
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గాన్ని ఎక్కువ కాలం పాలించిన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే తనపై కక్షగట్టి నిరాధారమైన ఆరోపణలతో రాష్ట్ర మీడియా తనపై కుట్రలు చేస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. మధుకర్ హత్య మొదలు.. చికోటి ప్రవీణ్ హవాలా వ్యవహారం వరకు ఎక్కడా తప్పు చేయలేదని, రాష్ట్ర మీడియా మాత్రం తన ప్రమేయం ఉన్నట్లుగా దుష్ప్రచారం చేస్తోందని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే మంథని ప్రధాన చౌరస్తాలో ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంథనిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాగరాజును ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరే పించానని కోర్టులో కేసు వేశారని, అది నిలువలే దని, తర్వాత మధూకర్ ఆత్మహత్యకు తానే కారణమంటూ హైదరాబాద్, ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి రాద్దాంతం చేశారని, ఆ కేసు కోర్టులో ఉందని, దానిపై కథనాలు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. తాను అక్రమంగా రూ.900 కోట్లు సంపాదించినట్లు మీడియా ప్రచారం చేస్తుందని అందులో వాస్తవం లేదని, చికోటి వ్యవహారంలో మీడియా నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. (క్లిక్: మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..?)
Comments
Please login to add a commentAdd a comment