సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా వ్యవసాయ, అటవీ ఉత్పత్తు లను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చెప్పారు. సోమవారం సచివాలయంలో జీసీసీ వార్షిక ప్రణాళిక విడుదల చేశారు. అనంతరం జీసీసీ కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీసీసీ ద్వారా తేనె అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. గిరిజన ప్రాంతాలు ఇచ్చోడ, బేల, నార్నూరు, ఇల్లెందులలో పప్పు శుద్ధి కర్మాగారాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపిస్తామన్నారు. నిర్మ ల్, ఏటూరు నాగారం, భద్రాచలంలో సబ్బు పరి శ్రమ ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment