పెద్దపల్లి : జిల్లా జెడ్పీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎన్నిక కావడంపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. దీంతో జిల్లాలోని పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సంబరాల్లో సందడి చేశారు. ఎన్నిక అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వెంటేశ్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు ఆనందోత్సహంలో మునిగిపోయారు. వాహనంపై నుంచే కాలు కదుపుతూ చిన్నగా చిందేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుట్ట మధు ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు పేరును ఖరారు చేశారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించడంతో.. పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment