రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
► వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి చందూలాల్
సాక్షి, యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలు, టూరి జం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కోరారు. శుక్రవారం రాష్ట్ర యువజన సర్వీ సులు, సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై సమీక్షించారు. ప్రతి సంవత్స రం మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను 31జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని సూచిం చారు.
తెలం గాణ అమరవీరులకు నివాళులర్పించి అవతరణ వేడుకలకు నాంది పలకాలన్నారు. రాష్ట్ర యువజన సర్వీసులు, టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపిక చేసి జిల్లా స్థాయిలో సత్కరిం చాలని కోరారు.పది రంగాల్లో జిల్లా స్థాయిలో ఎంపి క చేసిన వారిని రూ.51,116 నగదు పురస్కారం, శాలువా, మెమోంటోలతో సత్కరించాలన్నారు. అ భ్యర్థుల ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలో జరుగుతుందన్నారు.
జిల్లాలకు గతంలో అవతరణ వేడుకలకు కేటాయించిన నిధులకు సంబంధించి యూసీలను ఈనెల 24లోగా సమర్పించా లని కలెక్టర్లను కోరారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, కళాకారులతో పెద్ద ఎత్తున సాంస్కృతిక సంబరాలు నిర్వహించాలని పేర్కొన్నా రు. జనవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు ప్రతిపాదనలు పంపాలని, అదే విధంగా అక్టోబర్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ రాష్ట్రం అంకుర్పారణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనితారామచంద్రన్, డీఆర్‌ఓ మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి, పౌర సంబంధాల అధికారి జగదీశ్, అడిషనల్ పీఆర్‌ఓ పీసీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.