సమాజాన్ని తీర్చిదిద్దేది కుటుంబమే! | Sakshi
Sakshi News home page

సమాజాన్ని తీర్చిదిద్దేది కుటుంబమే!

Published Mon, Nov 10 2014 12:40 AM

సమాజాన్ని తీర్చిదిద్దేది కుటుంబమే!

కుటుంబం ప్రేమను పంచిపెట్టే విలువల కేంద్రం. కాలంతోపాటుగా మారే విలువలకు అనుగుణంగానే కుటుంబ బండి నడుస్తుంది. కారల్‌మార్క్స్ నుంచి గాంధీ వరకు ప్రపంచ ప్రముఖుల జీవితాలను చూస్తే, తమ పిల్లలు, భార్యపట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం తెలుస్తుంది. వాళ్ల మానవీయ కోణాలు అర్థమవుతాయి.
 
చరిత్రను సృష్టించేది సామాన్యులే. మనిషి భూ మ్మీదపడి ఎరుక మొదలైన దగ్గర నుంచి విలువలతో జీవించటం ఉన్నతమై నది. ఎలా జీవించాలనేది ఎవరికివాళ్లు స్వతంత్రంగా తయారు చేసుకునే జీవిత పాఠం. దీనికి సిలబస్ నివసించే ప్రదేశం, ప్రధానంగా ఇల్లే. ఇల్లు చూస్తే వ్యక్తిగతంగా కనిపిస్తుంది కానీ ఇల్లు సామాజికాం శంలో అత్యంత ముఖ్యమైనది.

ఎదుటివాళ్లపై విమర్శలు చేసేటప్పుడు ఫలానా వ్యక్తి తన కుటుంబం తాను చూసుకున్నాడు కానీ సమాజాన్ని ఏం పట్టిం చుకున్నాడని ధ్వజమెత్తుతారు. దీన్ని విశ్లేషించేటప్పుడు అది పూర్తిగా వాళ్ల సొంత కుటుంబ వ్యవహా రంగానే చూస్తారు. కానీ సమాజంలో సహజీవనం చేస్తున్న కుటుంబం లేదా ఆ కుటుంబ సభ్యులు సమాజానికి ఏమీ చేయకపోయినా బాధలేదు.

కానీ నష్టం చేసే పని చేయకూడదు. కుటుంబం తీర్చిది ద్దుకోవటానికి కావాల్సిన విలువలను మాత్రం సమాజం అందివ్వాలి. అప్పుడు కుటుంబాలలో నుం చి పొదుగుకొచ్చే  విలువలు ఆ సమాజానికి రక్షగా ఉంటాయి. ఇందుకు పెద్ద తాత్త్విక చింతనలు, సిద్ధాంతాలు అక్కర్లేదు కానీ ఆ సమాజం తాలూకు మంచి విషయాలను మాత్రం జాగ్రత్తగా గమనించా లి. ఆ సమాజం అందించే విలువల తాలూకు మా ర్పులే సమాజ పరిణామక్రమాలుగా మారుతాయి.

ఇటీవలే మా కవి మిత్రుడు బెల్లియాదయ్య తండ్రి సాయిలు పరమపదించిన సందర్భంగా నల్లగొండ జిల్లా నక్రేకల్ దగ్గర పాలెం గ్రామానికి వెళ్లాం. ఆయనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధిం చిన గుర్తింపూ లేదు. ఆస్తిపాస్తులు అంతగా లేవు. కోటానుకోట్ల పేదలలో ఆయనొక సాధారణ మనిషి. కానీ విలువలున్న మంచి మనిషని అక్కడి కొచ్చిన వాళ్లంతా ఆయన గురించి చెప్పుకున్నారు. ఆయన గడిపిన పూర్ణ జీవితం కుటుంబ విలువలలో సామాన్యుల జీవన తాత్వికతను అచ్చంగా ప్రతిఫ లించింది. సాయిలు ఏమీలేని తనం నుంచి రెక్కల కష్టం మీదనే ఆధారపడి జీవించాడు. గొర్రెలను మళ్లించిన వాళ్లంతా క్రీస్తులు కారు.

సాయిలు మా త్రం కుటుంబ పోషణకు గొర్రెలు కాశాడు. భూమి కౌలుకు తీసుకున్నాడు. దుక్కిదున్నాడు. తన నలు గురు కొడుకుల్ని జీవితంలో నిలబెట్టాడు. తన బిడ్డలకు మానవీయ విలువలను నేర్పాడు. వాటిని కూడా బోధనల ద్వారా కాకుండా ఆచరణాత్మకంగా ఆచరించి మరీ చూపాడు. సాయిలు ఇల్లు గుడిసె కావచ్చును కానీ దాన్ని మానవీయ విలువలు పొది గిన నిలయంగా మార్చాడు. తన తండ్రి తన తల్లితో ఏనాడు అమర్యాదగా వ్యవహరించలేదని బెల్లి యాదయ్య గుర్తు చేసుకున్నాడు. అనురాగాలను పంచుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసుకుం టూ పోయిన చిలకాగోరింకల గూడు అది.

తన తండ్రి తల్లిని గౌరవించటం, ఆమె మాటలకు విలువనిచ్చి అన్యోన్యంగా కలిసిమెలసి జీవించే జీవ న నిర్మాణ సూత్రాలను ఆ కుటుంబం పాటించింది. ఇతరులను గౌరవించటం తోటి వారిపై ప్రేమ కలిగి ఉండడం, పక్కవారికి ఇబ్బంది కలుగకుండా ఎలా జీవించాలి? తదితర సామాజిక విలువలను, మానవీయ ఆలోచనలను ఎక్కువ భాగం కుటుం బం నుంచి నేర్చుకునే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. బెల్లి యాదయ్య ఆయన సోదరులు తన తండ్రి నుంచి వీటిని నేర్చుకున్నారు. ఆ కుటుంబం లో ఇద్దరు కొడుకులు వూర్లోనే వ్యవసాయం చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు.

ఇంకొక కొడుకు సైని కునిగా సైన్యంలో పని చేస్తున్నాడు. యాదయ్య తెలుగు ఆచార్యునిగా నిలిచాడు. ఆ కుటుంబాన్ని చూస్తే సామాజిక శాస్త్రంలోని ఒక అధ్యాయంను చదివినట్లయ్యింది. కుటుంబాన్ని తన చేతులతో పెంచి పెద్ద చేసిన మనిషి అంతర్థానం అయినప్పు డు దుఃఖమొక్కటే తోడుగా ఉంటుంది. అందు లోంచి అంతర్థానమైన మనిషి ఒక తలపోతగా జీవి స్తాడు. ఆ తలపోతలతో మళ్లీ జీవనయానం మొద లవుతుంది. ఇదే జీవన ప్రస్థానంగా కొనసాగు తుంది. సాయిలు లాంటి వ్యక్తుల జీవితాలే మానవీయ విలువలుగా విరబూస్తాయి. చర్రిత తన చుట్టూ తా ను తిరుగుతూ సామాన్యుల చుట్టూ తిరుగు తుంది.

కుటుంబం ప్రేమను పంచిపెట్టే విలువల కేంద్రం. కాలంతోపాటుగా మారే విలువలకు అను గుణంగానే కుటుంబ బండి నడుస్తుంది. కారల్ మార్క్స్ నుంచి గాంధీ వరకు ప్రపంచ ప్రముఖుల జీవితాలను చూస్తే, తమ పిల్లలు, భార్యపట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం తెలుస్తుంది. వాళ్ల మానవీ య కోణాలు అర్థమవుతాయి.

ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన సామాజిక సం బంధాలు మానవీయ సంబంధాలను శక్తివంతంగా ప్రతిష్టించాయి. కుటుంబంలో నాటే సమానత్వపు ఆలోచనలు, విలువలే సమాజంలో ప్రతిఫలిస్తుం టాయి. ఉత్పత్తి కులం నుంచి వచ్చిన సాయిలు కుటుంబం చూస్తే అది మానవీయ విలువలను ప్రతిష్టించింది. కుటుంబంలోని సామూహిక ప్రజా స్వామ్యం కాలాన్ని బట్టి మార్పుకు గురవుతుంది. సమష్టి ఆలోచనలు, సమష్టి విలువలు సంఘర్షణకు గురవుతున్నాయి. సామాజిక సంబంధాలకు సంబం ధించిన మార్పులు కుటుంబం నుంచే జరగాలి.

సామాజిక మార్పుతోనే రాజ్యంలో కూడా మార్పులు సంభవిస్తాయి. వ్యక్తి నుంచి కుటుంబం పరివర్తన చెందటం సామాజిక మూలాల నుంచే జరుగుతుంది. సమాజంలోని మూలాలే మానవీయ సంబంధాలను ప్రతిఫలిస్తాయి. మనం ఎంత కాద నుకున్నా ఇప్పుడు మార్కెట్ సమాజంలో ఉన్నాం. దాని ప్రభావం కుటుంబాలపై తీవ్రంగా పడుతుంది.

ఇక్కడే ఉత్పత్తి కులాలకు చెందిన కుటుంబాలు సమాజానికి అందించిన విలువలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మన సమాజ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనావేసుకొని అర్థం చేసుకోగలుగుతాం. సమాజంతోపాటు మారే విలు వలు మానవీయ విలువలను కాపాడే విధంగా ఉ న్నాయోలేవో చూడాలి. సమున్నత వ్యవస్థల కోసం ప్రజాస్వామిక సమాజాలు ఎదురు చూస్తాయి.

-వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
జూలూరు గౌరీశంకర్

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement