victory celebrations
-
పోరుగడ్డ నుంచి విజయోత్సవాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవు తున్న సందర్భంగా ఈ నెల 19 నుంచి ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మంగళవారం వరంగల్‌లో ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఏడాది పాటు సాగ నున్నాయి. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం సాగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పరి ధిలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. తొలిరోజు వరంగల్‌లో జరిగే ప్రజా విజయోత్సవాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనను న్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లా వేములవాడ, గురువారం మహబూబ్‌నగర్‌లో జరిగే కార్యక్రమా ల్లో కూడా సీఎం పాల్గొననున్నారు. బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.వరంగల్‌లో లక్షమందితో సభప్రజా పాలన విజయోత్సవాలకు ఓరుగల్లు ముస్తా బైంది. లక్ష మంది మహిళలతో మంగళవారం బహి రంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. వేడుకలు నిర్వహించే హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా నామకరణం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ధనసరి సీతక్క, కొండ సురేఖ సహా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొననున్నారు.సీఎం షెడ్యూల్ ఇదీ..సీఎం రేవంత్ మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్లో హనుమకొండ కుడా గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. 3 గంటలకు ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. 3:20కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యల సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు అక్కడి నుంచే వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 సమయంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణుల దాడులు
సాక్షి నెట్వర్క్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ–జనసేన శ్రేణులు మంగళవారం విజయోత్సాహంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేశారు. గుంటూరులోని మంత్రి విడదల రజిని కార్యాలయం, పల్నాడు జిల్లాలో ఓ సచివాలయంతోపాటు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణమండపాన్ని ధ్వంసం చేశారు.విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్‌ను తొలగించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి ఊరేగింపులు చేయరాదని, బాణాసంచా కాల్చరాదని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎంత ప్రచారం చేసినా టీడీపీ–జనసేన శ్రేణులు ఎక్కడా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ దాడులు జరిగాయంటే..» ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముఖ ద్వారం, గేట్‌ను టీడీపీ నేతలు జేసీబీతో కూల్చివేశారు. ఈ ముఖ ద్వారం, గేట్‌ను గ్రామానికి చెందిన దాత ముప్పా సుబ్బారావు కుటుంబ సభ్యులు ముప్పా రోశయ్య పేరు మీద 2010లో సుమారు రూ.5 లక్షలతో పాఠశాలకు వీటిని నిర్మించారు. అనంతరం టీడీపీ నేతలు గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, బీసీ కులానికి చెందిన పెరుగు మాల్యాద్రి ఇంటిని కూల్చడానికి జేసీబీని తీసుకొచ్చి గొడవకు దిగారు. దీంతో మాల్యాద్రితోపాటు అతని భార్య ఆదిలక్ష్మి అడ్డుకోవడంతో టీడీపీ నేతలు వారిపై దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. జెడ్పీ పాఠశాల ముఖ ద్వారాన్ని కూల్చివేసిన జేసీబీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, తెలుగు తమ్ముళ్లు దాని నెంబర్ ప్లేట్‌ను తొలగించడం గమనార్హం. » పల్నాడు జిల్లా కొండూరులో టీడీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండాలతో గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలోకి వెళ్లగానే కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వచ్చి మీ ఓట్లు ఇక్కడలేవు కదా వెళ్లి గ్రామాల్లోనే ప్రదర్శనలు చేసుకోండి అనడంతో గొడవలు ప్రారంభమై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన పోతిపోగు సమాధానం, బండారు వందనం, బుర్రి పుల్లయ్య, పోతిపోగు దేవయ్య, పోతిపోగు యాకోబు, పోతిపోగు మణమ్మ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను అచ్చంపేట పీహెచ్‌సీకి తరలించారు. కోనూరులోను ఇదే పరిస్థితి నెలకొంది. విజయోత్సవం పేరుతో టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో దాడులు నిర్వహించడంతో పలువురు గాయపడ్డారు. బందరులో రాళ్ల దాడి..కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, బందరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కార్యకర్తలు పెద్దఎత్తున వాహనాలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలుండే ప్రాంతాలకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇలాగే రెచ్చగొట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించేందుకు యత్నించారు. కొంతమంది సీనియర్ నేతలు కార్యకర్తలను సముదాయిస్తుండగా కూటమి కార్యకర్తలు కొడాలి నాని అనుచరుల కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో కూటమి కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మద్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల విసురుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.కొవ్వూరులో విధ్వంసం..ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో టీడీపీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోనూ విధ్వంసం సృష్టించారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు కార్యాలయానికి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి అక్కడున్న రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు వారిస్తున్నా వారిని గెంటేసి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వైఎస్సార్సీపీ ప్రచార రథంతో పాటు ఇన్నోవా కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సుమారు 50 మంది యువకులు పది నిమిషాల పాటు భయానక వాతావరణం సృష్టించారు. ఆ సమయంలో వెంకట్రావు కుటుంబ సభ్యులందరూ కార్యాలయంలోనే ఉన్నారు. టీడీపీ దాడితో వారు తీవ్ర భయాందోళన చెందారు. అక్కడ నుంచి టీడీపీ శ్రేణులు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని మెప్మా కార్యాలయం తాళాలు పగులగొట్టి అందులోని కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంలోని రికార్డులన్నింటినీ బయటకు విసిరేశారు. టీడీపీ హయాంలో ఇదే కార్యాలయంలో అన్న క్యాంటీన్ నడిచేది. తాను అన్ని పార్టీల వారితో స్నేహ భావంతో ఉంటానని, ఇలాంటి వి«టద్వంసం తానెన్నడూ చూడలేదని తలారి వెంకట్రావు అన్నారు. » పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్ల వద్ద బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మండలంలోని మండపాక గ్రామంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు ఇంటిముందు వీరు బాణసంచా కాల్చడంతో ఆ నిప్పురవ్వలు పడి ఇంట్లోని దుప్పట్లు, ఇతర సామగ్రి దగ్థమయ్యాయి. » ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. దీంతో పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పలువురు టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ల రెక్కలు విరిచి ద్విచక్ర వాహనాలకు కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత జయచంద్రారెడ్డి కారును పరిటాల సునీత అనుచరులు ధ్వంసం చేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులను ఇళ్ల వద్దకెళ్లి కవ్వించి కొందరిని గాయపరిచారు. టపాసులు పేల్చి ఇళ్లపైకి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయం ధ్వంసం..గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘మండలి’ విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్తూ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఫర్నిచర్, కంప్యూటర్ సామాగ్రి ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బూతులు తిడుతూ కార్యాలయంలోని మొత్తం సామగ్రి పగులగొట్టారు. » చిత్తూరు నగరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని ధ్వంసంచేసి, పెట్రోలు పోసి నిప్పంటించారు. మార్కెట్ హరి అనే వ్యక్తికి చెందిన రూ.కోటి విలువైన సిగరెట్ స్టాకు గోదాముకు నిప్పంటించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్న కన్నన్ నాయకర్, మండీ ప్రభాకర్‌రెడ్డి, ప్రసన్నకు చెందిన హోటళ్లను, బేకరీలను నేలమట్టం చేశారు. పూతలపట్టులోని పాలకూరులో వైఎస్ విగ్రహాన్ని కూలదోశారు. ఎగువ పాలకూరు, బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో దళితుల ఇళ్లలోకి చొరబడి వారిపై దాడులు చేయగా పలువురు గాయపడ్డారు. పూతలపట్టు నయనంపల్లెలో కిరణ్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లెలో కృష్ణమూర్తి యాదవ్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త జేసీబీను అపహరించి, అతని ఇంటి ప్రహరీనే కూల్చేశారు.» పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎండుగుంపాలెం బీసీ కాలనీలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు, గొడ్డళ్ళలో ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి ట్రాక్టర్‌కు కట్టి ఎన్ఎస్పి కాలువ వద్దకు ఈడ్చుకెళ్లారు. పోలీసులు ధ్వంసమైన విగ్రహాన్ని యథాస్థానానికి చేర్చారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలకు ఫ్యాన్లు కట్టి ఈడ్చుకెళ్లారు. పోలీసుల ఆంక్షలున్నా బాణాసంచా కాల్చి భయభ్రాంతులకు గురిచేశారు. తూబాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు రోడ్ల మీద పసుపు నీళ్లు చల్లారు. » గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూల్చేశారు. గ్రామానికి చెందిన దుర్గారావు అనే నేత ట్రాక్టరుతో గుద్దించి విగ్రహాన్ని కూలగొట్టాడు. అతని కోసం వెతుకుతున్నారు. గ్రామస్తులు అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. » గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోదరుడు కర్నుమా ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అద్దాలను టీడీపీ శ్రేణులు పగలగొట్టి దాడికి యత్నించారు. కౌంటింగ్ సందర్భంగా కర్నుమా నాగార్జున యూనివర్శిటీకి వచ్చి అనంతరం కుటుంబ సభ్యులతో కారులో గుంటూరు బయల్దేరారు. టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చి రాళ్లు, కర్రలతో కారుపై అద్దాలు పగలగొట్టి దాడికి యత్నించారు. కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. కర్నుమా కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. » పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ వైఎస్సార్సీపీ నాయకురాలు, గ్రామ సర్పంచ్ చికిలే మంగతాయారు ఇంటి సమీపంలోకి రాగానే కూటమి అభిమానులు తారాజువ్వలు వేస్తూ, మోటార్ సైకిళ్ల సైలెన్సర్లను తొలగించి భీకర శబ్దాలతో నానా హంగామా చేశారు. ఇదే సమయంలో పెదపేటకు చెందిన యువకులతో టీడీపీ–జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఘర్షణలకు పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. » అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దాదాపు పదిమంది గ్రామ సచివాలయానికి చేరుకుని విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించారు. కిటికీ అద్దాలను పగలగొట్టారు. కంప్యూటర్‌పై నీళ్లు పోశారు. ప్రింటర్‌ను, బాత్రూమ్ డోర్లను పగలగొట్టారు. సచివాలయంపైన ఉన్న సింథటిక్ ట్యాంకు పైపులను ధ్వంసం చేశారు. సుమారు రూ.50 వేల మేర నష్టపరిచారు. ఇదే గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడిచేశారు.» ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో ఓ పెట్రోలు బంకుతోపాటు దాని యజమాని ఇంటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడిచేసి రాళ్లు రువ్వారు. దీంతో ఆ యజమాని, మండల వైస్ ఎంపీపీ అయిన వేమూరి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. » ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఒక కూల్‌డ్రింక్ షాపు వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఎన్నికల ఫలితాలపై వాగ్వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కూల్‌డ్రింక్ సీసాలతో దాడి చేసుకున్నారు.ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ లక్కాబత్తుల సిద్ధిరాజు, లక్కాబత్తుల సురేష్, బిరుదుగడ్డ కిరణ్, అల్లాడ సురేష్, లక్కాబత్తుల జాన్‌బాబు, బిరుదుగుడ్డ కల్యాణ్, డీజే రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఒక విలేకరి సెల్‌ఫోన్‌ను లాక్కుని అతడిని గాయపరిచారు. మరోవైపు.. ఇక్కడి కూటమి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిమిత్తం ఎస్సై సతీష్‌తో ఘర్షణకు దిగారు.» ఇదే జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి, అంబర్‌పేట, సూరప్పగూడెం, కురెళ్లగూడెం, భీమడోలు తదితర గ్రామాల్లోనూ గొడవలు చోటుచేసుకున్నాయి. పోలసానిపల్లిలో జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ చేసుకుంటూ ఎంపీటీసీ అంబటి దేవీ నాగేంద్రప్రసాద్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, ఎంపీటీసీ కుమారుడు, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అధిక సంఖ్యలో ఉన్న జనసేన కార్యకర్తలు ఎంపీటీసీ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులపై దాడిచేశారు. వారి దుస్తులను చించివేశారు. అలాగే, అంబర్‌పేట రైతుభరోసా కేంద్రంలోకి చొరబడిన టీడీపీ కార్యకర్తలు రూ.1.50 లక్షల విలువైన కంప్యూటర్, íప్రింటర్లు, ర్యాక్‌లు, కుర్చీలను ధ్వంసం చేశారు. సిబ్బంది ఎంత వారించినా టీడీపీ కార్యకర్తలు వినలేదు.విడదల రజిని కార్యాలయం అద్దాలు ధ్వంసం..గుంటూరులో టీడీపీ శ్రేణులు ఎన్నికల విజయోత్సవంలో భాగంగా పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరి వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు నినాదాలు చేసి కార్యాలయంపై రాళ్లు విసిరారు. అక్కడున్న పోలీసు సిబ్బంది వారిని వారించినా లెక్కచేయకుండా కార్యాలయం అద్దాలను పగులగొట్టారు. కార్యాలయం షట్టర్లు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసు అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. అయినా టీడీపీ కార్యకర్తలు పోలీసులను లెక్కచేయకుండా కార్యాలయంపై రాళ్లు విసిరారు. » పల్నాడు జిల్లా కొచ్చర్ల సచివాలయంపై మంగళవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. ఇరు పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కర్రలు, గడ్డపార్లతో సచివాలయంపై దాడిచేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం లోపల ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసంచేసి సర్పంచ్ కుర్చీని బయటపడేసి తగలబెట్టారు. లోపలున్న కంప్యూటర్ను, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం పైకెక్కి టీడీపీ జెండాను ఏర్పాటుచేశారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయంపైకి రావడంతో సచివాలయ సిబ్బంది పరుగులు తీశారు. పోలీసులు వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. » ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్సార్ పేరును టీడీపీ నేతలు తొలగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీడీపీకి సానుకూలంగా ఫలితాలు రావడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ వద్దకు వెళ్లి, మెయిన్ గేటు వద్ద ఉన్న పేరును కాళ్లతో తన్ని ఊడగొట్టడంతో పాటు, భవనం పైకెళ్లి పేరులోని వైఎస్ అక్షరాలను తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీ అక్షరాలను పెట్టారు. » పల్నాడు జిల్లా వినుకొండ కారంపూడి రోడ్డులోని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణ మండపాన్ని మంగళవారం కొంతమంది అల్లరి మూకలు రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. కళ్యాణ మండపంలోని అద్దాలను పగలగొట్టడమే కాకుండా అక్కడున్న కారును కూడా కాళ్లతో తన్నుతూ సుమారు అరగంటసేపు విధ్వంసం సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలపై కల్యాణ మండపంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టి వెళ్లిపోయారు. దీంతో అక్కడ సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. -
అమెరికాలో కాల్పులు.. ఒకరి దుర్మరణం
కాన్సాస్ సిటీ: అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం కాన్సాస్ సిటీలో కాల్పులు చోటు చేసుకు న్నాయి.. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మంది చిన్నారులు సహా మరో 22 మంది గాయాలపాలయ్యారు. బుధవారం సూపర్ బౌల్ చాంపియన్ షిప్ గెలుచుకున్న జట్టు విజయోత్సవాలు జరుపుతున్న వేళ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. దీంతో జనమంతా భయంతో కేకలు వేస్తూ తలోదిక్కుకు పరుగులు తీయడంతో అంతా గందరగోళంగా మారింది. కాల్పులకు కారకులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. మరో ఘటనలో.. రాజధాని వాషింగ్టన్లో బుధవారం ఉదయం పోలీసు అధికారులు జంతు హింస కేసులో జూలియస్ జేమ్స్ అనే వ్యక్తికి వారెంట్లు ఇచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతడు ఇంట్లో ఉండే పోలీసులపైకి కాల్పులకు దిగాడు. ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. కొన్ని గంటల అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు
-
అమృత్ సర్ లో ఆప్ భారీ విజయోత్సవ ర్యాలీ
-
కమెడియన్ TO సీఎం
-
టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు:కాకాణి
-
టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు:కాకాణి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డిలు అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని తెలిపారు. రూ.లక్ష కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్ జమ చేశారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాదరణతో వైఎస్సార్సీపీ మెజారిటీ గతానికంటే పెరుగుతోందన్నారు. ఎన్నికల కమీషన్ అడ్డుపెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఓటమిని ముందే పసిగట్టి బహిష్కరణ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ 65 స్థానాలకి ఎన్నిక జరిగితే 63 స్థానాల్లో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని తెలిపారు. ఆరుకి ఆరు జడ్పీటీసీలూ కైవసం చేసుకొన్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే స్థానిక సంస్థల్లో ఓట్ల శాతం పెరిగిందని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికకీ ప్రజాదరణ పెరుగుతోందని, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమం వల్లే జిల్లాలో ప్రతిపక్షానికి ఒక్క జడ్పీటీసీ కూడా దక్కలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వానికి రాష్ట్రంలో తిరుగులేదని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. -
గులాబీ గుబాళింపు.. వాడిన కమలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమతికి మళ్లీ జోష్ వచ్చింది. ఒక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కమలం చేతిలో ఉన్న స్థానాన్ని కూడా చేజిక్కించుకుని సత్తా చాటింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. అయితే మొదటి ప్రాధాన్య ఓట్లలో సత్తా చాటకపోయినా రెండో ప్రాధాన్య ఓట్లతో రెండు స్థానాలు గెలుపొందడం ఒకింత ఆందోళన కలిగించే విషయమే. ఉత్కంఠగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరిగాయి. మొదటి నుంచి టీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తున్నా.. తీవ్రంగా పోటీ పడాల్సి వచ్చింది. నాలుగు రోజుల పాటు ఊగిసలాడిన విజయం ఎట్టకేలకు అధికార పార్టీ ఖాతాలో పడింది. అయితే ఈ విజయం టీఆర్ఎస్కు అత్యావసరం. రాష్ట్రంలో టీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయని సాగుతున్న ప్రచారానికి దీంతో తెర పడింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన గులాబీ పార్టీకి ఈ విజయం ఉపశమనం కలిగించింది. రాష్ట్రంలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఈ విజయం సొంతం కావడం టీఆర్ఎస్కు లాభించే విషయమే. పైగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో సిట్టింగ్ ఉన్న బీజేపీని ఓడించడం విశేషం. నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు ఈ విజయం అధికార పార్టీకి ఊపిరి పోసింది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహ రావు కుమార్తెను అనూహ్యంగా ఎంపిక చేసి కాంగ్రెస్ ఓట్లకు గాలం వేసింది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి బలీయమైన నాయకుడుగా ఉన్నారు. ఆ జిల్లాల్లో టీఆర్ఎస్ బలీయంగా ఉండడంతో పల్లా విజయం సునాయాసంగా జరిగింది. అయితే తీన్మార్ నవీన్, ప్రొఫెసర్ కోదండరాం గట్టి పోటీ ఇవ్వడం టీఆర్ఎస్ అప్రమత్తం కావాల్సిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయని రాజకీయ వర్గాలు భావించగా ఆ అంచనాలు ఈ ఫలితాలు తలకిందులు చేశాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు పీఆర్సీ తదితర ప్రకటించకపోవడం టీఆర్ఎస్కు నష్టం కలిగిస్తాయని భావించారు. నిరుద్యోగులంతా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని చర్చ నడవగా.. అలాంటిదేమీ లేదని ఈ ఫలితాలు నిరూపించాయి. అయితే మొదటి ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించకపోవడం టీఆర్ఎస్కు లోలోపల ఒకింత అసహనం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులు టీఆర్ఎస్కు ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పట్టభద్రులు ఈ ఉత్కంఠ ఫలితం ఇచ్చారు. ఈ విజయం ఊపుతో గులాబీ పార్టీ నాగార్జున సాగర్ ఎన్నికకు వెళ్లనుంది. దీని ప్రభావం సాగర్ ఎన్నికపై స్పష్టంగా పడే అవకాశం ఉంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ పరిధిలోనే నాగార్జున సాగర్ ఉండడంతో గులాబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానం కోల్పోవడం బీజేపీకి జీర్ణించుకోలేని విషయం. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో జోరు మీదున్న కాషాయ పార్టీకి పట్టభద్రుల తీర్పుతో నిరాశ ఎదురైంది. సాగర్ ఎన్నిక ముందు ఈ ఫలితం రావడం కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. -
సంబరాల్లో అపశ్రుతి.. తెలంగాణ భవన్లో మంటలు
-
సంబరాల్లో అపశ్రుతి.. తెలంగాణ భవన్లో మంటలు
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తెలంగాణ భవన్ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణిదేవీ గెలుపొందడంతో శనివారం సాయంత్రం టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో మునిగారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి భవనం ఆవరణలో వేసిన చలవ పందిళ్లపై పడ్డాయి. దీంతో చలవ పందిళ్లకు మంటలు అంటుకోవడం కలకలం రేపింది. నిప్పురవ్వలు ఎగిరిపడటంతో చలవపందిళ్లకు పెద్ద ఎత్తున మంటలు రావడంతో వెంటనే కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండో అంతస్తు నుంచి నీళ్లు చల్లడంతో మంటలు ఆరిపోయాయి. ఈ సమయంలో అక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మంటలు ఆరిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చింది. -
ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు..
సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానులు అఖండ విజయం సాధించడంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాత్రి సంబరాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి నృత్యాలు చేశారు. ‘వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జగన్’ నినాదాలు మిన్నంటగా తాడేపల్లి ప్రాంతమంతా మార్మోగింది. ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ ‘వైఎస్సార్సీపీ’ జిందాబాద్ అంటూ నినదించారు. సంతోషంతో పూలు జల్లుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాణసంచా మోతలతో తాడేపల్లి ప్రాంతం దద్ధరిల్లింది. పురపాలక ఎన్నికల్లోనూ ఇదే ప్రభంజనం: మంత్రి బొత్స మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తిన విజయ ప్రభంజనమే త్వరలో జరిగే పురపాలక ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నూరు శాతం స్థానాల్లో విజయ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మూడో విడత ఎన్నికల్లో 90 శాతం వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించడం ఆనంద దాయకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు ఈ ఫలితాలు ఇస్తున్నారన్నారు. కుప్పంలో ఎవరికి ఎక్కువ స్థానాలొచ్చాయో చంద్రబాబుకు తెలియదా అని బొత్స ప్రశ్నించారు. ముందే ఊహించాం: కన్నబాబు మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కుప్పంలో వచ్చిన ఫలితాలు తమకేమీ ఆశ్చర్యం అనిపించలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుందని ముందే ఊహించామని చెప్పారు. కుప్పం అయినా ఇచ్ఛాపురం అయినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అని, ఏపీలో కాకపోయినా.. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పోటీచేసే అవకాశం చంద్రబాబుకు ఉంటుందన్నారు. చంద్రబాబు ఇక పక్క రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి పోటీ చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ -
‘తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటాం’
-
‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!
యూఎస్‌కు అధ్యక్షుడిగా... విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నా. దేశాన్ని రెడ్ స్టేట్స్ (రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత రాష్ట్రాలు), బ్లూ స్టేట్స్ (డెమొక్రటిక్ పార్టీ ఆధిక్యత రాష్ట్రాలు)గా విభజించి చూసే నేతగా కాకుండా.. మొత్తం అమెరికాను ఐక్య అమెరికాగా పరిగణించే ‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిగా ఉంటా. ట్రంప్‌ను ఉద్దేశించి... మీ నిరుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. ఓటమి బాధ నాకు కూడా అనుభవమే. ఇప్పుడు అమెరికాకు అయిన గాయాన్ని కలసి మాన్పుదాం. అమెరికా ఘన చరిత్రను పునర్లిఖించుదాం. ప్రపంచమంతా అమెరికాను మళ్లీ గౌరవించేలా చేద్దాం. కరోనాపై యుద్ధం... కరోనా వైరస్‌ను నియంత్రించే, సౌభాగ్య అమెరికాను పునర్నిర్మించే, ఆరోగ్యాన్ని, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే, జాత్యహంకారాన్ని అంతం చేసే యుద్ధం చేయమని నన్ను ఎన్నుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. వాషింగ్టన్: అమెరికాలో కొనసాగుతున్న రాక్షస పాలనకు తక్షణమే అంతం పలకాలనుకుంటున్నానని ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత అధ్యక్షుడు, తాజా ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. అమెరికా ఎదుర్కొంటున్న బాధాకరమైన చీకటి సమయం అంతం కావడం ప్రారంభమైందని పేర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం శనివారం డెలావర్‌లోని సొంత పట్టణం విల్మింగ్టన్లో అభిమానులను ఉద్దేశించి బైడెన్ విజయోత్సవ ప్రసంగం చేశారు. ‘విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నాను. దేశాన్ని రెడ్ స్టేట్స్(రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత ఉన్న రాష్ట్రాలు), బ్లూ స్టేట్స్(డెమొక్రటిక్ పార్టీ ఆధిక్యత ఉన్న రాష్ట్రాలు)గా విభజించి చూసే నేతగా కాకుండా.. మొత్తం అమెరికాను ఐక్య అమెరికాగా పరిగణించే ‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిగా ఉంటాను’ అని బైడెన్ దేశ పౌరులకు హామీ ఇచ్చారు. దేశంలో కోవిడ్–19ను నియంత్రించడమే అధ్యక్షుడిగా తన తొలి లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తానన్నారు. ‘ఈ బైడెన్–హ్యారిస్ కోవిడ్ ప్లాన్‌ను రూపొందించి, అమలు చేసేందుకు సోమవారం శాస్త్రవేత్తలు, నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాను’ అని వివరించారు. పూర్తి శాస్త్రీయతతో ఆ ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తాను అత్యంత విస్తృతమైన, విభిన్నమైన వర్గాల నుంచి ఓట్లను పొందానన్నారు. ‘నాపై మీరు చూపిన విశ్వాసానికి రుణపడి ఉంటాన’న్నారు. ‘ఈ దేశ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తమ ఆకాంక్షలను నిర్ద్వంద్వంగా తమ తీర్పు ద్వారా వెలిబుచ్చారు. ఒక ఘన విజయాన్ని అందించారు’ అని బైడెన్ పేర్కొన్నారు. 1988, 2008 సంవత్సరాల్లో కూడా బైడెన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడి, ఓడిపోయారు. ‘అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. కానీ, అమెరికా అధ్యక్షుడిగా నేను నాకు ఓటు వేసిన వారికోసం, ఓటు వేయని వారి కోసం కూడా పని చేస్తాను’ అని స్పష్టం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ ఇంకా అంగీకరించలేదు. పెన్సిల్వేనియా సహా కీలక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు వేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. పెన్సిల్వేనియాలో గెలుపుతో సాధించిన 20 ఎలక్టోరల్ ఓట్ల కారణంగానే బైడెన్ మెజారిటీకి అవసరమైన 270 ఓట్ల మేజిక్ మార్క్‌ను చేరుకున్న విషయం తెలిసిందే. ట్రంప్, ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీ నిరుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. ఓటమి బాధ నాకు కూడా అనుభవమే. ఇప్పుడు అమెరికాకు అయిన గాయాన్ని కలిసి మాన్పుదాం’ అని బైడెన్ పేర్కొన్నారు. ‘అమెరికా ఘన చరిత్రను పునర్లిఖించుదాం. ప్రపంచమంతా అమెరికాను మళ్లీ గౌరవించేలా చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ‘మనం శత్రువులం కాదు.. ఒకే దేశస్తులం. అమెరికన్లం’ అని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్‌ను నియంత్రించే, సౌభాగ్య అమెరికాను పునర్నిర్మించే, మీ కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, ప్రజలందరికీ సమన్యాయం లభించే, వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని అంతం చేసే యుద్ధం చేయమని కోరుతూ నన్ను ఎన్నుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను’ అని బైడెన్ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రపంచమంతా ఇప్పుడు అమెరికా వైపు చూస్తోందని, ప్రపంచానికి అమెరికా దిక్సూచి అని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తనయుడికి ఇష్టమైన కేథలిక్ గీతంతో.. తన విజయోత్సవ ప్రసంగాన్ని చనిపోయిన తన కుమారుడు ‘బ్యూ’కు ఇష్టమైన కేథలిక్ గీతంతో బైడెన్ ముగించారు. ‘ఆన్ ఈగిల్స్ వింగ్స్’ అనే ఈ గీతం కోవిడ్–19 కారణంగా తమవారిని కోల్పోయిన ఎందరో అమెరికన్లను ఓదారుస్తుందని భావిస్తున్నానన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో ఈ గీతం తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని వివరించారు. జాన్ ఎఫ్ కెనెడీ తరువాత అమెరికా అధ్యక్షుడు అవుతున్న కేథలిక్.. బైడెనే కావడం విశేషం. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా బ్యూ 2015లో చనిపోయారు. గాయాలను బైడెన్ మాన్పగలరు అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నిౖకైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కమల హ్యారిస్ మాట్లాడుతూ.. ‘మీరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన గాయాలను మాన్పే శక్తి ఉన్న వ్యక్తి’ అని మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్త్రీని మాత్రం కాను. ఎందుకంటే ఈ ఎన్నికలను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చిన్నారులకు వారి ముందున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’ అన్నారు. సమర్థ నాయకురాలు కమల హ్యారిస్ వంటి సమర్ధురాలు ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడంపై తాను గర్విస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ‘కమల హ్యారిస్‌తో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. ఆమె ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన.. తొలి మహిళగా, తొలి నల్లజాతి మహిళగా, దక్షిణాసియాకు చెందిన మూలాలున్న తొలి వ్యక్తిగా, వలసదారుల కుటుంబం నుంచి వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు’ అని ప్రశంసించారు. ఇప్పుడు బైడెన్ కుటుంబంలో కమల కూడా భాగమయ్యారన్నారు. త్వరలో రంగంలోకి బైడెన్ టీమ్స్ బైడెన్ ప్రమాణ స్వీకారం ముందే పని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పనితీరును సమీక్షించేందుకు నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ విభాగాలకు సంబంధించిన బడ్జెట్, ఉద్యోగులు, వివాదాలు, ఇతర నిర్ణయాలను ఈ బృందాలు సమీక్షిస్తాయి. అధికార మార్పిడి సమయంలో పాలనావ్యవహారాలు కుంటుపడకుండా, సజావుగా మార్పిడి జరిగేలా చూస్తాయి. కీలక స్థానాల్లో ఉద్యోగుల బదిలీలతో పాటు, అవసరమైన చోట కొత్త ఉద్యోగుల నియామకాలను పర్యవేక్షిస్తాయి. అలాగే, ఈ విధుల పర్యవేక్షణకు ‘బిల్డ్బ్యాక్బెటర్.కామ్’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. బైడెన్ కమిటీలో భారతీయుడు! కొత్త అధ్యక్షుడు బైడెన్ ఏర్పాటు చేయనున్న కరోనా నియంత్రణ కమిటీలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తికి చోటు లభించే చాన్సుంది. కర్ణాటకకు చెందిన వివేక్త్ కుటుంబం చాలా ఏళ్ల కిందటే అమెరికాలో స్థిరపడింది. ఒబామా హయాంలో సర్జన్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. విల్మింగ్టన్ విజయోత్సవ వేడుకలో వేదికపై కమలా హ్యారిస్ దంపతులు, బైడెన్ దంపతులు విల్మింగ్టన్లో డెమొక్రటిక్ పార్టీ విజయోత్సవ వేడుకల దృశ్యం -
మేరీలాండ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవ వేడుకలు..
మేరీలాండ్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అమెరికా మేరీలాండ్‌లోని ఆ పార్టీ కమిటీ సభ్యులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని విజయ దుందుభి మోగించడం తమకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ వేడుకలకు మేరీలాండ్ పరిసర ప్రాంతాల్లోని వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. దాదాపు 500 మంది సకుంట సమేతంగా ఒకే వేదికను పంచుకోవడంతో.. ఈ సభ ఏపీలో జరుగుతున్నందనే అనుభూతినిచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తెలుగుదనం ఉట్టిపడేలా చేసిన ఏర్పాట్లను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేరీలాండ్ వైఎస్సార్సీపీ ఆర్గనైజర్స్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయం ప్రతి ఒక్క కార్యకర్త విజయమని అన్నారు. ఇంతటి అద్వితీయ విజయాన్ని అందించిన కార్యకర్తలకు , సోషల్ మీడియా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ పాలనను మరిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందించాలన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలు మరిచిపోయేలా.. వైఎస్సార్ సీపీ పాలనలో సంక్షేమ ఫలాలు వారికి చేరుతాయని అన్నారు. వైఎస్సార్ సీపీ భవిష్యత్తులో మరిన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తయారుచేయించిన తెలుగింటి వంటకాలను సభకు హాజరైన వారికి వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని ప్రసన్న కాకుమాని, పార్థ బైరెడ్డి, పవన్ ధనిరెడ్డి, రవి బారెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, వెంకట్ ఎర్రం, రాజ్ ఎరమల, భాస్కర బొమ్మారెడ్డి, సుదర్శన్ దేవిరెడ్డి, నర్సారెడ్డి, సురేశ్ కుప్పిరెడ్డి, నోయల్ కట్ట, జితేంద్ర సాయి పైడిమర్ల, ప్రతాప్ కాకర్ల, రామ్‌గోపాల్ దేవపట్ల, మురళి బాచు, వెంకట్ కీసర, ఆశోక్ చిట్టెల, నాగిరెడ్డి, గిరిధర్ బండి, శివ పిట్టు, శ్రీనివాస్ పూతన, రాజ్‌గోపాల్ గుజ్జాల, కమలాకర్, నివాస్, హితేశ్, శ్రీను గడ్డం, బ్రహ్మ, వాసుదేవారెడ్డి తాళ్ల, శ్రీనివాసరెడ్డి పూసపాటి, సోమశేఖర్‌రెడ్డి, సత్య, కరుణాకర్, రాజ్, విష్ణు బుసిరెడ్డి, రామనంద కొండా, శ్రీనివాస్ యావసాని, వాసు మద్దిశెట్టి, శ్రీధర్ వన్నెంరెడ్డి, రమేశ్‌రెడ్డి, సత్య పాటిల్, శ్రీధర్ నాగిరెడ్డి, వేణు, సుధాకర్ ధనిరెడ్డి, వర్జీనియా నుంచి దిలీప్, నినాంద్, సత్య పాటిల్, వేణు గోపాల్‌లు విజయవంతంగా నిర్వహించారు. పాల్గొన్న సభ్యులందరికి అభినందనలు తెలిపారు. -
ఆనందంలో చిందేసిన ఎంపీ, ఎమ్మెల్యే..
పెద్దపల్లి : జిల్లా జెడ్పీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎన్నిక కావడంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. దీంతో జిల్లాలోని పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సంబరాల్లో సందడి చేశారు. ఎన్నిక అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వెంటేశ్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు ఆనందోత్సహంలో మునిగిపోయారు. వాహనంపై నుంచే కాలు కదుపుతూ చిన్నగా చిందేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుట్ట మధు ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు పేరును ఖరారు చేశారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడంతో.. పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
టీమిండియా సెలబ్రేషన్స్.. ఉలిక్కిపడిన రోహిత్
తిరువనంతపురం: వెస్టిండీస్‌పై వన్డే సీరిస్ నెగ్గిన అనంతరం భారత జట్టు సంబరాలు చేసుకుంది. స్టేడియం నుంచి హోటల్ చేరుకున్న టీమిండియా అక్కడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొంది. ఈ పార్టీలో జట్టు సభ్యలంతా ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకల్లో భాగంగా రోహిత్ శర్మ కేక్ కట్ చేస్తుండగా.. ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో రోహిత్ వెనకాల నిల్చున్న మిస్టర్ కూల్ ధోని, రవీంద్ర జడేజాలు అతని చెవి దగ్గర్లో బెలూన్లను పగులకొట్టారు. దీంతో రోహిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. అప్పుడు రోహిత్ రియాక్షన్ చూసి అక్కడున్న ధోనితో పాటు ఇతర ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత టీమిండియా మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Back at the team hotel after an early wrap and it is time to celebrate.🏆 #TeamIndia #INDvWI pic.twitter.com/qW7mtAoXgq — BCCI (@BCCI) 1 November 2018 -
బంపర్ విక్టరీ సాధించినా.. సంబరాలకు దూరం
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ సంబరాలు చేసుకోరాదని బీజేపీ నిర్ణయించింది. తమ విజయాన్ని సుక్మాలో మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో సంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి తెలిపారు. తమ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్టు బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట హోర్డింగులు పెట్టారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం రిఫరెండంగా మనోజ్ తివారీ పేర్కొన్నారు. ‘ఎంసీడీ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ సర్కారుపై రిఫరెండమని ముందే చెప్పాం. పాలకులను రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలని కేజ్రీవాల్ అడుగుతుంటారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఆయనను రీకాల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని తివారీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆప్ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. -
ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు
వాషింగ్టన్/డమస్కస్: ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధం విధించిన డొనాల్డ్ ట్రంప్‌ను ఐసిస్ సహా పలు జిహాదీ గ్రూపులు వేయినోళ్లా పొగుడుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వెలువడగానే విజయోత్సవాలు జరుపుకున్నాయి. ‘ముస్లింలు ఒక్కతాటికి వచ్చేలా చేసిన గొప్ప వ్యక్తి’ అని ట్రంప్‌ను కీర్తించాయి. సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ ఫర్మానా జారీచేసిన మరుసటి రోజు నుంచి ఉగ్రవాదులు పండుగ చేసుకుంటున్నారని ఐసిస్ అధికారిక వార్తాపత్రిక, అనధికారిక వెబ్సైట్లో వార్తలు కనిపించాయి. ట్రంప్ విధానాలతో విదేశాల నుంచి వచ్చే ముస్లింలేకాక, అక్కడే పుట్టిపెరిగిన అమెరికన్ ముస్లింలను కూడా ఒత్తిడికి గురిచేస్తుందని, దీంతో మరో మార్గంలేని అమెరికన్ ముస్లింలు.. జిహాదీలకు మద్దతుపలుకుతారని ఐసిస్ అనుబంధ వెబ్సైట్ పేర్కొంది. ట్రంప్ అతి త్వరలోనే మధ్యప్రాచ్య(మిడిల్ ఈస్ట్) దేశాలపై యుద్ధానికి దిగుతారని కూడా అభిప్రాయపడింది. సిరియా కేంద్రంగా నడుస్తోన్న ఈ వెబ్సైట్లో వచ్చే వార్తలు, వెల్లడయ్యే అభిప్రాయాలను అమెరికా రక్షణశాఖ కూడా ప్రామాణికంగా తీసుకుంటుండటం గమనార్హం. (ముస్లింలపై నిషేధం: గొంతుమార్చిన ట్రంప్) ట్రంప్ నిర్ణయం వెలువడిన తర్వాత, ఇక ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్ధాదీ అజ్ఞాతంలో దాక్కోవాల్సిన అవసరం లేదని, ధైర్యంగా బయటికి వచ్చి, ట్రంప్‌కు థ్యాంక్స్ చెప్పాలని వెబ్సైట్లో కొందరు కామెంట్లు చేయగా, పశ్చిమదేశాలు ముస్లింల వెంటపడతాయంటూ అవ్లాకీ(ఇరాకీ మాజీనేత) చెప్పిన జోస్యాన్ని ఇంకొందరు గుర్తుచేసుకున్నారు. అమెరికాపై, యూరప్ దేశాలపై దాడులు చేయాలనే తమ లక్ష్యం ఇప్పుడు మరింత సులువు కానుందని జిహాదీలు భావిస్తున్నట్లు షియా ఇంటెలిజెన్స్ గ్రూప్ వెబ్సైట్ పేర్కొంది. అమెరికాకే చెందిన మాజీ అధికారులు సైతం జిహాదీ వెబ్సైట్లలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఏకీభవించారు. ఐసిస్ తన ప్రభావాన్ని మరింత బలంగా చాటుకునేందుకు ట్రంప్ నిర్ణయం సహకరిస్తుందని సెనేట్ ఆర్మడ్ సర్వీస్ కమిటీ మాజీ చైర్మన్ జాన్ మెక్కెయిన్ అన్నారు. సీఐఏ మాజీ ఏజెంట్ రాబర్ట్ రిచర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడుదేశాలపై నిషేధం వ్యూహాత్మక తప్పిదమని అన్నారు. ‘టెర్రరిస్ట్ గ్రూపుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మేం ఏజెంట్లను నియమిస్తాం. తద్వారా దాడులకు సంబంధించిన కొంత సమాచారమైనా మాకు తెలుస్తుంది. అలా అమెరికాకు అనుకూలంగా పనిచేసే గూఢచారులంతా స్థానికులే ఉంటారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో గూఢచారులను తయారుచేయడం అసాధ్యం’అని రాబర్ట్ అన్నారు. -
‘చుట్టాలబ్బాయి’ సందడి
నెల్లూరు, సిటీ : నగరంలో చుట్టాలబ్బాయి చిత్ర బృందం గురువారం సందడి చేసింది. చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా హీరో ఆది, డైరెక్టర్ వీరభద్ర నర్తకి థియేటర్లో హంగామా చేశారు. అభిమానుల అరుపులు, కోలాహాలం మధ్యన కొంతసేపు ప్రేక్షకులతో మాట్లాడారు. హీరో ఆది అభిమానులు కోరిక మేరకు చిత్రంలోని ఓ డ్యాన్స్ స్టెప్ వేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో డైరెక్టర్ వీరభద్ర మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో ఓ భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. హీరో ఆది మాట్లాడుతూ నా తొలి చిత్రం ప్రేమకావాలి నర్తకీ «థియేటర్లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపారు. విజయోత్సవ యాత్రలో భాగంగా అప్పట్లో ఇదే నర్తకీ థియేటర్‌కు వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. నా విజయయాత్ర ఇక్కడి నుంచే మొదలైందన్నారు. నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమా చుట్టాలబ్బాయి విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రానున్న రోజుల్లో మంచి చిత్రాల్లో నటిస్తానన్నారు. ప్రస్తుతం ఏ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి, నర్తకీ థియేటర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.