Long overdue: Book returned Washington state library after 81 years - Sakshi
Sakshi News home page

81 ఏళ్లకు లైబ్రరీకి చేరిన పుస్తకం.. 17వ పేజీలో ఏమున్నదంటే..

Published Sun, Jun 11 2023 1:21 PM | Last Updated on Sun, Jun 11 2023 1:32 PM

book returned washington state library after 81 years - Sakshi

ఇటీవల ఒక లైబ్రరీకి ఎవరో ఒక పుస్తకాన్ని తీసుకురాగా అక్కడి స్టాఫ్‌ దానిని చూసి  అవాక్కయ్యారు. ఆ పుస్తకం 81 ఏళ్ల క్రితం ఇష్యూ చేసినది కావడం విశేషం. సిబ్బంది ఆ పుస్తకాన్ని తెరవగా, అక్కడున్న విచిత్రమైన మెసేజ్‌ చూసి తెగ ఆశ్చర్యపోయారు. 

పుస్తకప్రియులు లైబ్రరీలకు వెళుతుంటారు. కొందరు అక్కడే కూర్చుని చదువుకుంటారు. మరికొందరు పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లి చదువుకుంటారు. అయితే ఆ పుస్తకాలను రిటర్న్‌ చేసేందుకు కొంత గడువు ఉంటుంది. అది దాటితై ఫైన్‌ విధిస్తారు. ఇటువంటి సందర్భాల్లో కొందరు తాము తీసుకువెళ్లిన పుస్తకాలను తిరిగి లైబ్రరీలో అప్పగించరు.

ఇటీవల ​ఒక వ్యక్తి పుస్తకాన్ని తిరిగి ఇచ్చేందుకు లైబ్రరీకి వచ్చాడు. ఆ పుస్తకాన్ని చూసిన అక్కడ స్టాఫ్‌ ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకం 1942,మార్చి 30 నాడు ఇష్యూ చేసినది కావడం విశేషం. అంటే ఈ పుస్తకం 81 ఏళ్ల తరువాత తిరిగి లైబ్రరీకి చేరింది. ఈ ఉదంతం అమెరికాలోని వాషింగ్టన్‌లో గల ఎబర్డీన్‌లో  చోటుచేసుకుంది.

ఇది చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి!
పాత సామానులలో దొరికింది
లైబ్రరీ ప్రతినిధులు తమ ఫేస్‌బుక్‌ పేజీలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, చార్ల్స్‌ నార్డాఫ్‌ అండ్‌ జేమ్స్‌ నార్మన్‌ హాల్‌ రాసిన పుస్తకం ‘ది బౌంటీ ట్రిలాజీ’’ 81 ఏళ్ల తరువాత ఎబర్డీన్‌ టింబర్లాండ్‌ లైబ్రరీకి తిరిగి వచ్చింది. ఈ పుస్తకం పాత సామానుల మధ్య పడి ఉండగా లభ్యమయ్యిందని పేర్కొన్నారు. 
పేజీ నంబరు-17లో..
కిరో7 న్యూస్‌ రిపోర్టు ప్రకారం ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకున్న వ్యక్తి ఈ పుస్తకంలోని 17వ పేజీ వరకే చదివాడు. అతను పుస్తకంలో ఇలా ఒక నోట్‌ రాశాడు..‘‘ ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చిన పక్షంలో నేను ఈ పుస్తకాన్ని ఎప్పటికీ చదవను’’ అని రాసివుంది. దీని అర్థం ఏమిటంటే అ వ్యక్తికి ఈ పుస్తకం చదవడం అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది.
లేటు ఫీజు విధిస్తే..
లైబ్రరీ అధికారులను ఈ పుస్తకానికి ఒకవేళ లేటు ఫీజు విధిస్తే ఎంత ఉంటుందని అడగగా, సెలవురోజులు మినహాయించి మిగిలిన రోజులను పరిగణలోకి తీసుకుంటే రోజుకు రెండు సెంట్ల చొప్పున 1942 నాటి విలువను అనుసరించి ఇది 484 డాలర్లు(సుమారు రూ.40 వేలు) అవుతుంది. అయితే లైబ్రరీ నిర్వాహకుల కోవిడ్‌-19 మహమ్మారి నేపధ్యంలో లేటు ఫీజు అనేది పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. 
బహుమతిగా భావించి..
ఆ పేస్‌బుక్‌ పోస్టులో లైబ్రరీ ప్రతినిధి.. ఈ ఉదంతం నుంచి మనం ఒక విషయం తెలసుకోవాలన్నారు.. ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా లైబ్రరీ నుంచి తెచ్చిన ఏ పుస్తకమైనా దుమ్ము, ధూళి బారిన పడి ఉంటే, దానిని వెంటనే లైబ్రరీకి తిరిగి ఇవ్వండి. మేము వాటిని బహుమతులుగా భావించి, ఆ పుస్తకం తీసుకుని వెళ్లినవారికి ఎటువంటి ఫైన్‌ వేయబోమని తెలిపారు. 

చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement