వివక్ష, అణచివేత, అసమానతల మూలాలను ఆర్థికరంగంతో ముడిపెట్టి.. దోపిడీ గుట్టువిప్పినవాడు కార్ల్‌మార్క్స్. అన్ని చర్యలకూ మూలాలు ఆర్థిక అంశాలే కారణమన్న ఆయన సిద్ధాంతాలు ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. అలాంటి కార్ల్‌మార్క్స్ స్వయంగా రాసిన ‘దాస్ కాపిటల్’ రాతప్రతిలోని ఒక పేజీ ఏకంగా 5,23,000 డాలర్లు (సుమారు మూడున్నర కోట్ల రూపాయలు) పలికింది.
మార్క్స్ ద్విశతాబ్ది జయంత్యుత్సవాల సందర్భంగా ఈనెల 3న చైనాలోని బీజింగ్‌లో ఈ రాతప్రతిని వేలం వేశారు. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య లండన్‌లో దాస్ కాపిటల్ కోసం మార్క్స్ తయారుచేసుకున్న 1,250 పేజీల రాత ప్రతిలోనిదే ఆ పేజీ అని చెబుతున్నారు. చైనాకు చెందిన ఫెంగ్‌లుంగ్ అనే వ్యాపారవేత్త ఈ వేలం వేశారు. ఇందులో కార్ల్‌మార్క్స్ సహచరుడు, కమ్యూనిస్టు మేనిఫెస్టో పుస్తక సహ రచయిత ఫ్రెడరిక్ ఏంగెల్స్‌కు సంబంధించిన రాత ప్రతిని కూడా వేలం వేయగా.. అది రూ.1.67 కోట్లు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment