
తిరువనంతపురం: వెస్టిండీస్‌పై వన్డే సీరిస్ నెగ్గిన అనంతరం భారత జట్టు సంబరాలు చేసుకుంది. స్టేడియం నుంచి హోటల్ చేరుకున్న టీమిండియా అక్కడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొంది. ఈ పార్టీలో జట్టు సభ్యలంతా ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకల్లో భాగంగా రోహిత్ శర్మ కేక్ కట్ చేస్తుండగా.. ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో రోహిత్ వెనకాల నిల్చున్న మిస్టర్ కూల్ ధోని, రవీంద్ర జడేజాలు అతని చెవి దగ్గర్లో బెలూన్లను పగులకొట్టారు. దీంతో రోహిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. అప్పుడు రోహిత్ రియాక్షన్ చూసి అక్కడున్న ధోనితో పాటు ఇతర ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత టీమిండియా మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Back at the team hotel after an early wrap and it is time to celebrate.🏆 #TeamIndia #INDvWI pic.twitter.com/qW7mtAoXgq
— BCCI (@BCCI) 1 November 2018
Comments
Please login to add a commentAdd a comment