నేటి నుంచి కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన వేడుకలు
వరంగల్ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి రేవంత్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవు తున్న సందర్భంగా ఈ నెల 19 నుంచి ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మంగళవారం వరంగల్‌లో ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఏడాది పాటు సాగ నున్నాయి. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం సాగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.
విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పరి ధిలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. తొలిరోజు వరంగల్‌లో జరిగే ప్రజా విజయోత్సవాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనను న్నారు.
బుధవారం సిరిసిల్ల జిల్లా వేములవాడ, గురువారం మహబూబ్‌నగర్‌లో జరిగే కార్యక్రమా ల్లో కూడా సీఎం పాల్గొననున్నారు. బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
వరంగల్‌లో లక్షమందితో సభ
ప్రజా పాలన విజయోత్సవాలకు ఓరుగల్లు ముస్తా బైంది. లక్ష మంది మహిళలతో మంగళవారం బహి రంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. వేడుకలు నిర్వహించే హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా నామకరణం చేశారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ధనసరి సీతక్క, కొండ సురేఖ సహా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొననున్నారు.
సీఎం షెడ్యూల్ ఇదీ..
సీఎం రేవంత్ మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్‌లో హనుమకొండ కుడా గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. 3 గంటలకు ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. 3:20కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యల సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు అక్కడి నుంచే వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 సమయంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment