
సాక్షి, పెద్దపల్లి: న్యాయవాద జంట గట్టు వామన్‌రావు- పీవీ నాగమణి హత్య కేసులో బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో అతడిని విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్‌ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిట్టు శ్రీను కూడా పట్టుబడటంతో నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడు. వామనరావు దంపతుల హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌కు సమకూర్చాడు.
ఈ క్రమంలో శ్రీను కారు డ్రైవర్ చిరంజీవితో కలిసి శ్రీనివాస్ నడిరోడ్డుపైనే అడ్వకేట్ జంటపై హత్యాకాండకు తెగబడ్డాడు. ఇక సొంత గ్రామం గుంజపడుగులో మృతులతో నిందితులకు నెలకొన్న గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, అదే విధంగా ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కారణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు.
చదవండి: పెద్దపల్లి హత్యలు: సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్
చదవండి: కారు, కత్తులు సమకూర్చింది అతడే!
Comments
Please login to add a commentAdd a comment