భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక‍్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్‌హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు.
ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఇదీ చదవండి: పాకిస్థాన్‌కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment