Queries
-
పేటీఎంతో శాలరీ లింక్.. రకరకాల ప్రశ్నలు.. అన్నింటికీ క్లారిటీ ఇదిగో..
పేటీఎం ( Paytm )పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో లక్షలాది యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. రకరకాల సందేహాలు వారిని వేధిస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానంగా.. యూజర్లకు సహాయకరంగా స్పష్టత ఇచ్చేందుకు ఆర్బీఐ తాజాగా తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) సమగ్ర సెట్‌ను ప్రచురించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై జనవరి 31న ఆర్బీఐ నిషేధాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి వీల్లేదంటూ ఆదేశించింది. అయితే అన్ని లావాదేవీలను నిలిపివేసే గడువును మార్చి 15 వరకు పొడిగించడం ద్వారా వ్యాపారాలకు కొంత ఊరటను అందించింది. ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తర్వాత ఏం జరుగుతుంది.. ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి ఇలాంటి 30 ప్రశ్నలపై సెంట్రల్ బ్యాంక్ ఎఫ్ఏక్యూ సమగ్ర సెట్‌ను ప్రచురించింది. ఈ ఎఫ్ఏక్యూ పత్రం వాటాదారుల అన్ని ఆందోళనలను పరిష్కరించడానికి ఉద్దేశించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. పేటీఎంపై ఆర్బీఐ ఎఫ్ఏక్యూ సెట్లోని కొన్ని ప్రశ్నలు.. కరెంట్, సేవింగ్స్ ఖాతాదారుల పరిస్థితి ఏంటి? ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాదారులు 2024 మార్చి 15 తర్వాత ఈ ఖాతా నుంచి నిధులను విత్‌డ్రా చేయడం లేదా బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మీ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు నిధులను ఉపసంహరించుకోవడానికి లేదా బదిలీ చేయడానికి డెబిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని మీ ఖాతాలో డబ్బును జమ చేయలేరు. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామ్య బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్ లేదా రీఫండ్లు మినహా ఇతర క్రెడిట్లు లేదా డిపాజిట్లు క్రెడిట్ చేయడానికి వీల్లేదు. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో రీఫండ్? అవును.. రీఫండ్లు, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామి బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్లు లేదా వడ్డీలు మార్చి 15 తర్వాత కూడా మీ ఖాతాలోకి క్రెడిట్ అయ్యేందుకు అనుమతి ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో జీతం, ఈఎంఐ లింక్ అయితే ఎలా? మార్చి 15 తర్వాత, వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి ఎలాంటి జీతం క్రెడిట్లను పొందలేరు. అసౌకర్యాన్ని నివారించడానికి మీరు మార్చి 15 లోపు మరొక బ్యాంకుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్, విద్యుత్ బిల్లులు, రివార్డ్‌లు? మీ ఖాతాలో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు ఆటోమేటిక్ యూపీఐ మ్యాండేట్ ద్వారా ఉపసంహరణ/డెబిట్‌కు వీలుంటుంది. అయితే మార్చి 15 తర్వాత మీ ఖాతాల్లో క్రెడిట్ లేదా డిపాజిట్ అనుమతించబడదు. అసౌకర్యం లేదా అంతరాయాన్ని నివారించడానికి మార్చి 15 లోపు మరొక బ్యాంకు ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ లేదా డీబీటీ? మార్చి 15 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో మీ ఖాతాలోకి అలాంటి క్రెడిట్‌ను స్వీకరించలేరు. ఏదైనా అసౌకర్యం లేదా అంతరాయాన్ని నివారించడానికి దయచేసి మార్చి 15 లోపు మీ లింక్ చేయబడిన ఖాతాను మరొక బ్యాంకుకు మార్చడానికి ఏర్పాట్లు చేసుకోండి పేటీఎం వాలెట్ గురించి? వినియోగదారులు వాలెట్లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు ఉపయోగించడం, ఉపసంహరించుకోవడం లేదా మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం కొనసాగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే మార్చి 15 తర్వాత వినియోగదారులు ఈ వాలెట్‌లోకి క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్లు కాకుండా మరే ఇతర క్రెడిట్లను టాప్-అప్ చేయలేరు లేదా వాలెట్‌లోకి బదిలీ చేయలేరు. -
ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..
భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు. ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదీ చదవండి: పాకిస్థాన్‌కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత.. -
హమ్మయ్యా.. డాక్టర్లు ప్రిస్కిప్షన్‌లో ఏం రాశారో ఇట్టే తెలుసుకోవచ్చు!
మీరెప్పుడైనా డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్ (మందుల చీటి) తీక్షణంగా చూశారా? చూస్తే మీకేమైనా అర్థం అయిందా? అర్థం కాదు. ఎందుకంటే డాక్టర్లు రాసిన మందుల చీటీపై ఉన్న రాత గీతల మాదిగానూ, ఏదో వేరే బాషలా ఉంటుంది. అది కేవలం డాక్టర్లకు, మందుల షాపుల్లోని ఫార్మాసిస్టులకు మాత్రమే అర్థమవుతుంది. అయితే ఆ సమస్యను పరిష్కరించేలా గూగుల్ అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ భారత్‌లో ‘గూగుల్ ఫర్ ఇండియా -2022’ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను డిజిటలైజ్ చేయడం, మల్టీ సెర్చ్ ఫంక్షనాలిటీ అంటే యూజర్లు ఫోటోలు, స్క్రీన్షాట్లను తీసుకోవడంతో పాటు వారికి తలెత్తిన అనుమానాల్ని ప్రశ్నల్ని సంధించడం కోసం టెక్ట్స్‌ను జోడించేందుకు అనుమతి ఇస్తుంది. సెర్చ్ ఇన్ వీడియో ఫోన్లలో సెర్చ్ యాప్ ద్వారా వీడియోలకోసం సెర్చ్ చేసేలా 'సెర్చ్ ఇన్ వీడియో' ఫీచర్‌ను ఈవెంట్లో గూగుల్ ప్రదర్శించింది. అదే సమయంలో, ఆండ్రాయిడ్‌లోని ఫైల్స్ బై గూగుల్ యాప్ ద్వారా డిజిలాకర్ డాక్యుమెంట్లను సురక్షితంగా యాక్సెస్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది. ప్రిస్క్రిప్షన్‌తో గూగుల్ ఏం చేస్తోంది? గూగుల్ సంస్థ చేతితో వ్రాసిన ప్రిస్క్రిప్షన్లను చదవగలిగే ఏఐ,మెషిన్ లెర్నింగ్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. మెడికల్ ప్రిస్క్రిప్షన్లు చదవడం చాలా కష్టం. అందుకే డాక్టర్లు చేతితో వ్రాసిన ప్రిస్క్రిప్షన్ డిజిటలైజ్ చేయనున్నట్లు పేర్కొంది. అంటే డాక్టర్లు చేతితో రాసిన ప్రిస్క్రిప్షన్‌ను యూజర్లు గూగుల్‌లో అప్లోడ్ చేసి.. ఆ మందుల చీటీల్లో డాక్టర్ ఏం రాశారు? ఏ మందులు రాశారా? ఏ కారణం వల్ల అనారోగ్య సమస్య తలెత్తిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ టెక్నాలజీ వినియోగ వచ్చిన అందించిన ఫలితాల ఆధారంగా ఫీచర్‌ను పరిచయం చేస్తామని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని కంపెనీ తెలిపింది. కాగా, ఆ ఫీచర్‌ను ప్రస్తుతం డెవలప్ చేస్తున్నట్లు చెప్పింది. స్థానిక భాషల్లో సమాచారం గూగుల్‌లో సెర్చ్ చేసే సౌకర్యాన్ని స్థానిక భాషల్లో సైతం అందుబాటులోకి తేనుంది. ముఖ్యంగా గూగుల్‌లో వాయిస్ ద్వారా ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఇంగ్లీష్, హిందీ వచ్చి ఉండాలి. కానీ ఇకపై స్థానిక భాష తెలుగు, తమిళం,కన్నడ వాయిస్‌లతో కావాల్సిన సమాచారం పొందవచ్చు. మల్టీ సెర్చ్ మల్టీ సెర్చ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ సాయంతో మీకు ఏదైనా ప్రొడక్ట్ సమాచారం కావాలంటే సులభంగా తెలుసుకోవచ్చు. మీరు స్నేహితులు, లేదంటే చుట్టాలింటికి వెళ్లినప్పుడు అక్కడ మీకు నచ్చిన కర్టెన్లు , కార్పెట్లు, లేదంటే డ్రస్‌లు ఉంటే వాటిని ఫోటోలు తీసి గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. ఉదాహరణకు..డ్రస్ ఫోటో తీసుకొని ‘గూగుల్ లెన్స్’ అనే ఫీచర్లో ఆ ఫోటోను అప్లోడ్ చేయాలి. పక్కనే డ్రస్ అని సెర్చ్ చేస్తే.. ఆ కలర్ డ్రస్‌తో ఉన్న దుస్తులు, అవి అమ్మే ఈకామర్స్ సైట్ల జాబితా మొత్తం కనిపిస్తుంది. -
నోటీసులకు స్పందించనివారిపై ఖచ్చితంగా చర్యలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్నుశాఖ నోటీసులకు స్పందించనివారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఫైనాన్స్ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదాయం ప్రొఫైల్‌ను సరిపోలని రద్దయిన నోట్ల డిపాజిట్లపై స్పందించని 9.29లక్షల ఖాతాదారులపై చర్యలుంటాయని చెప్పారు. 50రోజులు డిమానిటైజేషన్ కాలంలో 18లక్షల ఖాతాల్లో రద్దయిన పెద్దనోట్లను డిపాజిట్ అయ్యాయని ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానంగా జైట్లీ తెలిపారు. ఈ డాటా విశ్లేషణలో సీబీడీటీ, ఆదాయపన్నుశాఖ పరిశీలనలో ప్రాథమికంగా 18 లక్షల ఖాతాదారుల డిపాజిట్లు అనుమానాస్పదంగా తేలినట్టు చెప్పారు. వీరిని ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా వివరణకోరామనీ, అయితే 8.71 లక్షలమంది మాత్రమే స్పందించారని తెలిపారు. ఐటీ నోటీసులుకు స్పందించనివారిపై ఆదాయ పన్ను చట్టం ప్రకారం సంబంధిత చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి వెల్లడించారు. డిమానిటైజేషన్ కాలంలో జరిగిన మొత్తం డిపాజిట్లపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా నల్లధనాన్ని నిరోధించే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినోటును లెక్కిస్తోందని చెప్పారు. కచ్చితమైన ఫిగర్ వచ్చినప్పుడు, మొత్తం లెక్కలను వెల్లడిస్తుందని చెప్పారు.