బుధవారం ప్రగతిభవన్‌లో మేడారం జాతర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో డిప్యూటీ సీఎం కడియం, మంత్రి చందూలాల్
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వానించారు. బుధవారం ప్రగతిభవన్ లో వారు సీఎంను కలసి ఆహ్వానపత్రిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మేడా రం జాతర పోస్టర్, సీడీని ఆవిష్కరించారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎం మంత్రులను కోరారు. ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
మేడారం జాతర కోసం చేసిన ఏర్పాట్లను కడియం ముఖ్యమంత్రికి వివరించారు. ‘‘2016లో మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.140 కోట్లు, ఈ సారి రూ.80 కోట్లు మంజూరు చేశారు. వీటితో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సారి పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాం. భూపాలపల్లి, పస్రా, తాడ్వాయి నుంచి మేడారం వచ్చే మూడు ప్రధాన రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చాం. టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించాం’’అని కడియం వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment