోకి తను ముడుచుకుపోతోంది. అంతిమంగా సమకాలిన యుగంలో పెరిగిపోతోన్న ఆర్థిక అసమానతలూ, పేదరికం, నిరుద్యోగాలూ కార్మికులూ, కర్షకులూ, కలం శ్రామికులూ... కంప్యూటర్ కూలీలూ అందరిదీ ఒకే గమ్యం... ఒకే గమనం... అది సోషలిజమేనని రోజురోజుకూ మరింత బలంగా గుర్తు చేస్తున్నాయి. అయితే సోషలిజం లేకుంటే మరణ వేదన పడుతోన్న సామ్రాజ్యవాదపు ఉన్మాదపు పరాకాష్ఠగా అణు యుద్ధం మినహా మరో దారిలేని చరిత్ర మలుపులోకి మనం వచ్చాం. సోషలిజం వర్థిల్లు గాకా... మార్క్సిజం చిరంజీవి!!! డి. పాపారావు వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు (మే 5న కార్ల్ మార్క్స్ 200వ జయంతి) మొబైల్ : 9866179615 -
వందేళ్ల వసంతం
అదొక మహత్తరమైన మలుపు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘటన. కార్మికవర్గ విప్లవంతో సమసమాజ స్థాపన జరుగుతుందన్నాడు కార్ల్ మార్క్స్. ఆ సిద్ధాంతాన్ని లెనిన్ ఆచరణలో పెట్టిన సందర్భమది. ప్రపంచంలో తొలిసారిగా కార్మికులు రాజ్యాధికారం చేజిక్కించుకున్న ఉదంతం. తొలి సోషలిస్టు దేశం ఆవిర్భవించిన చరిత్ర. అదే అక్టోబర్ విప్లవం! రష్యా విప్లవం! బోల్షివిక్ విప్లవం! యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రష్యా! 1917 లో సంభవించిన ఆ మహా విప్లవానికి ఈ నవంబర్ 7వ తేదీతో వందేళ్లు నిండుతున్నాయి. కానీ ఇప్పుడు సోషలిస్టు రష్యా లేదు. పాతికేళ్ల కిందటే రద్దయింది! 1991లో సోషలిజాన్ని అధికారికంగా రద్దు చేసుకుని రష్యా సమాఖ్యగా మారింది. కానీ సోషలిస్టు రష్యా మనుగడ సాగించిన 75 ఏళ్లలో ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది. మరిన్ని దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఆ సమయంలో ప్రపంచం రెండు భిన్న ధృవాలుగా చీలిపోయింది. ఆ ధృవాల మధ్య వైరం ఎప్పుడు విస్ఫోటనమవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొని ఉండేవి. కానీ.. సోవియట్ రష్యా విచ్ఛిన్నంతో ప్రపంచం ఏకధృవంగా మారిపోయింది. మార్క్స్ సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది, సోషలిజం సాక్షాత్కారానికి ఆస్కారం లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛా విపణి సమాజమే అంతిమం అనే వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ.. కార్మికవర్గానికి, సోషలిస్టు వాదులకు అక్టోబర్ విప్లవం ఎప్పటికీ మార్గదర్శిగానే నిలిచిపోయింది. సోవియట్ రష్యా కూలిపోవడానికి కారణం లెనిన్ అనంతర ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లో లోపాలే కానీ.. అంతటితో సోషలిజం అంతం కాలేదని నమ్మేవారూ ప్రపంచ వ్యాప్తంగా బలంగానే ఉన్నారు. సోషలిస్టు రష్యాలో అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఏటా అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించేవారు. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వామపక్ష శక్తులకు కూడా పండగగానే ఉండేది. ఇప్పుడు అక్టోబర్ వందేళ్ల విప్లవ ఉత్సవాన్ని రష్యాలో అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్నది అటుంచితే.. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, మేధావులు తమ పునరేకీకరణకు, మరింత లోతైన అధ్యయనానికి ఈ సందర్భాన్ని ఒక వేదికగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విప్లవంపై ‘సాక్షి’ ఫోకస్... - సెంట్రల్ డెస్క్ రష్యా సోషలిస్టు విప్లవానికి శతాబ్దం పూర్తి ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ విప్లవం మార్క్స్ ‘కార్మిక విప్లవా’న్ని ఆచరణలో పెట్టిన లెనిన్ - ప్రపంచంలో తొలి కార్మికవర్గ రాజ్యంగా అవతరణం - ఎన్నో దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలకు స్ఫూర్తి ప్రదాత - రెండు భిన్న ధృవాలుగా చీలిపోయిన ప్రపంచ దేశాలు - రష్యా, అమెరికాలు ‘సూపర్ పవర్’లుగా ఆవిర్భావం - ఇరువురి మధ్య అర్ధ శతాబ్దం పాటు ప్రచ్ఛన్న యుద్ధం - పాతికేళ్ల కిందట పతనమైన సోవియట్ సోషలిస్ట్ రష్యా బ్లడీ సండే: తొలి సోవియట్ ఆవిర్భావం రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం రావడానికి అది విజయవంతం కావడానికి ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. జార్ రాచరిక నిరంకుశ పాలనలోని రష్యాలో 1905 లోనే ఈ విప్లవానికి పునాదులు పడ్డాయి. పట్టణాల్లోని కార్మికవర్గం అవధులు లేని పనిగంటలతో సతమతమవుతుండేది. పెట్రోగ్రాడ్ (ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్.. అప్పటి రష్యా రాజధాని)లో జనవరి 22వ తేదీన (ఆదివారం) కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చక్రవర్తి (జార్) నికొలస్-2కు వినతిపత్రం ఇవ్వడం కోసం నిరాయుధంగా, శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్నపుడు సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 1000 నుంచి 4000 మంది వరకూ చనిపోవడం, గాయపడటం జరిగిందని భిన్న అంచనాలు ఉన్నాయి. ‘బ్లడీ సండే’గా పేర్కొనే ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా కార్మికవర్గ నిరసనలు, సమ్మెలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కార్మికులు తొలి సోవియట్ (సహకార మండలి)ని స్థాపించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ సోవియట్లు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు రాజకీయ నిరసన అప్పుడే మొదలైంది. రెడ్ అక్టోబర్... ఫిబ్రవరి విప్లవం విజయవంతం కావడంతో అప్పటివరకూ స్విట్జర్లాండ్‌లో ప్రవాసంలో ఉన్న అతివాద బోల్షివిక్ నాయకుడు లెనిన్ తదితరులు ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. పెట్రోగార్డ్ సోవియట్‌లో బోల్షివిక్ల కన్నా మితవాద మెన్షెవిక్‌లు, సోషలిస్టు విప్లవవాదులు బలంగా ఉండేవారు. అయితే.. తాత్కాలిక ప్రభుత్వంలో డ్యూమాకు సోవియట్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అక్టోబర్ నాటికి ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు సోషలిస్టు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని లెనిన్ గుర్తించాడు. లెనిన్ రాకతో అంతకంతకూ పుంజుకుంటూ వచ్చిన బోల్షివిక్‌లు విప్లవం లేవదీశారు. అప్పటికే పెట్రోగార్డ్ సోవియట్‌కు అనుబంధంగా నిర్మించిన రెడ్ గార్డ్స్ సాయంతో అక్టోబర్ 25వ తేదీన (కొత్త క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7) ప్రభుత్వాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా కార్మికుల సోవియట్ల చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడం మొదలైంది. ఈ విప్లవంలో ఏ వైపూ ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే ఇది రక్తపాత రహిత విప్లవంగా చరిత్రలో నమోదయింది. లెనిన్ సారథ్యంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టింది. ప్రపంచ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. అంతర్యుద్ధం..: కానీ.. విప్లవం అంతటితో పూర్తవలేదు. అక్టోబర్ విప్లవం తర్వాత అంతర్యుద్ధం రాజుకుంది. సోవియట్లను, సోషలిస్టు వ్యవస్థను వ్యతిరేకించే వర్గాలు, జార్ రాచరిక అనుకూల వర్గాలతో పాటు.. అతివాద బోల్షివిక్లను వ్యతిరేకించే సోషలిస్టు రివల్యూషనరీలు ఒకవైపు.. బోల్ష్విక్లు మరొకవైపుగా అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కోసం రెండు పక్షాల వారూ కార్మికులు, రైతులను బలవంతంగా సైన్యంలో చేర్చేవారు. 1918లో జార్ కుటుంబాన్ని బోల్షివిక్‌లు చంపేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా వైదొలగినా.. అమెరికాతో కూడిన మిత్రరాజ్యాలు అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవటంతో సోవియట్ల రెడ్ ఆర్మీ వారితోనూ పోరాడింది. నాలుగేళ్ల పాటు సాగిన ఈ అంతర్యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. చివరికి రెడ్ గెలిచిన తర్వాత 1922 డిసెంబర్ 29న సోవియట్ రష్యా ఆవిర్భవించింది. విప్లవ కెరటాలు రష్యా విప్లవం స్ఫూర్తితో అదే సమయంలో జర్మనీలో, హంగరీ, ఇటలీ, ఫిన్లాండ్, వంటి పలు దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు తలెత్తాయి. కానీ.. పెద్దగా విజయాలు సాధించలేదు. కొన్నిచోట్ల విజయవంతమైనా కూడా ఎంతో కాలం నిలువలేదు. అయితే అంతర్జాతీయ కమ్యూనిస్టు విప్లవం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. అందులో రష్యా కమ్యూనిస్టు పార్టీ పాత్ర, సాయం కూడా ఉంది. అనంతర కాలంలోనూ చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా తదితర దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు విజయవంతమయ్యాయి. భారత్ సహా చాలా దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు సాయుధ విప్లవ పంథా ఎంచుకోవడానికి రష్యా, చైనా విప్లవాలు మార్గదర్శిగా నిలిచాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విప్లవ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సోషలిజం నిర్మాణ ప్రయత్నాలు... సోషలిస్టు రష్యాలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. కార్మికులకు 8 గంటల పనిదినం, రైతులకు భూముల పంపిణీ, బ్యాంకులు, పరిశ్రమల జాతీయీకరణ వంటి కార్మికవర్గ అనుకూల సంస్కరణలు జరిగాయి. సామూహిక వ్యవసాయం అమలు చేశారు. అందరికీ విద్యా హక్కు కల్పించారు. పారిశ్రామికీకరణ వేగవంతమైంది. అందరికీ పని అందించేందుకు కృషి చేశారు. దేశంలో పితృస్వామ్యం ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కృషి జరిగింది. మహిళలకు, జాతిపరంగా మైనారిటీలకు సమాన హక్కులు కల్పించారు. వ్యవస్థీకృత మతాన్ని వ్యతిరేకించారు. ఇంట్లో మినహా అన్నిచోట్లా మత బోధనను నిషేధించారు. హేతువాద భావజాలాన్ని ప్రోత్సహించారు. విద్యను చర్చి నుంచి వేరుచేశారు. హేతువాదంతో కూడిన విద్యను అమలు చేశారు. అభివృద్ధిలో చాలా వెనుకబడిన దేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పంచవర్ష ప్రణాళికలతో సోవియట్ రష్యా అనతి కాలంలోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న, తృతీయ ప్రపంచ దేశాలకు డ్యాములు, పరిశ్రమల నిర్మాణం, ఆయుధాల సరఫరా వంటి వాటితో సహా ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో సాయం అందించింది. ప్రచ్ఛన్న యుద్ధం... మరోవైపు.. అదే సమయంలో అధికార కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత పోరూ మొదలైంది. 1924లో లెనిన్ చనిపోయాక స్టాలిన్ అధికారం చేపట్టాడు. స్టాలిన్ విధానాలను వ్యతిరేకించిన రెడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు ట్రాట్స్కీ దేశబహిష్కరణకు గురయ్యాడు. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో హిట్లర్ సారథ్యంలోని నాజీ జర్మనీని రష్యా ఓడించింది. ప్రపంచ చరిత్రలో అది మరింత కీలకమైన మలుపు. కానీ యుద్ధంలో 2.6 కోట్ల మంది రష్యా ప్రజలు చనిపోయారు. అయితే.. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, అమెరికా ప్రయోజనాలు పరస్పరం విరుద్ధమైనవి కావడంతో వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్ మధ్య ఆధిపత్యం అంశంపై విభేదాలు తీవ్రమయ్యాయి. అణ్వాయుధాల తయారీ సహా రెండు దేశాల మధ్యా అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. రష్యా, అమెరికాలు రెండూ ‘సూపర్ పవర్‘లుగా నిలిచాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల వెనుకా రెండు ధృవాలుగా విడిపోయింది. వాటి మధ్య ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నంత ఉత్కంఠగా పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి విప్లవం... ఇక మొదటి ప్రపంచ యుద్ధం కూడా రష్యా ప్రజల్లో జార్‌పై, ఆయన పరిపాలనపై వ్యతిరేకతను పెంచింది. జార్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే లక్ష్యంతో రైతాంగాన్ని యుద్ధరంగంలోకి పంపించాడు. కానీ.. తన కన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ చేతిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. వేలాది మంది యుద్ధరంగంలో నేలకూలుతున్నారు. మరోవైపు.. యుద్ధం కోసం భారీగా కరెన్సీ నోట్లు ముద్రించటంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 1917 వచ్చేసరికి ధరలు నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పట్టణాల్లో పరిశ్రమలు సగానికి సగం మూతపడ్డాయి. నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. కార్మికులకు రొట్టెలు దొరకటం గగనమైపోయింది. ఇంకోవైపు ఉన్న పరిశ్రమల్లో కార్మికులు పన్నెండు గంటలకు పైగా వెట్టిచాకిరి చేయాల్సిన దుస్థితి. అందులో మహిళలూ అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను సరళం చేయాలన్న డ్యూమా (పార్లమెంటు)ను జార్ రద్దు చేశాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపాలని, శాంతి కావాలని, రొట్టెలు కావాలనే డిమాండ్లతో పెట్రోగార్డ్లో కార్మికులు సమ్మెకు దిగారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రవాసంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఈ సమ్మెలకు, ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేయాలని జార్ తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ అప్పటికే యుద్ధంలో దెబ్బతిని ఉన్న సైన్యంలో అధిక భాగం కార్మికులకు మద్దతుగా నిలిచారు. చాలా మంది పారిపోయారు. ఇక గత్యంతరం లేక 1917 మార్చి 2న (కొత్త క్యాలెండర్ ప్రకారం మార్చి 15న) జార్ నికొలస్-2 చక్రవర్తి పీఠాన్ని త్యజించాడు. ఆయన సోదరుడు ఆ పీఠం స్వీకరించేందుకు నిరాకరించాడు. దీంతో రాచరిక డ్యూమా, పెట్రోగార్డ్ సోవియట్ కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాజ్యాంగ శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం ఈ సర్కారు ముఖ్య లక్ష్యం. సోవియట్ పతనం... 1953లో స్టాలిన్ మరణంతో రష్యాలో అధికారం కోసం అంతర్గత పోరాటం మొదలైంది. కృశ్చేవ్ అధికారం చేపట్టి తన పట్టు బిగించాడు. ఆయన విఫలమయ్యాడంటూ కమ్యూనిస్టు పార్టీ స్వయంగా 1964లో తొలగించింది. ఆ తర్వాత బెద్నేవ్, కోసిజిన్, పోద్గోర్నీలు ఉమ్మడిగా నాయకత్వం వహించారు. అనంతరం బ్రెజ్నేవ్ నాయకత్వం చేపట్టాడు. కృశ్చేవ్, బ్రెజ్నేవ్ల హయాంలో రష్యా పారిశ్రామిక, అంతరిక్ష రంగాల్లో శిఖరస్థాయికి చేరుకుంది. కానీ.. ఆ సమయంలో వేగంగా సాగుతున్న ఆధునికీకరణ, కంప్యూటరీకరణల్లో రష్యా అంతకంతకూ వెనుకబడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన చమురు ధరలు ఎగుడుదిగుళ్లు కావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆండ్రపోవ్, చెరెన్కోల తర్వాత అధికారం చేపట్టిన గోర్బచేవ్.. రష్యా కమ్యూనిస్టు పార్టీని ఆధునీకరించే పని మొదలుపెట్టాడు. అధికారంలో పార్టీ పట్టును సడలించాడు. సామాజిక సమస్యలపై ప్రజలు దృష్టి సారించడం పెరిగింది. ఈ క్రమంలో గోర్బచేవ్, పార్టీ నాయకుడు ఎల్సిన్ల మధ్య అధికార పోరు తీవ్రమైంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత 1991 డిసెంబర్ 26న సోవియట్ యూనియన్ రద్దయింది. రష్యా ఫెడరేషన్ అవతరించింది. రష్యా సూపర్ పవర్ హోదా కోల్పోయింది. కమ్యూనిజం భవిష్యత్? సోవియట్ రష్యా పతనం ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష వాదులను ఎంతో నిస్పృహకు లోను చేసింది. ఇక మార్క్సిజం, కమ్యూనిజాలు విఫలమయ్యాయన్న వాదనలు వ్యతిరేక వర్గం నుంచి వెల్లువెత్తాయి. సరళీకృత స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే ప్రపంచానికి అంతిమ పరిష్కారమన్న సూత్రీకరణలు జరిగాయి. అయితే వామపక్ష వాదులు అది కేవలం విప్లవానికి ఒక ఎదురు దెబ్బేనని, సోషలిస్టు స్థాపనకు నిరంతర ప్రయత్నం సాగుతూనే ఉంటుందని విశ్వసిస్తున్నారు. నవంబర్‌లో అక్టోబర్ విప్లవం..! రష్యా సోషలిస్టు విప్లవానికి అక్టోబర్ విప్లవం అని పేరు. కానీ.. ఆ విప్లవం సంభవించింది ప్రస్తుత కేలండర్లో నవంబర్ 7వ తేదీ. విప్లవం వచ్చే సమయానికి రష్యాలో జూలియన్ కేలండర్ ఉపయోగించేవారు. ఆ కేలండర్ ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన ఈ విప్లవం సంభవించింది. ఆ తర్వాతి నుంచి ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ కేలండర్లో అది నవంబర్ 7వ తేదీ అయింది. అందుకే అక్టోబర్ విప్లవం ఉత్సవాన్ని నవంబర్‌లో నిర్వహించుకుంటారు. -
మార్క్సిజానికి పునరంకితం కావాలి
క్యాడర్‌కు గణపతి పిలుపు న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ చరిత్రలో కమ్యూనిస్టులు మరిచిపోలేని నాలుగు ముఖ్య చరిత్రాత్మక ఘట్టాలున్నాయని, ఈ ఘట్టాల వార్షికోత్సవాలను పురస్కరించుకొని మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానానికి మావోయిస్టులందరు పునరంకితం కావాలని సీపీఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ తరఫున ప్రధాన కార్యదర్శి గణపతి బహిరంగ లేఖలో పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. చైనాలో అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారి వ్యవస్థకు తిలోదకాలిచ్చి కమ్యూనిస్టు పాలనకు తెరలేపిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (గ్రేట్ ప్రొలిటేరియన్ కల్చరల్ రెవెల్యూషన్-జీపీసీఆర్) 50వ వార్షికోత్సవాన్ని, భారత్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ సాయుధ పోరాటం 50వ వార్షికాత్సవాన్ని, ప్రపంచాన్నే కుదిపేసిన రష్యా సోషలిస్ట్ విప్లవం శతవార్షికోత్సవాన్ని, కాలం ప్రసవించి కారల్ మార్క్స్ కని రెండు శతాబ్దాలు అవుతున్న సందర్భమే ఈ నాలుగు ప్రధాన చరిత్రాత్మక ఘట్టాలని, ఈ వార్శికోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవాన్ని, 50వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు (గడిచిపోయిన కాలం), దేశంలో నక్సల్బరి సాయుధ తిరుగుబాటు 50వ వార్షికోత్సవాన్ని వచ్చే ఏడాది 23మే నెల నుంచి మే 29వ తేదీ వరకు, రష్యా సోషలిస్టు విప్లవం శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది నవంబర్ ఏడు నుంచి 13వ తేదీ వరకు, కారల్ మార్క్స్ ద్విశత జయంతిని పురస్కరించుకొని 2018, మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ ప్రజా సంఘటిత కార్యక్రమాలను నిర్వహించాలని మావోయిస్టు నేత గణపతి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల తాను సూచించిన తేదీల్లో వార్షిక వారోత్సవాలను నిర్వహించడం కుదరకపోతే అనువైన తేదీల్లో నిర్వహించాలని ఆయన సూచించారు. నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు. దేశంలో జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాలను శక్తులను కూడగట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో కొంత వెసలుబాటు దోరణి అవలింబించినప్పటికీ నక్సలిజం లక్ష్యానికి మాత్రం దూరం వెళ్లకూడదని చెప్పారు. నక్సలిజాన్ని ఏదోరకంగా సమర్ధించే శక్తులతోనే మమేకం కావాలని అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా నయా పెట్టుబడిదారి విధానం రాజ్యమేలుతున్న కారణంగా ప్రజల్లో అసహన పరిస్థితులు, కొన్ని చోట్ల తిరుగుబాటు పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. కమ్యూనిజానికి, సోషలిస్టు విప్లవాలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి సమాజం దుష్ర్పచారం సాగిస్తోందని, తాను చెప్పిన నాలుగు కమ్యూనిస్టు చారిత్రక ఘట్టాలను పురస్కరించుకొని ఎదురుదాడికి దిగాలని ఆయన సూచించారు. మేధోపరంగా, రాజకీయంగా, ప్రజా ఉద్యమాలపరంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
కత్తి అంచున కలంతో కవాతు
‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’ వ్యాసాలలో మార్క్స్ భారతదేశంలో బ్రిటిష్ పాలనను సునిశితంగా పరిశీలించారు. రైల్వేల నిర్మాణం తీసుకొచ్చే ప్రగతి ద్వారా సామాజిక అంతరాలు కొంత తగ్గుతాయని భావించారు. ‘‘భారత ప్రజల మధ్య ఉన్న విభేదాల వల్ల ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా లేకుండా పోయింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బ్రిటిష్ వారికి సహకరించారు. దానితో ఆ తిరుగుబాటును అణచివేయడం బ్రిటిష్ వారికి సాధ్యపడింది’’ అని ఆయన విశ్లేషించారు. కార్మికుడి చెమటచుక్కల్లోనే పెట్టుబడిదారుడి దోపిడీ మూలాలున్నాయని తేల్చిచెప్పిన కార్ల్ మార్క్స్‌లోని మరో కోణం ఆయన జర్నలిస్టుగా పని చేయడం. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంపై ‘‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’’కు రాసిన ఒక వ్యాసంలో ఆయన ఆనాటి భారతదేశ పరిస్థితులను ఇలా వర్ణించారు:‘‘ఇండియాలో బ్రిటిష్ పరిపాలన దౌర్జన్యాల పుట్టగా ఉందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రజలను రకరకాల పద్ధతుల్లో అన్యాయానికి, అణచివేతకు గురిచేసిన విదేశీ పాలకులను పారదోలడానికి ఆ దేశ ప్రజలు ప్రయత్నించడం సమర్థనీయమే. నిష్పక్షపాతులైన విజ్ఞులందరూ ఈ విషయంలో సానుకూలంగానే ఉంటారని భావిస్తాను. వారి దుర్మార్గాలను హిందూ దేశీయులపై నెట్టివేస్తూ, బ్రిటిష్ పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పైగా ప్రజల తిరుగుబాటును ఒక నేరంగా చూపిస్తున్నారు.’’ పాత్రికేయునిగా మార్క్స్ కార్ల్ మార్క్స్ లండన్‌లో నివసిస్తున్న సమయంలో 1853 నుంచి 1858 వరకు అమెరికాలోని న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు రాసిన దాదాపు 500 వ్యాసా లలో ఇండియాపై రాసిన వ్యాసాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటివలన్లే భారతదేశంలో ఆనాడు నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మార్క్స్ దృష్టితో మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కారణాలను, తదనంతర పరిణామాలను విశ్లే షిస్తూ ఆయన రాసిన వ్యాసాలు పుస్తక రూపంలో వచ్చాయి. మార్క్స్ మిత్రుడు, కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలలో ఒకరైన ఫ్రెడరిక్ ఎంగెల్స్ కూడా అదే పత్రికలో భారతదేశ స్థితిగతులపై ఏడు వ్యాసాలు రాశారు. నిజానికి కార్ల్ మార్క్స్ తన విశ్వవిద్యాలయ విద్య ముగిసిన తర్వాత చేపట్టినది పాత్రికేయ వృత్తినే. మార్క్స్ చేసిన మొదటి, ఏకైక ఉద్యోగం కూడా అదే. 1818లో జర్మనీలోని ట్రయర్ నగరంలో జన్మించిన కార్ల్ మార్క్స్ అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1836 అక్టోబర్ 22న బెర్లిన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర విద్యలో చేరారు. ఆ తర్వాత తత్వశాస్త్రం పట్ల ఆకర్షితుడై 1939లో ‘‘డెమొక్రటస్-ఎపిక్యూరస్ ప్రకృతి తత్వాల మధ్య వ్యత్యాసం’’ అన్న అంశంపై పరిశోధన ప్రారంభించి, 1841 నాటికి ముగించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ట్రయర్కు తిరిగి వచ్చాడు. ప్రష్యాలోని రైన్ రాష్ట్రం నుంచి 1842లో ‘‘రైనిష్ జెటుంగ్’’ అనే పత్రిక ప్రచురణ మొదలైంది. మార్క్స్ చొరవను, రచనాశక్తిని చూసిన ప్రచురణకర్తలు ఆ పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వ హించాలని ఆయనను ఆహ్వానించారు. 1842 అక్టోబర్‌లో ఆయన ‘‘రైనిష్ జెటుంగ్’’ సంపాదక బాధ్యతలు స్వీకరించారు. తన విజ్ఞానదాయకమైన, రాజకీయ విశ్లేషణలతో మార్క్స్ ఆ పత్రికకు ఊపిరి అయ్యాడు. అయితే మొదటి నుంచే కమ్యూనిస్టు పత్రికగా ముద్రపడ్డ ఆ పత్రికను 1843 మార్చి 31న ప్రభుత్వం నిషేధించింది. యజమానులు ప్రభుత్వంతో రాజీపడగా మార్క్స్ దానికి రాజీనామా చేశారు. సంపాదకుడిగా తాను.. సమాజంలో భౌతికమైన కోర్కెలు ఎంత పెద్ద పాత్రను నిర్వహిస్తాయో, బూర్జువా వర్గ కపటత్వం, కుట్రతత్వం ఎలాంటివో తెలుసుకున్నానని అన్నాడు. ప్రష్యాలోని కొలోన్‌లో ఉద్యోగం వదులుకోవడంతో మార్క్స్‌కి జీవనాధారం కావాల్సి వచ్చింది. అందుకే పారిస్ వెళ్ళాలనుకున్నాడు. 1843 అక్టోబర్‌లో పారిస్ చేరుకున్న కార్ల్ మార్క్స్ కుటుంబం రాజకీయ ప్రవాస జీవితాన్ని మొదలు పెట్టింది. 1844 జనవరిలో మార్క్స్ సంపాదకత్వాన ‘‘ఫ్రెంచి జర్మన్ ఇయర్ బుక్’’ను ప్రారంభించారు. ఆ కాలంలో ప్రచురితమైన వ్యాసాలు, లేఖలు చూస్తే ఆయన విప్లవ ప్రజాతంత్ర వాదం, కమ్యూనిజం వైపు మొగ్గాడని అర్థం అవుతుంది. అయితే, 1845 జనవరిలో పారిస్ ప్రభుత్వం ఆయన రచనలకు బెదిరి, 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. దానితో మార్క్స్ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరారు. మొదటి కమ్యూనిస్టు విప్లవ పత్రిక 1845 నుంచి 1948 వరకు కార్ల్ మార్క్స్ ఎన్నో ముఖ్యమైన పుస్తకాలు రాశారు. అందులో ముఖ్యమైనది కమ్యూనిస్టు ప్రణాళిక. ఇది ఫిబ్రవరిలో అచ్చయ్యింది. అయితే ఏప్రిల్‌లో మార్క్స్, ఎంగెల్స్‌లు ప్రష్యాలోని కొలోన్ చేరుకున్నారు. అక్కడ కమ్యూనిస్టు లీగ్ చాలా శక్తివంతమైన సంస్థగా ఎదిగింది. దాని తరఫున మార్క్స్ 1848, జూన్ 1 నుంచి ‘‘నియోరైనిష్ జెటూంగ్’’ అనే పత్రికను ప్రారంభించాడు. ఎంగెల్స్ దీని ప్రచురణ బాధ్యతలను చూడడంతో పాటు, ఎన్నో వ్యాసాలను రాశారు. ‘‘అవి విప్లవాత్మక దినాలు. అలాంటి రోజుల్లో దిన పత్రికల్లో పనిచేయడం ఎంతో ఉల్లాసకరమైన పని. ప్రతి మాటా ఎంత శక్తివంతమైందో ప్రత్యక్షంగా అలాంటి సమయంలోనే తెలుస్తుంది. తమ వ్యాసాలు చేతి బాంబుల్లా పేలడాన్ని రచయితలు గమనిస్తారు.’’ అంటూ ఎంగెల్స్ ఆ పత్రిక ప్రాముఖ్యాన్ని తెలిపారు. 1849 మే తిరుగుబాట్లను రక్తపాతంతో అణచివేయడం మొదలు పెట్టిన ప్రష్యన్ మిలిటరీ రాజ్యం మార్క్స్ సంపాదకత్వంలోని ‘‘నియోరైనిష్ జెటూంగ్’’పై దాడికి దిగింది. 24 గంటలలోగా ప్రష్యాను వదిలిపెట్టవలసిందిగా మార్క్స్‌ను ఆదేశించింది. పోలీసుల వేధింపులు ఎక్కువ కాగా ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ పత్రిక మూతపడింది. పత్రికను మూసివేస్తూ చివరి రోజున ఎంగెల్స్ ‘‘మేము మా కోటను స్వాధీనం చేయాల్సి వస్తున్నది. అయితే మా ఆయుధాలు, సామాను మూటగట్టుకొని ఉపసంహరించుకుంటాం. మా పతాకాన్ని ఎగురవేస్తూనే ఉంటాం. ఆఖరి సంచిక బ్యానర్ అరుణ పతాకమే’’ అని రాశారు. శాస్త్రీయ కమ్యూనిజం ప్రాతిపదికగా, విప్లవోద్యమం కోసం కృషి చేసిన మొదటి దినపత్రిక చరిత్ర అలా ముగిసింది. మార్క్స్ ముఖ్యమైన పనులన్నీ ముగించుకుని జర్మనీకి వెళ్ళాడు. అక్కడా పరిస్థితులు అనుకూలంగా లేక పారిస్‌కు వెళ్ళాడు. అక్కడా పరిస్థితులు బాగా లేక తప్పని పరిస్థితుల్లో ఆయన లండన్ చే రారు. 1849 ఆగస్టు, 26న లండన్‌లో కాలు మోపిన మార్క్స్ కొత్త పత్రిక పెట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘నియోరైనిష్ జెటూంగ్’ను దిన పత్రికగా గాక, మాస పత్రికగా తేవాలనుకున్నారు. దానిని రాజకీయ, ఆర్థిక సమీక్షగా ఉంచాలనుకున్నారు. 1850 మార్చి నెలలో 2,500 కాపీలతో మొదటి సంచిక వెలువడింది. అయితే ఉద్యమాలు దెబ్బతినడంతో ఆ మాస పత్రికను నడ పడం కూడా కష్టమైంది. కొన్ని సంచికల తర్వాత అదీ మూతపడింది. మార్క్స్ దృష్టిలో భారతదేశం ఈ క్రమంలోనే అమెరికాలోని ‘‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’’కు మార్క్స్ 1853 నుంచి లండన్ విలేకరిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఆ పత్రికకు రాసిన వ్యాసాలలో ఆయన భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలనను సునిశిత దృష్టితో పరిశీలించారు. శిస్తు వసూళ్లలో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన అమానుషాలను ఆయన తన వ్యాసాల ద్వారా అక్కడి ప్రజల ముందుంచారు. ‘‘మా ప్రాంతం తహశీల్దారు మా దగ్గర నుంచి కఠినంగా భూమిశిస్తు వసూలు చేయడం మొదలు పెట్టాడు. నన్ను, మరికొందరు రైతులను నిర్బంధించారు. మమ్మల్ని రోజూ ఎండలో వంగోబెట్టి మా వీపుల మీద బండలు పెట్టి, మండుతున్న ఇసుకలో నిలబెట్టేవారు. అటువంటి దుర్మార్గం మూడు నెలలపాటు సాగింది’’ అంటూ ఒక రైతు వ్యధను ఆయన ఎంతో హృద్యంగా ఒక వ్యాసంలో అభివర్ణించారు. భారతదేశంలో రైల్వేల నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ, రైల్వేలు, రోడ్డుమార్గాలు లేకపోవడం వల్ల ఏ గ్రామానికి ఆ గ్రామం విసిరివేసినట్టుండి, చీకట్లో మగ్గుతున్నాయనీ, రైల్వేల నిర్మాణం ఆ లోటును భర్తీ చేస్తుందనీ అభిప్రాయపడ్డారు. సామాజిక అంతరాలు కూడా ఈ రైల్వేలు తీసుకొచ్చే ప్రగతి ద్వారా కొంత తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 1853లో రాసిన ‘‘ఇండియాలో బ్రిటిష్ పరిపాలన, భావి ఫలితాలు’’ అన్న వ్యాసంలో భారత దేశం అనేకసార్లు పరాధీనం కావడానికి దారి తీసిన సామాజిక పరిస్థితులను ఎత్తి చూపారు. ‘‘మహ్మదీయుడు, హిందువు అనే వ్యత్యాసం వల్ల మాత్రమే కాకుండా, తెగకీ, తెగకీ, కులానికీ కులానికీ మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల దేశం చీలిపోయింది. సమాజంలో అసమానతల ఆధారంగా జీవనం సాగుతున్నది. ఇటువంటి దేశం ఎన్నిసార్లైనా ఓడిపోయి, బానిసత్వంలోకి వెళుతుంది’’ అని విశ్లేషించారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రా మం ఓటమి గురించి ప్రస్తావిస్తూ ‘‘భారత దేశంలోని ప్రజల మధ్య ఉన్న విభేదాల వల్ల ఆ పోరాటంలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా లేకుండా పోయింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బ్రిటిష్ వారికి సహకరించారు. దానితో ఆ తిరుగుబాటును అణచివేయడం బ్రిటిష్ వారికి సాధ్యపడింది.’’ అని విశ్లేషించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అని పిలుపునిచ్చిన మార్క్స్ అందించిన మార్క్సిజం ప్రపంచమంతటా ఎన్నో విప్లవాలకు, ఉద్యమాలకు, తిరుగుబాట్లకు, శ్రామివర్గ దోపిడీ విముక్తికి ప్రేరణగా నిలిచింది. అరుదైన ప్రపంచ కార్మికవర్గ నాయకుడు కార్ల్ మార్క్స్ సమాజంలో దోపిడీ పీడనలున్నంత వరకు ప్రపంచ పీడిత వర్గాలకు మార్గదర్శిగా ఉంటాడు. (నేడు కార్ల్ మార్క్స్ జయంతి) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
చేనేత వేదన వింటారా?!
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంలో భాగంగా బ్రిటిష్ వలసపాలకులు చేనేత రంగాన్ని, రాట్నాన్ని ధ్వంసంచేశారని కార్ల్ మార్క్స్ ఒక వ్యాసంలో అంటాడు. అపురూప వారసత్వ సంపదగా, విశిష్ట కళారూపంగా ఇప్పటికీ ప్రపంచంలో నీరాజనాలందుకుంటున్న చేనేత రంగానికి అన్యాయం చేయడంలో మన ప్రభుత్వాలు వలసపాలకులతో పోటీపడుతున్నాయి. చేనేత రంగానికి చేసే బడ్జెట్ కేటాయింపులను అంతకంతకూ తగ్గిస్తూ, ఆ రంగం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యల పరిష్కారంపై శ్రద్ధపెట్టక దాన్ని కొడిగట్టిస్తున్న మన పాలకులు దాన్ని మరింత శల్యావస్థకు చేర్చే మార్గాన్ని వెదుకుతున్నట్టు కనబడుతోంది. చేనేతకు రక్షణ కల్పించడం కోసమంటూ 1985లో తీసుకొచ్చిన చట్టాన్ని సవరించేందుకూ, వీలైతే దాన్ని రద్దుచేసేందుకూ ప్రయత్నాలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. చీరెలు, లుంగీలు వంటి 22 రకాల ఉత్పత్తులను చేనేత రంగానికే రిజర్వ్ చేస్తూ ఆ ఉత్పత్తులను మరమగ్గాలపై తయారు చేయరాదంటూ 1985నాటి చేనేత చట్టం నిర్దేశిస్తున్నది. ఈ 22 రకాల ఉత్పత్తులు కాలక్రమేణా 11 రకాలకు పడిపోగా...వాటిని సైతం మరమగ్గాలపై భారీయెత్తున ఉత్పత్తి చేసి మార్కెట్లను ముంచెత్తుతున్నారు. మరమగ్గాల ఉత్పత్తులను చేనేత వస్త్రాలుగా ఇంటా, బయటా చలామణి చేస్తున్నారు. తగినంతమంది సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేందుకూ, కఠినమైన చర్యలకు ఉపక్రమించేందుకూ కదలకపోగా ఆ చట్టానికే ఎసరు పెట్టే ఆలోచనలు చేయడం ఆందోళన కలిగించే అంశం. వారంక్రితం పార్లమెంటులో ఈ అంశం ప్రస్తావనకొచ్చాక చేనేత చట్టాన్ని రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మాట వాస్తవమైనా సాగుతున్న పరిణామాలు భరోసానిచ్చేవిగా లేవు. ఈనాటికీ వ్యవసాయం తర్వాత మన దేశంలో అత్యధిక జనాభాకు ఆసరాగా నిలుస్తున్నదీ, ఆదుకుంటున్నదీ చేనేత రంగమే. చేనేత యూనిట్లలో ఇప్పటికీ 87 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కోటిన్నరమందికి పైగా జనం ఆ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత కార్మికుల్లో 75 శాతంమంది మహిళలు. ఈ గణాంకాలన్నీ చేనేత రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. మహిళలకొచ్చే ఆదాయం మొత్తం కుటుంబం కోసం, మరీ ముఖ్యంగా పిల్లల సంక్షేమం కోసం ఖర్చవుతుందనే వాస్తవాన్ని తెలుసుకుంటే చేనేత రంగాన్ని ప్రోత్సహించడం సామాజిక ప్రగతికి, వికాసానికి ఎంతగా దోహదం చేస్తుందో అర్థమవుతుంది. పెట్టుబడుల అవసరం పెరిగి, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువై, దిగుబడులకు గిట్టుబాటు ధరలు రాక...వ్యవసాయ రంగంనుంచి నిష్ర్కమిస్తున్నవారి శాతం పెరుగుతుంటే దానికి సమాంతరంగా చేనేత రంగం మూగగా రోదిస్తోంది. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ‘సబ్ కా సాథ్... సబ్ కా వికాస్’ అని నినదించినప్పుడు అందరూ సంతోషించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘మేకిన్ ఇండియా’ ఎందరిలోనో ఆశలు రేపింది. కానీ, చేనేత రంగానికి ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన రూ. 446.60 కోట్ల మొత్తాన్ని చూసి అందరూ నీరసించారు. నిరుటి బడ్జెట్‌తో పోలిస్తే ఈ కేటాయింపులు 21 శాతం తక్కువ! ఎన్డీయే సర్కారు మాత్రమే కాదు...అంతక్రితం పాలించిన యూపీఏ ప్రభుత్వం సైతం చేనేతను చిన్నచూపు చూసింది. చేనేత రుణాల మాఫీకి రూ. 6,800 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ఆ ప్రభుత్వం 2012-13 బడ్జెట్లో అందుకు కేటాయించిన మొత్తం రూ. 2,205 కోట్లు. తీరా ఖర్చు చూస్తే రూ. 291 కోట్లు దాటలేదు. చేనేత రంగానికి తక్కువ వడ్డీ రేట్లతో అప్పులిచ్చి ఆదుకునే నాబార్డ్ గణనీయంగా కోతపెట్టడంతో నేతన్నలు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సివచ్చింది. ముఖ్యమైన ముడి సరుకులు పత్తి నూలు, పట్టు నూలు, రంగులు, రసాయనాల ధరలు గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయి. నకిలీ చేనేత ఉత్పత్తులు రంగంలోకొచ్చి దారుణంగా దెబ్బతీశాయి. ఇన్నిటిమధ్య మన చేనేత రంగం 2013-14లో రూ. 2,812 కోట్ల ఎగుమతులు చేసి మన ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చింది. ఇప్పటికి 11 రకాల ఉత్పత్తులను మాత్రమే చేనేత రంగానికి రిజర్వ్ చేసిన 1985నాటి చట్టాన్ని ఇంకా కుదించాలని మరమగ్గాల లాబీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. క్రితం నెలలో మరమగ్గాల యాజమాన్య సంఘాలు చీరెలు, లుంగీలను చేనేత చట్టంనుంచి తొలగించాలని డిమాండ్ చేయడం, ఈ నెలలో అందుకు సంబంధించిన అంశాలను చర్చించడం కోసం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తించింది. ఈ సమావేశానికి 20మందినే ఆహ్వానించడం, అందులో అత్యధికులు మరమగ్గాల రంగానికి చెందినవారు కావడం ఈ అనుమానాలను మరింతగా పెంచింది. మరమగ్గాలవారికి మేలుచేసేలా ‘చేనేత’ పదానికున్న నిర్వచనాన్నే మార్చేయడానికి మూడేళ్లక్రితం ఓ ప్రయత్నం జరిగింది. ఇప్పుడు సైతం అలాంటిదేమైనా ఉంటుందన్నదే ఆ రంగంలోనివారి ఆందోళన. చేనేత రంగానికి ముప్పు కలిగించే ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని, చేనేత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించడం బాగానే ఉన్నా అందుకు అనుగుణమైన ఆచరణ కనబడాలి. ముఖ్యంగా చేనేత రంగం అభివృద్ధి కోసం గతంలో నియమించిన శివరామన్, ఆబిద్ హుసేన్, మీరా సేఠ్ కమిటీల నివేదికల దుమ్ము దులిపి ఆ రంగం సముద్ధరణకు ఏమేమి చర్యలు అవసరమో గుర్తించాలి. ఇప్పటికీ అంతర్జాతీయంగా ఎంతో గిరాకి ఉన్న మన చేనేత ఉత్పత్తులకు రక్షణగా నిలిస్తేనే...ఆదుకుంటేనే ‘మేకిన్ ఇండియా’కు సార్థకత చేకూరుతుందని ఎన్డీయే సర్కారు గ్రహించాలి. -
జెన్నీ-మార్క్స్‌ల కథ
స్కూల్లో ఉన్నప్పుడు ‘ఏ వృత్తిని ఎంచుకోవాలి?‘ అనే అంశం మీద ఒక వ్యాసం రాశాడు కార్ల్ మార్క్స్. ఇదీ అందులోని సారాంశం: ‘మానవజాతి కల్యాణానికీ వ్యక్తి పరిపూర్ణతకూ దోహదం చేసేదిగా ఉండాలి వృత్తి. పరుల బాగు కోసం కృషి చేయడంలోనే వ్యక్తి కూడా బాగు పడతాడు. కేవలం తన ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తే అతడు గొప్ప పండితుడిగానో కవిగానో పేరు తెచ్చుకోవచ్చుగాని పరిపూర్ణత మాత్రం సాధించలేడు’... ఇది చదివి ఒక బేరన్ కూతురు జెన్నీ- మార్క్స్‌తో ప్రేమలో పడింది. తన కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుని అనేక సంవత్సరాలు నిరీక్షించి తనకన్నా నాలుగేళ్లు చిన్నవాడైన కార్ల్‌ను పెళ్లాడింది. అంతే. హనీమూన్ తర్వాత ప్రారంభమయ్యాయి ఆమె కష్టాలు. జీవితమంతా ఆశ నిరాశల ఊగిసలాటగానే గడిచింది. రాజకీయ కారణాల వల్ల బహిష్కరింపబడి యూరప్‌లో దేశం నుంచి దేశానికి తిరుగుతూ కాందిశీకుల్లాగా, శరణార్థుల్లాగా గడిపారు. ఎప్పుడూ రోజు ఎలా గడుస్తుందన్న బెంగే. 1851లో మార్క్స్ ‘పెట్టుబడి’ రచనకు అంకురార్పణ చేసేనాటికే (ఐదు వారాల్లో రచన పూర్తవుతుందన్నాడు) మంచి భోజనమూ కనీస వసతులూ లేక ఇద్దరు పిల్లలు మరణించారు. శవపేటిక కొనడానికి డబ్బుల్లేక రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లో పెట్టుకొని గడిపారు. అవసరానికి వస్తువులు తాకట్టు పెట్టడం అలవాటు చేసుకుంది జెన్నీ. వెండి వస్తువులతో ప్రారంభమై చివరికి కోట్లు, బూట్లు కూడా తాకట్టు పెట్టవలసిన స్థితి వచ్చింది. వీధి పిల్లలతో కలిసి కొడుకు దొంగతనాలు నేర్చుకున్నాడు. కాని దారిద్య్రం దారి దారిద్య్రానిది, మార్క్స్ దారి మార్క్స్‌ది. తిండి ఉన్నా లేకపోయినా ఇంట్లో ఎవరేమైపోయినా రోజూ బ్రిటిష్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. అక్కడి జి-7 టేబుల్ వద్ద అధ్యయనం కొనసాగాల్సిందే. అలా పదహారేళ్ల పాటు కొనసాగింది పరిశోధన. కాని అపరిశుభ్రత వల్లా సరైన ఆహారం తినకపోవడం వల్లా మార్క్స్‌ను తరచూ అనారోగ్యం బాధించింది. ఒంటి నిండా కురుపులు. కాలేయ సమస్యలు. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అలా విశ్రాంతి అవసరమైన ప్రతిసారీ ఆయన డేనిష్ భాష నేర్చుకుంటూ డిఫరెన్షియల్ కాల్క్యులస్ గురించి తెలుసుకుంటూ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ‘విశ్రాంతి’ తీసుకున్నాడు. ఇన్ని సమస్యలతోనూ మార్క్స్ ఇంకా తన అధ్యయనం కొనసాగించగలిగాడంటే అందుక్కారణం ఎంగెల్స్. మాంచెస్టర్‌లో తండ్రి జౌళి మిల్లు వ్యవహారాలు చూస్తున్న ఆ ఆప్తమిత్రుడు ఆయనను ప్రతిసారీ ఆదుకున్నాడు. రాసిన ప్రతి ఉత్తరంలో ఒకటో రెండో పౌండ్లు జత చేసి పంపాడు. అలా ‘పెట్టుబడి’ రచన పదహారేళ్లు కొనసాగింది. ఈలోగా మార్క్స్ ఎంగెల్స్‌తో కలిసి ‘ది హోలీ ఫ్యామిలీ’తో ప్రారంభించి అనేక పుస్తకాలు రాశాడు. ప్రతిసారీ ఎవరైనా ప్రచురించకపోతారా ఎంతోకొంత డబ్బు రాకపోతుందా అని ఆశ. ఆ పని జరగలేదు. పైగా సొంతగా వేసుకుంటే అమ్ముడుపోలేదు. చివరకు రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడుగాని ఆయన దస్తూరి అర్థంగాక అదీ రాలేదు. ఈ ప్రయాణంలోని అన్ని కష్టాలనూ అవమానాలనూ జెన్ని నిశ్శబ్దంగా భరించింది. పీడిత జనుల విముక్తికి జీవితం అంకితం చేసిన కారణజన్ముడు ఆమె భర్త. అతనికి అండగా నిలవాలని పెళ్లికి ముందే నిర్ణయించుకుంది. అతడి నుంచి సుఖవిలాసాలు కాదు కేవలం ప్రేమ కోరుకుంది. కాని అక్కడా ఆమెకు ద్రోహమే ఎదురైంది. తాను హాలెండ్ వెళ్లి వచ్చేసరికి ఇంట్లో తన బాల్యం నుంచి ఉంటున్న ఆయా- తన కంటే ఆరేళ్లు చిన్నది- అందరూ ఆమెను లెంచెన్ అని పిలుస్తారు (అసలు పేరు హెలెన్ డిమూత్)- గర్భం దాల్చింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఈలోగా ఎంగెల్స్ వచ్చి బాధ్యత తనదేనన్నాడు. మార్క్స్‌కూ ఎంగెల్స్కూ కుదిరిన ఒప్పందం అది. చివరకి ‘పెట్టుబడి’ 1867లో ప్రచురితమైనా తొలిరోజుల్లో అత్యంత నిరాదరణకు గురైంది. ‘దీన్ని రాయడానికి నేను కాల్చిన సిగార్ల ఖర్చు కూడా రాలేదు’ అన్నాడు మార్క్స్. ఈలోగా జెన్నీ ఏడుగురిని కని ముగ్గురిని నేలతల్లికి సమర్పించుకుంది. మిగతా ముగ్గురు కూతుళ్లు దుర్భర దారిద్య్రంలో పెరిగారు. ఒకప్పుడు అద్భుత సౌందర్యవతిగా పేరొందిన జెన్ని రోగాలతో రొష్టులతో పోషణలేక ఎండు బెరడులా తయారైంది. తోడుగా మశూచి కాటు. అయితే తన కూతుళ్ల జీవిత విషాదాన్ని పూర్తిగా చూడకుండానే కళ్లు మూసింది జెన్నీ. ఆ ముగ్గురిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మార్క్స్ చివరి రోజులు మరింత విషాదభరితంగా గడిచాయి. జెన్నీ మరణించాక ఆరోగ్యం పాడైంది. పుస్తకాలు కాదుగదా పేపర్లు కూడా చదవడం మానేశాడు. 1883 మార్చి 14 నాడు మరణించాడు మార్క్స్. 1917లో ఆయన ఆశించిన సోషలిస్టు విప్లవం రష్యాలో విజయవంతమైనప్పుడు చూడటానికి ఆయన పిల్లలెవరూ బతికి లేరు హెలెన్ డిమూత్ కుమారుడు ఫ్రెడ్డీ తప్ప. అతడు కూడా లండన్‌లోనే చివరిదాకా ఉన్నాడు. - ముక్తవరం పార్థసారథి 9177618708 (మార్క్స్ కుటుంబ జీవితం గురించి రాయిటర్స్‌లో రెండు దశాబ్దాలు పని చేసిన మేరీ గేబ్రియల్ ‘లవ్ అండ్ కాపిటల్’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఈ వ్యాసానికి ఆధారం ఆ పుస్తకంలోని సమాచారమే) -
సమాజాన్ని తీర్చిదిద్దేది కుటుంబమే!
కుటుంబం ప్రేమను పంచిపెట్టే విలువల కేంద్రం. కాలంతోపాటుగా మారే విలువలకు అనుగుణంగానే కుటుంబ బండి నడుస్తుంది. కారల్‌మార్క్స్ నుంచి గాంధీ వరకు ప్రపంచ ప్రముఖుల జీవితాలను చూస్తే, తమ పిల్లలు, భార్యపట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం తెలుస్తుంది. వాళ్ల మానవీయ కోణాలు అర్థమవుతాయి. చరిత్రను సృష్టించేది సామాన్యులే. మనిషి భూ మ్మీదపడి ఎరుక మొదలైన దగ్గర నుంచి విలువలతో జీవించటం ఉన్నతమై నది. ఎలా జీవించాలనేది ఎవరికివాళ్లు స్వతంత్రంగా తయారు చేసుకునే జీవిత పాఠం. దీనికి సిలబస్ నివసించే ప్రదేశం, ప్రధానంగా ఇల్లే. ఇల్లు చూస్తే వ్యక్తిగతంగా కనిపిస్తుంది కానీ ఇల్లు సామాజికాం శంలో అత్యంత ముఖ్యమైనది. ఎదుటివాళ్లపై విమర్శలు చేసేటప్పుడు ఫలానా వ్యక్తి తన కుటుంబం తాను చూసుకున్నాడు కానీ సమాజాన్ని ఏం పట్టిం చుకున్నాడని ధ్వజమెత్తుతారు. దీన్ని విశ్లేషించేటప్పుడు అది పూర్తిగా వాళ్ల సొంత కుటుంబ వ్యవహా రంగానే చూస్తారు. కానీ సమాజంలో సహజీవనం చేస్తున్న కుటుంబం లేదా ఆ కుటుంబ సభ్యులు సమాజానికి ఏమీ చేయకపోయినా బాధలేదు. కానీ నష్టం చేసే పని చేయకూడదు. కుటుంబం తీర్చిది ద్దుకోవటానికి కావాల్సిన విలువలను మాత్రం సమాజం అందివ్వాలి. అప్పుడు కుటుంబాలలో నుం చి పొదుగుకొచ్చే విలువలు ఆ సమాజానికి రక్షగా ఉంటాయి. ఇందుకు పెద్ద తాత్త్విక చింతనలు, సిద్ధాంతాలు అక్కర్లేదు కానీ ఆ సమాజం తాలూకు మంచి విషయాలను మాత్రం జాగ్రత్తగా గమనించా లి. ఆ సమాజం అందించే విలువల తాలూకు మా ర్పులే సమాజ పరిణామక్రమాలుగా మారుతాయి. ఇటీవలే మా కవి మిత్రుడు బెల్లియాదయ్య తండ్రి సాయిలు పరమపదించిన సందర్భంగా నల్లగొండ జిల్లా నక్రేకల్ దగ్గర పాలెం గ్రామానికి వెళ్లాం. ఆయనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధిం చిన గుర్తింపూ లేదు. ఆస్తిపాస్తులు అంతగా లేవు. కోటానుకోట్ల పేదలలో ఆయనొక సాధారణ మనిషి. కానీ విలువలున్న మంచి మనిషని అక్కడి కొచ్చిన వాళ్లంతా ఆయన గురించి చెప్పుకున్నారు. ఆయన గడిపిన పూర్ణ జీవితం కుటుంబ విలువలలో సామాన్యుల జీవన తాత్వికతను అచ్చంగా ప్రతిఫ లించింది. సాయిలు ఏమీలేని తనం నుంచి రెక్కల కష్టం మీదనే ఆధారపడి జీవించాడు. గొర్రెలను మళ్లించిన వాళ్లంతా క్రీస్తులు కారు. సాయిలు మా త్రం కుటుంబ పోషణకు గొర్రెలు కాశాడు. భూమి కౌలుకు తీసుకున్నాడు. దుక్కిదున్నాడు. తన నలు గురు కొడుకుల్ని జీవితంలో నిలబెట్టాడు. తన బిడ్డలకు మానవీయ విలువలను నేర్పాడు. వాటిని కూడా బోధనల ద్వారా కాకుండా ఆచరణాత్మకంగా ఆచరించి మరీ చూపాడు. సాయిలు ఇల్లు గుడిసె కావచ్చును కానీ దాన్ని మానవీయ విలువలు పొది గిన నిలయంగా మార్చాడు. తన తండ్రి తన తల్లితో ఏనాడు అమర్యాదగా వ్యవహరించలేదని బెల్లి యాదయ్య గుర్తు చేసుకున్నాడు. అనురాగాలను పంచుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసుకుం టూ పోయిన చిలకాగోరింకల గూడు అది. తన తండ్రి తల్లిని గౌరవించటం, ఆమె మాటలకు విలువనిచ్చి అన్యోన్యంగా కలిసిమెలసి జీవించే జీవ న నిర్మాణ సూత్రాలను ఆ కుటుంబం పాటించింది. ఇతరులను గౌరవించటం తోటి వారిపై ప్రేమ కలిగి ఉండడం, పక్కవారికి ఇబ్బంది కలుగకుండా ఎలా జీవించాలి? తదితర సామాజిక విలువలను, మానవీయ ఆలోచనలను ఎక్కువ భాగం కుటుం బం నుంచి నేర్చుకునే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. బెల్లి యాదయ్య ఆయన సోదరులు తన తండ్రి నుంచి వీటిని నేర్చుకున్నారు. ఆ కుటుంబం లో ఇద్దరు కొడుకులు వూర్లోనే వ్యవసాయం చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఇంకొక కొడుకు సైని కునిగా సైన్యంలో పని చేస్తున్నాడు. యాదయ్య తెలుగు ఆచార్యునిగా నిలిచాడు. ఆ కుటుంబాన్ని చూస్తే సామాజిక శాస్త్రంలోని ఒక అధ్యాయంను చదివినట్లయ్యింది. కుటుంబాన్ని తన చేతులతో పెంచి పెద్ద చేసిన మనిషి అంతర్థానం అయినప్పు డు దుఃఖమొక్కటే తోడుగా ఉంటుంది. అందు లోంచి అంతర్థానమైన మనిషి ఒక తలపోతగా జీవి స్తాడు. ఆ తలపోతలతో మళ్లీ జీవనయానం మొద లవుతుంది. ఇదే జీవన ప్రస్థానంగా కొనసాగు తుంది. సాయిలు లాంటి వ్యక్తుల జీవితాలే మానవీయ విలువలుగా విరబూస్తాయి. చర్రిత తన చుట్టూ తా ను తిరుగుతూ సామాన్యుల చుట్టూ తిరుగు తుంది. కుటుంబం ప్రేమను పంచిపెట్టే విలువల కేంద్రం. కాలంతోపాటుగా మారే విలువలకు అను గుణంగానే కుటుంబ బండి నడుస్తుంది. కారల్ మార్క్స్ నుంచి గాంధీ వరకు ప్రపంచ ప్రముఖుల జీవితాలను చూస్తే, తమ పిల్లలు, భార్యపట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం తెలుస్తుంది. వాళ్ల మానవీ య కోణాలు అర్థమవుతాయి. ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన సామాజిక సం బంధాలు మానవీయ సంబంధాలను శక్తివంతంగా ప్రతిష్టించాయి. కుటుంబంలో నాటే సమానత్వపు ఆలోచనలు, విలువలే సమాజంలో ప్రతిఫలిస్తుం టాయి. ఉత్పత్తి కులం నుంచి వచ్చిన సాయిలు కుటుంబం చూస్తే అది మానవీయ విలువలను ప్రతిష్టించింది. కుటుంబంలోని సామూహిక ప్రజా స్వామ్యం కాలాన్ని బట్టి మార్పుకు గురవుతుంది. సమష్టి ఆలోచనలు, సమష్టి విలువలు సంఘర్షణకు గురవుతున్నాయి. సామాజిక సంబంధాలకు సంబం ధించిన మార్పులు కుటుంబం నుంచే జరగాలి. సామాజిక మార్పుతోనే రాజ్యంలో కూడా మార్పులు సంభవిస్తాయి. వ్యక్తి నుంచి కుటుంబం పరివర్తన చెందటం సామాజిక మూలాల నుంచే జరుగుతుంది. సమాజంలోని మూలాలే మానవీయ సంబంధాలను ప్రతిఫలిస్తాయి. మనం ఎంత కాద నుకున్నా ఇప్పుడు మార్కెట్ సమాజంలో ఉన్నాం. దాని ప్రభావం కుటుంబాలపై తీవ్రంగా పడుతుంది. ఇక్కడే ఉత్పత్తి కులాలకు చెందిన కుటుంబాలు సమాజానికి అందించిన విలువలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మన సమాజ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనావేసుకొని అర్థం చేసుకోగలుగుతాం. సమాజంతోపాటు మారే విలు వలు మానవీయ విలువలను కాపాడే విధంగా ఉ న్నాయోలేవో చూడాలి. సమున్నత వ్యవస్థల కోసం ప్రజాస్వామిక సమాజాలు ఎదురు చూస్తాయి. -వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు జూలూరు గౌరీశంకర్ -
కార్మిక సిద్ధాంతి
సంక్షిప్తంగా... కార్ల్ మార్క్స్ ‘‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’’. శ్రీశ్రీ కదా అన్నారీమాట. అవును 1938లో ఆయన రాసిన ‘దేశ చరిత్రలు’ కవితలో. బహుశా ఆయన కార్ల్‌మార్క్స్ నుంచి స్ఫూర్తి పొంది ఉండాలి. 1848లో మార్క్స్ రాసిన ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’లో తొలి వాక్యం కూడా ఇలాంటిదే. ‘‘ఇప్పటి వరకు నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్రే’’ అన్నారు మార్క్స్. మ్యానిఫెస్టో ముగింపు వాక్యం కూడా మనం చాలాసార్లు విన్నదే! ‘‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’’. ఇదీ శ్రీశ్రీ నినాదంలా ఉంటుంది కానీ, నిజానికి మార్క్స్ అందించిన విప్లవనాదం. మనకు శ్రీశ్రీ ఎలాగో, శ్రీశ్రీకి మార్క్స్ అలాగ! ఆమాట కొస్తే ప్రపంచంలోని ప్రతి విప్లవ ‘శ్రీశ్రీ’కి మార్క్సే స్ఫూర్తి ప్రదాత. నేడిది మార్క్స్‌ను తలచుకోవలసిన సందర్భం. 1883 మార్చి 14న తన 64వ యేట ఆయన మరణించారు. ఆయన మాత్రమే మరణించారు. ఎంగెల్స్‌తో కలిసి ఆయన రాసిన గ్రంథాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అవన్నీ కమ్యూనిస్టులకు వేదాల వంటివి. ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’ కమ్యూనిస్టులకు భగవద్గీత అయితే ‘దస్ క్యాపిటల్’ బైబిల్ వంటిది. మార్క్స, ఎంగెల్స్ ఇద్దరూ మంచి మిత్రులు, ఆలోచనాశీలురు. మార్క్స ప్రభావం ఎంగెల్స్పై ఎంతగా ఉండేదంటే ఎంగెల్స్ జీవితాంతం మార్క్స్ అనుచ రుడిగానే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే చూడండి. మార్క్సిజం ఉంది కానీ, ఏంగెలిజం లేదు. వాస్తవానికి ఏ ఇజాన్నైనా, ఏంగెలిజాన్నయినా తనలో కలుపుకునే శక్తి మార్క్సిజంలో ఉంది. అందుకే మార్క్స్ సైద్ధాంతికంగా బలవంతుడ య్యాడు. భౌతికంగా కూడా అతడు బలిష్టుడే. దృఢ కాయంతో, పెద్దగా ఛాయలేని శరీరంతో మొరటు మనిషిలా ఉండేవారట మార్క్స్! కార్ల్ హైరీచ్ మార్క్స్ 1818 మే 5న పశ్చిమ జర్మనీలోని ట్రియర్‌లో జన్మించారు. తండ్రి న్యాయవాది. కేసులైతే వచ్చేవి కానీ, డబ్బులు వచ్చేవి కాదు. అలా పేదరికంలో పెరిగిన మార్క్స్ తన భార్యాపిల్లలకూ పేదరికాన్నే వారసత్వంగా ఇవ్వగలిగారు. మార్క్స్ చదివింది కూడా న్యాయశాస్త్రమే. కానీ హెగెల్, ఫ్యూయర్‌బాక్‌ల సిద్ధాంతాలు ఆయన్ని ‘సోషల్ ఫిలాసఫీ’వైపు దారి మళ్లించాయి. 1841లో మార్క్స్ జెనా విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత 1843లో కొంతకాలం కొలోన్లోని ఒక ఉదారవాద వార్తాపత్రికకు సంపాదకత్వం వహించారు. అనంతరం భార్య జెన్నీతో కలిసి విప్లవభావాలకు నెలవై వున్న పారిస్‌ను చేరుకున్నారు. అక్కడే ఆయన అతివాద కమ్యూనిస్టుగా మారారు. ఆ క్రమంలోనే ఏంగె ల్స్తో ఆయనకు పరిచయం అయింది. మార్క్స్ భావజాలాన్ని ప్రమాదకరమైన ధోరణిగా భావించిన ఫ్రాన్సు అతడిని దేశం నుంచి బహిష్కరించింది. అక్కడి నుంచి మార్క్స్ బ్రస్సెల్స్ చేరుకున్నారు. తర్వాత 1849లో లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. చివరి దశలో మార్క్స్ అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎంగెల్సే మార్క్స్‌ని ఆదుకున్నాడు. 1881లో భార్య మర ణించాక మార్క్స్ బాగా కుంగిపో యారు. తర్వాత మళ్లీ కోలుకోలేదు. లండన్‌లో ఆయనకు అంత్యక్రియలు జరిపిస్తున్న సమయంలో ఎంగెల్స్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘ఈ మధ్యాహ్నం వేళ ఒక గొప్ప ఆలోచనాశీలి ఆలోచించడం మానేశాడు. మేము ఆయన చెంత లేని రెండు నిమిషాల్లోనే మా నుంచి సెలవు తీసుకున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషి, కూర్చున్నట్లుగానే ఈ లోకాన్ని వీడిపోయారు’’ అని గద్గదస్వరంతో అన్నారు. వర్తమానంలో మార్క్సిజానికి స్థానం లేనట్లు కనిపించవచ్చు. కానీ వర్తమానాన్ని ప్రభావితం చేసే ప్రతి ఇజంలోనూ మార్క్సిజం ఒక పునాది రాయిగా తప్పక ఉంటుంది. -
మార్క్స్ నుంచి మార్స్ దాకా...
మహారాజుల పోషణలో ప్రబంధ సాహిత్యం కుప్పలు తెప్పలుగా పెరిగింది. తంజావూరు రాజుల కాలంలో ఎక్కడ విన్నా యక్షగానాలు వీనుల విందు చేశాయి. ఆస్థానాలు పచ్చగా ఉన్న రోజుల్లో అవధాన విద్య పురివిప్పి నాట్యమాడింది. గిరాకీని బట్టి ఉత్పత్తి అనే సూత్రం సాహిత్యానికి కూడా వర్తిస్తుందనిపిస్తుంది. అన్నమయ్య పద కవితలు, క్షేత్రయ్య పలుకులు, త్యాగయ్య కృతులు యిందుకు మినహాయింపు. వాళ్ల సమీకరణాలు ఇహలోక వ్యవహారాలు కావు, పరలోక బేరసారాలు. తెలుగులో సొంత ఆలోచనలు రెక్కలార్చింది ఆ మధ్యనే అంటే పదిహేను దశాబ్దాల క్రితమే. తెలుగువాడు హాయిగా తనని చూసి తాను నవ్వుకోవడం నేర్చింది కన్యాశుల్కంతోనే. గట్టిగా నూటపదహారేళ్లు! స్వాతంత్య్రోద్యమం అర్ధశతాబ్దిపాటు సాహిత్యాన్ని వీరంగం వేయించింది. కొందరు కవులు నిజంగా దేశభక్తితో రాస్తే కొందరు గిరాకీ ఉందని చలించారు. వీటితో పాటు గులాబీ అత్తర్లూ గుబాళించాయి. అంతరిస్తున్న అవశేషాలను తలచుకుంటూ సానిపాప కథలు వచ్చాయి. అప్పుడే ‘ఎలుతురంతా మేసి ఏరు నెరేసింది’. సరిగా నూరేళ్ల క్రితం తెలుగులో సాక్షి వ్యాసాలు శ్రీకారం చుట్టుకున్నాయి. వేయి పడగలు, నారాయణరావు సాంఘిక నవలలు వందేళ్ల తెలుగువాడి జీవితాదర్శం అన్నారు కొందరు. అది వారి వారి స్వీయచరిత్రలకు నవలీకరణగా విశ్లేషించారు ఇంకొందరు. వాటి ప్రభావమే ఆ తరువాత ఊడిపడిన ‘లోపలి మనిషి’. గయోపాఖ్యానమనే ప్రచండ యాదవం. పాండవోద్యోగ విజయాలు; పడక సీను; అయినను పోయిరావలె హస్తినకు... యివన్నీ తెలుగువారి గుండెల మీద పచ్చబొట్లుగా మద్రపడ్డాయి స్వాతంత్రానికి ముందే. గరుడ పక్షి ఆర్భాటాలకు దీటుగా వచ్చి, అందర్నీ తేరిపార చూసేలా చేసిందొంక గబ్బిలం. సమాజానికి ఒక కొత్త చూపు ప్రసాదించింది. భావకవిత్వం, దాని తాలూకు వేషభాషా విలాస విన్యాసాలు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయాయి. కమ్యూనిస్టు మానిఫెస్టో కవిత్వీకరించుకుని వరదలా వచ్చి పడింది. దాని పేరు మహాప్రస్థానం. ఈ దశాబ్దం నాది అంటూ మహాప్రస్థాన కవి క్లెయిమ్ చేసుకున్నాడు. మరైతే ఈ దశాబ్దం కవిత్వాలకే పరిమితం అయితే మిగతా ఆవిర్భావాల మాటేంటని ఎవరూ అడగలేదు. ఉదాసీనత తెలుగువాడి నైజగుణం. పాప్యులర్ లిటరేచర్ అంటే కథలు, నవలలు, స్కెచ్‌లు ఒక్కసారి వచ్చిపడ్డాయ్. సాంఘిక నాటకాలు అందులో ఒక పద్ధతిలో పరిషత్తు నాటకాలు తెరకెక్కాయి. తెలుగు సినిమాలు ఆదర్శాలను మూటకడుతూ, పౌరాణిక సాంఘిక నాటకాలను అనుసరిస్తూ నడుస్తున్నాయి నాటికీ నేటికీ. ‘కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం- రెప్పపాటే ఈ జీవితం’లాంటి మినీ కవితలు కొన్నాళ్లు ఒక వూపు ఊపాయి. తరువాత అతి పాప్యులర్ లిటరేచర్ సీసాలోంచి దయ్యంలా వచ్చి ఆవరించింది. ఇండిపెండెన్స్ తరువాత భారతి సాహిత్యం పడిపోయి ఆంధ్రవారపత్రిక అందుకుంది. వేళ్లు లేని రకరకాల సాహిత్య ధోరణులు బంగారు తీగెలా బదనికల్లా అల్లుకుని పెరిగాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నది నిజమని మరోసారి రుజువైంది. వీటితో పాటు సామాజిక స్పృహ ముఖ్య దినుసుగా ఒక కెరటం ఆవహించింది. కాదన్నవారిని కాల్చేస్తామని బుజ్జగించారు. ఆ సీజన్లో కన్వర్షన్స్ జోరుగా జరిగాయి. ఆ స్పృహ కొడిగడుతున్న వేళ ప్రపంచీకరణ తారాజువ్వలా ఎగసింది. ఈ కొత్తవింతను ఉద్యమస్ఫూర్తితో సాహిత్యకారులు అంది పుచ్చుకున్నారు. నూతన సహస్రాబ్ది సాఫ్ట్‌వేర్‌కీ సాహిత్యకారులకూ గొప్ప గిరాకీ తెచ్చింది. లిటరేచర్‌లోని అన్ని ప్రక్రియలనీ ప్రపంచీకరణలోనే పండించారు సత్కవులు. ఇప్పుడు అదీ సద్దుమణిగింది. ఈ ఫ్లాష్‌బ్యాక్ సరే, భవిష్యత్వాణి ఎలా ఉంటుంది? ‘మార్క్స్ నించి మార్స్ దాకా’ కథనాన్ని చెబుతారెవరో. - శ్రీ రమణ