నోటీసులకు స్పందించనివారిపై ఖచ్చితంగా చర్యలు | 9.29 Lakh Didn't Respond To Tax Department's Queries, Action Will Be Taken: Arun Jaitley | Sakshi
Sakshi News home page

నోటీసులకు స్పందించనివారిపై ఖచ్చితంగా చర్యలు

Published Wed, Mar 22 2017 8:24 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

నోటీసులకు స్పందించనివారిపై  ఖచ్చితంగా చర్యలు - Sakshi

నోటీసులకు స్పందించనివారిపై ఖచ్చితంగా చర్యలు

న్యూఢిల్లీ: ఆదాయ పన్నుశాఖ నోటీసులకు స్పందించనివారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు.  బుధవారం ఫైనాన్స్‌ బిల్లుపై  లోక్‌ సభలో చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదాయం ప్రొఫైల్ను సరిపోలని రద్దయిన నోట్ల డిపాజిట్లపై స్పందించని 9.29లక్షల ఖాతాదారులపై చర్యలుంటాయని  చెప్పారు.

50రోజులు డిమానిటైజేషన్‌ కాలంలో 18లక్షల  ఖాతాల్లో రద్దయిన పెద్దనోట్లను  డిపాజిట్‌  అయ్యాయని  ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానంగా జైట్లీ తెలిపారు. ఈ డాటా విశ్లేషణలో సీబీడీటీ, ఆదాయపన్నుశాఖ  పరిశీలనలో ప్రాథమికంగా 18 లక్షల ఖాతాదారుల  డిపాజిట్లు అనుమానాస్పదంగా తేలినట్టు చెప్పారు.  వీరిని ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ ద్వారా వివరణకోరామనీ, అయితే 8.71 లక్షలమంది మాత్రమే స్పందించారని తెలిపారు.  ఐటీ నోటీసులుకు స్పందించనివారిపై ఆదాయ పన్ను చట్టం ప్రకారం సంబంధిత చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి వెల్లడించారు.   

డిమానిటైజేషన్‌ కాలంలో  జరిగిన మొత్తం డిపాజిట్లపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా  నల్లధనాన్ని నిరోధించే క్రమంలో  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినోటును లెక్కిస్తోందని చెప్పారు.  కచ్చితమైన ఫిగర్ వచ్చినప్పుడు,  మొత్తం లెక్కలను  వెల్లడిస్తుందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement